- =========================================
food is main fuel for human body and is cause for many diseases. Here are some of commonly used food items , fruits & vegetable.
Sunday, April 10, 2011
లావణ్యానికి సుగంధ తైలం,Aroma oils for body health
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....
అలసిన మనసుకి... అరోమానూనె ఎంతో మేలు చేస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసును ఉత్తేజితపరుస్తుంది. స్నానం చేసే నీటిలో వాడినా.. కొద్దిగా వాసన పీల్చినా.. ఆ ప్రయోజనాల ప్రత్యేకతే వేరు.
ఎనిమిది రకాల సువాసనలను అష్టగంధాలు అని పేర్కొంటారు. ఇవి: కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, అత్తరు మరియు శ్రీగంధం.
పువ్వులు, ఔషధాలు.. ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ నూనెలు.. రోజ్మేరీ, జాస్మిన్, లావెండర్, యూకలిప్టస్, టీట్రీ.. ఇలా పలు రకాల్లో లభ్యమవుతాయి. మానసిక సాంత్వననందిస్తాయివి. ఈ నూనెల్ని పొద్దున పూట కన్నా.. రాత్రిళ్లు వాడటమే మేలు. పొద్దున రాసుకోవడం వల్ల చర్మంలోని గ్రంథులు తెరచుకుని దుమ్ము, మురికి చేరతాయి. ఉదయం రాసుకోవాలనుకుంటే.. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
కురులకు మేలు: శిరోజాలు జిడ్డుగా మారుతున్నాయా.. వాడే షాంపూలో కొద్దిగా టీ ట్రీ నూనె వేసి తలస్నానం చేస్తే.. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.
* జుట్టు పొడిబారడం.. పొట్టులా రాలడం వంటి సమస్యలు వేధిస్తుంటే.. షాంపూలో కొద్దిగా రోజ్మేరీ నూనె కలిపి స్నానం చేయాలి. గాఢత తక్కువున్న షాంపూలను మాత్రమే వాడాలి.
* యాపిల్‌సిడర్ వెనిగర్ కప్పు తీసుకుని అందులో నాలుగు చుక్కల నిమ్మ, లావెండర్, నూనెలు కలిపి గాలిచొరని డబ్బాలోకి మార్చుకోవాలి. తలస్నానం చేసిన తరవాత ఈ మిశ్రమాన్ని చెంచా తీసుకుని మగ్గునీటిలో కలిపి తలపై ధారలా పోయాలి. ఇది జుట్టుకు పోషణని మెరుపునూ తెస్తుంది.
* ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా పొడిబారిన చర్మం కోమలత్వాన్ని సంతరించుకోకపోతే వీట్ గ్రెయిన్ నూనె వాడి చూడండి.
* అలసిన శరీరానికి, మనసుకు ఉపశమనాన్ని అందించే శక్తి.. లావెండర్ నూనె సొంతం. ఈ నూనెను చర్మ సంరక్షణకు పెట్టింది పేరు.
... అరోమా నూనెలతో చేసిన కొవ్వుత్తులను గదిలో ఓ మూల ఏర్పాటు చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది.
మొదటిసారి వీటిని వాడాలనుకున్నవారు నిపుణుల సూచనల మేరకు ఎంచుకోవచ్చు. ఈ నూనెలు ఎప్పుడైనా కళ్లకు తగిలితే.. వెంటనే ఆలివ్‌నూనె అద్ది.. ఆ తరవాత నీటితో కడిగేసుకోవాలి.
ఇవీ జాగ్రత్తలు..
వీటిని కొనుగోలు చేసేముందు నిపుణుల సలహా తీసుకొంటే మంచిది. వందశాతం ఎసెన్షియల్ లేదా నాణ్యమైనవి అని రాసున్న వాటినే ఎంచుకోవాలి.
* అరోమా నూనెల్ని చర్మానికి నేరుగా రాయకూడదు. బాదం వంటి ఇతర నూనెలతో కలిపి రాసుకోవాలి.
* ఎలాంటి అరోమా నూనైనా సరే కొద్దిగా మాత్రమే వాడాలి.
* చర్మానికి కొద్దిగా రాసుకుని.. ఎలర్జీ సమస్య లేదని నిర్థారించుకున్నాకే వాడటం మేలు.
* వీటిని చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి.
---------
సుగంధ చికిత్స (ఆరోమాథెరపీ)-
(Bhavani Shankar Kodali MD, Associate Professor,Karl Frindrich MD),
నొప్పుల సమయంలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంకోసం ఈ సుగంధ చికిత్సను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం ఇటీవల అందరి దుఎష్టిని ఆకర్షిస్తున్నది. నొప్పుల సమయంలో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడంకోసం చాలా మంది అరోమాథెరపీని ఆశ్రయిస్తున్నారు. అరోమాథెరపీ వల్ల ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బాధ తగ్గిన ఆనవాళ్లేమీ లేవు. కానీ నొప్పులు పడే మహిళల్లో ఈ థెరపీ ఒత్తిడి తగ్గించి, బాధను సహించే శక్తిని పెంచుతుంది. సుగంధ చికిత్స ప్రసూతికి సహకరించే వారిలోనూ, సన్నిహితుల్లోనూ ఒత్తిడి తగ్గించి మొత్తంగా ఆహ్లాదకర వాతావరణొ స్రుష్టించడానికి దోహదం చేస్తుంది.
టెక్నిక్: గులాబీ, గంధం, గన్నేరు, ఇతర పుష్పాల నూనెలను స్నానం సందర్భంగా ఉపయోగిస్తారు. తుడుచుకునే బట్టలపై చల్లుతారు. మర్ధన సందర్భంగా కూడా ఈ నూనెలను వాడతారు. గర్భిణీ స్త్రీల శరీరంపై చల్లడం కూడా మరో పద్దతి. నొప్పుల తీవ్రతను బట్టి ఒక్కో దశలో ఒక్కో రకం నూనెను వాడడం మంచిదని కొందరు సిఫారసు చేస్తారు. నొప్పులు తొలిదశలో ఉన్నప్పుడు ప్రశాంతతను ఇచ్చే నూనెలను ఉపయోగించాలని కొందరు సూచిస్తారు. నొప్పులు రెండవ దశకు చేరుకోగానే, అంటే బిడ్డ గర్భాశయం నుంచి బయటకి రావడం మొదలు కాగానే పెప్పర్ మింట్ వంటి నూనెలను ఇవ్వాలని, అది ధీమాను, నైతిక స్తైర్యాన్ని పెంచుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఉపయోగించే కొన్ని నూనెలు, వాటి ధర్మాలను దిగువ ఇస్తున్నాము:
చామోమైల్: చేమంతి పువ్వువంటి. ప్రశాంతతనిస్తుంది. రుతుక్రమానికి ముందు బాధను, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. ముక్కు చీముడు (రైనిటిస్), మొటిమలు, ఎక్జీమా, ఇతర చర్మసంబందమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యూకలిప్టస్: జామాయిల్, దగ్గు, జలుబు, రొమ్పు పడిశం(బ్రాంకైటిస్), వైరస్ నుంచి వచ్చే వ్యాధులు(వైరల్ ఇన్ఫెక్షన్స్), కండరాల నొప్పులు, కీళ సంబందమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది.
జెర్మేనియం: ఒక రసాయనం. కషాయం వలె పనిచేస్తుంది. గాయాలు, పుండ్లు, శిలీంద్రాల నుంచి వచ్చే వ్యాధులను(ఫంగల్ ఇన్ఫెక్షన్స్)ను మాన్చడానికి ఉపయోగపడుతుంది. క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. చర్మసంబందమైన సమస్యలు, గజ్జి, తామర, గాయాలు మానడానికి దోహదం చేస్తుంది. స్వల్పంగా మూత్రకారకంగా పనిచేసే ఈ రసాయనం యాంటీ డిప్రెసెంట్ గా కూడా పనిచేస్తుంది.
లావెండర్: మరువం వంటి ఒక మొక్క. తలనొప్పులను, గాయాలను మాన్చడానికి ఉపయోగపడుతుంది. యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. కీటకాలు కాటువేసినప్పుడు విరుగుడుగా పనిచేస్తుంది. మొటిమలు, వాపులు తగ్గిస్తుంది. నిద్రలేమినుంచి కాపాడుతుంది. స్వల్పంగా డిప్రెషన్ కారకంగా పనిచేస్తుంది.
రోజ్: గులాబీ. గొంతువాపు, ముక్కుపుట్టేయడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. స్వల్పంగా నిద్రకారకంగా పనిచేస్తుంది. రుతుక్రమం ముందు, మెనోపాజ్ సమయంలోనూ కలిగే బాధ, ఒత్తిడి నుంచి ఊరటనిస్తుంది. కామాతురత తగ్గడం వంటి సమస్యలకు కూడా గులాబీ ఉపయోగపడుతుంది.
రోజ్ మేరీ: దవనం వంటి ఒక మొక్క, మానసిక, శారీరక అలసట నుంచి ఊరటనిస్తుంది. మతిమరుపు నుంచి కాపాడుతుంది. ఆస్త్మా, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, ఇతర బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
శాండల్ వుడ్: మంచిగంధం. పొడిగా ఉన్న, పగిలిన శరీరానికి యాంటీ సెప్టిక్ గా ఉపయోగపడుతుంది. మొటిమలు తగ్గించడానికి దోహదం చేస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతతను ఇస్తుంది. ఉత్తేజకారిగా పనిచేస్తుంది.
మార్జోరం: మరువం. తలనొప్పులను, గొంతువాపును, రుతుసంబంధమైన నొప్పిని తగ్గిస్తుంది. నిద్రాకారకంగా పనిచేసి, నిద్రలేమిని నివారిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మొటిమల నివారణకు దోహదం చేస్తుంది.
జాస్మైన్: జాజి పువ్వు. మనోవ్యాకులత(డిప్రెషన్)కు గురైనవారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రసూతికి ముందు తలెత్తే వ్యాకులత నుంచి ఊరటనిస్తుంది. ప్రసూతి నొప్పుల సమయంలో ఉత్తేజకారిగా పనిచేసి, గర్భాశయం విస్తరించడానికి దోహదం చేస్తుంది.
నెరోలి: నారింజ చెట్ల నుంచి తీసే తైలం. నిద్రాకారకంగా పనిచేస్తుంది. వ్యాకులతకు, నిద్రలేమికి, నరాల బలహీనతకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణను వేగిరపర్చుతుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మొటిమలు నివారిస్తుంది. రుతుక్రమం ముందు కలిగే బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మరిన్ని వివరాలకోసం చూడండి:www.aworldofaromatheraphy.com
పరిమితులు
* నేరుగా బాధను నివారించే లక్షణాలు కనిపించవు.
* కొన్ని రకాల తైలాలు కొందరికి మనో వికారాలు(అలర్జీ) కలిగించవచ్చు.
* నొప్పులు పడే చాలా మంది మహిళలకు కొన్ని రకాల తైలాలు పడకపోవచ్చు. కంపరం పుట్టించి, వాంతులు కావడానికి దారితీయవచ్చు.
నొప్పుల సమయంలో సుగంధ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మంచి అధ్యయనాలు ఏమీ లేవు. ఈ చికిత్సవల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి. కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. అందువల్ల ఇది ఒక అనుబంద చికిత్సగా మాత్రమే ఉపయోగపడుతుంది. తమకు బాగా నచ్చే సుగంధ తైలాలను మాత్రమే ఎంపికచేసుకుని ఉపయోగించడం ప్రసూతి మహిళలకు మంచిది. దీంతో కంపరం, వాంతులు కలిగించే తైలాలను ముందుగానే నివారించవచ్చు.
పై సమాచారాన్ని దిగువ పేర్కొన్న ప్రచురణల నుంచి తీసుకోవడం జరిగింది. సుగంధ చికిత్స గురించి మరింత సమాచారం కావాలనుకునే వారు దిగువ సూచించిన పత్రాలు, వెబ్ సైట్లు చూడగోరుతున్నాము:
http://www.childbirthsolutions.com/articles/birth/aromabirth/index.php
http://www.securewebexchange.com/poyanaturals.com/catalog/default.php
No comments:
Post a Comment