- ================================
food is main fuel for human body and is cause for many diseases. Here are some of commonly used food items , fruits & vegetable.
Sunday, November 13, 2011
బత్తాయి,sweat orange
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
బత్తాయి ఒక తియ్యని రూటేసి కుటుంబం కు సంబంధించిన పండ్ల చెట్టు. చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే గుర్తుకొస్తాయి.
ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియాదేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండించడంతో ఇటాలియన్ లైమ్, మెడిటెర్రేనియన్ లైమ్ అని కూడా పిలుస్తుంటారు. ఇరానీయులైతే తీపి నిమ్మ అంటారు.
రుచిలో ఒకేరకంగా ఉన్నప్పటికీ మధ్యధరా, వెురాకోల్లో పెరిగే బత్తాయిలు రూపంలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. వెురాకో రకం తొక్క పలుచగా ఉండి పసుపుతో కూడిన నారింజవర్ణంలో మంచి వాసన కలిగి ఉంటే మధ్యధరా ప్రాంతంలో పెరిగేవి మాత్రం పులుపన్నదే లేకుండా తియ్యగా ఉంటాయి. ఇటీవల పుల్లని నారింజనీ తియ్యని బత్తాయినీ సంకరీకరించి సిట్రస్ బెర్గామియా అనే కొత్త రకాన్ని రూపొందించారు. ఇది తీపి-పులుపు రుచితో చూడ్డానికి నారింజపండులా ఉంటుంది.
No comments:
Post a Comment