- ====================================
food is main fuel for human body and is cause for many diseases. Here are some of commonly used food items , fruits & vegetable.
Monday, December 20, 2010
సునాముఖి ,sunamukhi
వృక్షశాస్త్రానికి సంబంధించినంత వరకూ సుమారు నూటికి తొంబై శాతం చెట్లు, చేమలు, పొదలు, లతలు, మొక్కలు, ఆకులు, కాయలు, పండ్లు, పుష్పాలు ఇలా చాలా వరకు మానవ మనుగడకి అండగా నిలుస్తున్న ఔషధులే. మనం వాటి ఉపయోగాలు తెలుసుకోలేక, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం. పరిశుభ్రత పేరుతో పెరటిలో పెరిగే చిన్నా, చితకా మొక్కల్ని పెరికిపారేస్తూ వుంటాం. అందుకు కారణం కేవలం వాటిమీద మనకి సరైన అవగాహన లేకపోడమే. అందుకే ప్రతి మనిషికి, వృక్షశాస్త్ర పరిజ్ఞానాన్ని అందించే భోధనా విధానం గనుక బాగా అభివృద్ధిపరిస్తే ఇటు వృక్షసంతతికీ, అటు పర్యావరణానికీ మేలు జరిగే అవకాశం లేకపోలేదు. మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి మనకి ఉప యోగపడే పొదలాంటి మొక్కల్లో ఒకటి సునాముఖి.
దీని శాస్త్రయనామం కాసియా అంగుష్టిఫోలియా. ఇది సిసల్పినియేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలస్ధానం మధ్య ఆఫ్రికా అటవీ ప్రాంతాలు, అరబ్ దేశాలు. కానీ సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. మన దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు సునాముఖికి పట్టుకొమ్మలని చెప్పవచ్చు. ప్రాంతీయతని బట్టి దీనిని ఇంగ్లీషులో ఇండియన్ సెన్నా, టిన్నెర్వెల్లీ సెన్నా అనీ, హిందీలో సనాయె, సనాకపట్ అనీ, కన్నడలో నెలవరికె, సోనాముఖి అనీ, మళయాళంలో సున్నముక్కి, కొన్నముక్కి అనీ, తమిళంలో నిలవిరారు, నెలవరకారు అనీ, తెలుగులో సునాముఖి, నేలతంగేడు అనీ, సంస్కృతంలో స్వర్ణపత్రి అనీ, గుజరాతీలో నట్ కి సానా అనీ వ్యవహరిస్తారు.
ఇది చాలా చిన్నగా పొదలా పెరిగే మొక్క. దీని ఎత్తు సమారుగు 2 నుంచి 3 అడుగులుండి, సన్నని ఆకుపచ్చని కాండంతో ప్రతి పాయకీ 4-5 జతల ఆకులతో దట్టంగా రెమ్మలు విస్తరించినట్టు పెరుగుతుం ది. సునాముఖి పువ్వులు చిన్నవిగా ఉండి పసుపు రంగులో ఉంటాయి. పొడవుగా ఎదిగే కాడతో 6-7 విత్త నాలు ముదురు కాఫీ రంగులో ఉంటాయి. సునా ముఖి ఆకులు, కాయలు కూడా ఔషధ గుణాలు కలిగి ఎంతో ఉపయోగపడతాయి. దీని ఆకులు, కాయలు ఎండబెట్టి నూరడం ద్వారా సునాముఖి పొడిని తయారుచేస్తారు. ఇది అజీర్తి రోగాలకి, శరీరంలో యిన్ఫెక్షన్స్ని నిర్మూలించడానికి, ఊపిరితిత్తు ల్లోని ఏర్పడిన సూక్ష్మక్రిముల నిర్మూలనకీ, అలాగే ఊపిరి తిత్తులకు మంచి బలాన్ని చేకూర్చడానికీ, కీళ్ళనొపðలకీ, ఉబ్బసవ్యాధికి, ఆయు ర్వేద వైద్య విధానంలో ఔషధ తయారీలో అత్యంత ముఖ్యంగా వాడు తున్నారు. షట్షాకర చూర్ణం, అష్టయాది చూర్ణంగా లభ్యమవుతున్న ఈ ఔషధాలు ఆయుర్వేదపరం గా సునాముఖితో తయారుచేయబడు తున్నవే. అంతే కాక దీనికి ఒంట్లో వేడిని తగ్గించే గుణం విపరీతంగా ఉంది. శరీరానికి మంచి చలువ చేస్తుంది. కంటి సంబంధిత రోగా లని కూడా అరికడుతుంది. సునాముఖి వేరు నుండి తయారు చేయబ డిన ఔష ధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందిం చడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో, రక్త కణాల లోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికీ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక దీనిని సాంధ్రవ్యవసాయ పద్దతిలో చాలా మంది రైతులు సాగుచేస్తున్నారు. ఇది సాధారణంగా ఎర్రమట్టి నేలల్లో, ఓండ్రుమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. పత్తి పండే నేలల్లో దీని దిగుబడి అధికంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
సునాముఖి ఆకుల్లో డయాన్త్రోన్ డైగ్లుకోసైడ్ అనబడే కొత్త గ్లైకో సైడ్ అలోవెూడిన్ కనుగొన్నారు. దీని కాయలలో రేయిన్, క్రైసోఫానిక యాసిడ్ల ఆంత్రాసిన్ గ్లైకోసైడ్, సైన్నోసైడ్ ఏ.బిలు లభ్య మవుతాయి. బీజదళాల్లో క్రిసోఫనోల్, పైసియాన్, అలో ఎవెూడిరియిన్, రీయామ్ ఎవెూడిన్లు, ఆకులు, విత్తనాలలో పెన్నోసైడ్ కాల్షియం, లభ్యమవుతు న్నట్టు శాస్త్రజ్ఞులు పరిశోధనలో కనుగొన్నారు. అయినప్పటికీ దీనిలో లభ్య మయ్యే ప్రధాన మూలకాలు సెన్నోసైడ్ ఎ,బిలు ఔషధ తయారీకి చాలా ఉపయోగపడుతున్నాయి.
సునాముఖీ మొక్కల్ని గుజరాత్లో సముద్రతీర ప్రాంతంలో విస్తా రంగా పెంచుతున్నారు. ఇతర పంటలతో పాటు దీనిని కూడా పెంచుతూ కొందరు రైతులు ఆదాయాన్ని పొందుతు న్నారు. సునాముఖి ఆకులు గృహవైద్య చిట్కాల్లో కూడా విని యోగించడం ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి పూర్వం నుండీ వాడుకగా ఉన్న విషయం అందరికీ తెలిసినదే. సునాముఖి ఆకు ల్ని కొబ్బరినూనెలో నిల్వచేసి నిత్యం తలకి రాసుకుంటూ వుంటే, కేశాలు ఒత్తుగా పెరిగి, దృఢంగా ఉంటాయి. జుట్టురాలకుండా, చుండ్రు పట్టకుండా కాపాడుతుంది. సౌందర్యసాధనాల్లో కూడా సునాముఖికి ప్రముఖస్థానం ఉందని చెప్పవచ్చు.
use full
ReplyDeletethis is very use full
ReplyDeleteIdhi manchi Ayurveda mokka
ReplyDelete