Sunday, September 21, 2014

రోగనిరోధకాలు గా ఆహారపదార్ధాలు

  •  

  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.








  • foods for increase immunity -రోగనిరోధకాలు గా ఆహారపదార్ధాలు

శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వానాకాలం వచ్చే వర్షాలు, కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచు కోవాలి.

సరైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించ వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్‌‌స, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

విటమిన్లు:
విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమాట, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి ఉంటుంది.

జింక్‌:
శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పున…ఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్‌‌స, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.

పెరుగు:
ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.

కెరోటిన్‌‌‌:
ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి.

వెల్లుల్లి:
దీనిలో ఉండే మినరల్‌‌స బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఐరన్‌: 
రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది.

పొటాషియం:
దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీని వల్ల అధిక రక్తపోటుని తగ్గించి శక్తిని పెంచుతుంది.


  •  ============================
 Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment