- ================================
food is main fuel for human body and is cause for many diseases. Here are some of commonly used food items , fruits & vegetable.
Thursday, February 24, 2011
వెండి విశేషాలు,Silver as medicine
ఒకప్పుడు బంగారం కన్నా విలువైనది... సూక్ష్మక్రిమి సంహారిణి... దీని పేరుపై ఓ దేశం... అదే వెండి!వెండి ఒక లోహం గానే తెలిసుంటుంది కానీ, అది సూక్ష్మక్రిములను దరిచేరనివ్వని ఆరోగ్యప్రదాయిని అని చాలా కొద్ది మందికే తెలుస్తుంది. పూర్వపు రోజుల్లో నెలల కొద్దీ సముద్రాల్లో ప్రయాణాలు చేసే నావికులు తమ వెంట వెండి నాణాల్ని తప్పకుండా తీసుకెళ్లేవారు. నీళ్ల క్యాన్లలో వీటిని వేసేవారు. ఇది నీటిలో సూక్ష్మక్రిములను నియంత్రించి నీటిని స్వచ్ఛంగా ఉంచుతుందని వారి నమ్మకం. ఇప్పుడు నీటి శుద్ధతకు వాడే క్లోరీన్, బ్రోమీన్ కన్నా ఇదెంతో శక్తిమంతమైనది. అలెగ్జాండర్ వెండి పీపాల్లోనే నీటిని నిల్వ చేయించేవాడట. ఒకటో ప్రపంచయుద్ధంలో సైనికుల గాయాలకు మందుగా వెండిని వాడారని చెపుతారు. బైబిల్లో కూడా దీని ప్రస్తావన ఉంది.
వెండిని ఆంగ్లంలో సిల్వర్ అంటారని తెలుసు కదా? ఈ పదం పురాతన ఆంగ్ల పదమైన Seolfor నుంచి వచ్చింది. లాటిన్లో సిల్వర్‌ని 'అర్జెంటినమ్' అంటారు. అందుకే ఆవర్తన పట్టిన (పిరియాడిక్ టేబుల్)లో సిల్వర్ సూచికగా Agని వాడుతారు. అర్జెంటినమ్ పేరు మీదనే అర్జెంటీనా దేశానికి ఆ పేరు పెట్టారు. ఈ లోహాన్ని క్రీస్తుపూర్వం 4000 ఏళ్ల క్రితమే కనుగొన్నారని చెబుతారు. నాణాల రూపంలో ఉపయోగించడం క్రీస్తుపూర్వం 700 నుంచి ప్రారంభమైంది. మధ్యయుగకాలంలో పురాతన ఈజిప్టులో బంగారం కన్నా వెండినే విలువైనదిగా భావించేవారు. అయితే ఇది డబ్బుగా చలామణీ అయ్యింది మాత్రం 1158 నుంచి. వెండి కూడా మెత్తని లోహమే కావడం వల్ల ఆభరణాల తయారీలో రాగి, నికెల్, ప్లాటినమ్ వంటి ఇతర లోహాలను వాడతారు.
* ప్రపంచంలో 14 భాషల్లో సిల్వర్ అంటే డబ్బు అని అర్థం.
* ఒక ఔన్సు (28.35 గ్రాములు) వెండిని సాగదీసి 8000 అడుగుల పొడవైన తీగగా మార్చవచ్చు. అలాగే ఒక గ్రెయిన్ (60 మిల్లీగ్రాములు) వెండిని కాగితం కన్నా 150 రెట్లు పలుచని రేకుగా మార్చవచ్చు.
* వెండి తనపై పడిన కాంతిలో 95 శాతం కాంతిని పరావర్తనం చెందించగలదు. అందుకే అద్దాల వెనుక అల్యూమినియాన్నే కాదు, వెండిని కూడా పూతగా వేయచ్చు.
* వెండి మంచి వాహకం కూడా. వేడిని, విద్యుత్‌ని ప్రసరింపజేయగలదు.
వై్ద్యపరముగా:
యాంటిసెప్టిక్ గా,
డిజిన్ఫెక్టెంట్ గా,
కొన్ని కంటి మందులలో ,
కాన్సర్ మందులలొను ,
స్కిన్ వార్ట్స్ మందులలోనూ,......................... వాడుతున్నారు .
No comments:
Post a Comment