Friday, August 1, 2014

ఉలవలు - Horse gram.

 •  

 •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
 •   ఉలవలు , HorseGrams : 
ప్రపంచములో అత్యంత ప్రాచీన ధాన్యము ఉలవలు . దక్షిణాదిలో నూ , ఉత్తరాది కొన్ని గ్రామాలలోనూ ఇప్పటికీ ఇది పాపుల పంట .ఉలవలలో పోటీన్లు , ఐరన్‌ , కార్భోహైడ్రేట్స్ , కాల్సియం , ఫాస్పరస్ , ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చెక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడములోనూ , రక్తపోటు నియంత్రించడములోనూ ఉలవలు ఉపకరిస్తాయి.

ఉలవలు:- Dolichos Uniflorus, Dolichos Biflorus. Eng. Horse gram. సం. కుళుత్ధ, తామ్రబీజ, హిం. కుల్తీ. ఇవి తెలుపు ఎరుపు, నలుపు రంగులుగల మూడు జాతులుగ నుండును. ఉలవలు నవధాన్యాలలో ఒకటి.

 ఉలవయొక్క కషాయము గాని లేక చూర్ణము గాని, వగరుగ, తీపిగ స్వాదుగనుండును. మూలవ్యాధి, మూత్రకృఛ్రము, ఊపిరిగొట్టునొప్పి, మలబద్ధము వీనిని హరించును; కఫమును లేక శ్లేష్మమును కరిగించును అనగా నీరుజేయును; స్త్రీలు బహిష్టు కావడములోని లోపములను (menstural disorders)పోగొట్టును; ప్రసవ స్త్రీల మైలరక్తమును వెడలించును. గురదాల లోని రాతిని కరిగించును;ఆకలి బుట్టించును; ఎక్కిళ్ళు, నేత్రరోగములు  నణచును;

*ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
* ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు.
* మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి.
* ఉలవలను తీసుకోవటంవల్ల మలనిర్హరణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది. మహిళల్లో బహిష్టురక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి.
* ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ‘ఉలవకట్టు’ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. *ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది.
*బోదకాలు, కాళ్లవాపు- ఉలవల పిండినీ, పుట్టమన్నునూ ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకొని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనంచేస్తే హితకరంగా ఉంటుంది.
*లైంగిక స్తబ్ధత: ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
*కాళ్లు, చేతుల్లో వాపులు, నొప్పి: ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. శరీరంలో వ్రణాలు (అల్సర్లు) తయారవటం: పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే బాహ్యంగా, అభ్యంతరంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరితగతిన తగ్గుతాయి.
*మూత్రంలో చురుకు, మంట:ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. మధుమేహం: మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంలో వెంపరి (శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.
*సెగగడ్డలు: ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపుపొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంమీద తయారైన సెగ గడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి.

మూలము : వికీపెడియా .
 • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Thursday, July 31, 2014

Ponnaganti leaves,పోషకాల పొన్నగంటి కూర

 •  

 •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  Ponnaganti leaves,పోషకాల పొన్నగంటి కూర

ఈ కాలంలో పొన్నగంటి కూర ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్‌ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్‌, 'రైబోఫ్లెవిన్‌', పొటాషియం, ఇనుము, మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి. గోధుమ పిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి. అమినో ఆమ్లాలూ శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్‌ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. గౌట్‌, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు. ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.
 • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Saturday, July 26, 2014

Non-Nutritive sweeteners,పోషకాలులేని తీపి చేసే పదార్ధాలు

 •  

 •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

Non-Nutritive sweeteners,పోషకాలులేని  తీపి చేసే పదార్ధాలు : వీటిని ముఖ్యము గా స్థూలకాయులు-శరీరం బరువు పెరగకుండా , మధుమేహము ఉన్నవారు రక్తము సుగరు పెరగకుండా  , రక్తపోటు ఉన్నవారు కొవ్వు పరిమాణము పెరగకుండా ఉండేందుకు వాడుతారు. వీటిని ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ అని , లో కేలరీ స్వీట్నర్స్ అని , పోషక విలువలు లేని తీపిపదార్ధాలని అంటారు.ఆహారము లో యాడెడ్ సుగర్స్ తీపిదనము కోసము వేస్తారు. ఈ యాడెడ్ సుగరు వలన శరీరము బరువు పెరిగి మదుమేహము , రక్తపోటు , గుండె జబ్బులు వచ్చే అవకాశము అదికమవుతుంది. పంచధారకు బదులు గా స్వీట్నర్స్ వాడవచ్చును ... తీపికి , రుచికి డోకా లేకుండా అన్ని పదార్ధాలలో వీటిని వాడవచ్చును . సైడ్ ఎఫక్ట్స్ ఉండవు.

వీటిలో ముఖ్యము గా:
 •    యాస్పర్ టేమ్‌--Aspartame (NutraSweet® and Equal®)
 •    ఎసిసల్ఫేమ్‌-- Acesulfame-K (Sweet One®)
 •     నియోటేమ్‌--Neotame
 •     సాక్కరిన్‌--Saccharin (Sweet’N Low®)
 •     సూక్రలోజ్ --Sucralose (Splenda®)
 •     స్టెవియా--Stevia (Truvia® and PureVia®)
సార్బిటాల్ (Sorbitol) కూడా స్వీట్నర్ లా పనిచేస్తుంది కాని దీనికి కెలోరిఫిక్ వ్యాల్యు ఉంటుంది. మధుమేహం ఉన్నవారు దీనిని వాడుకోవచ్చును .

 • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Wednesday, July 16, 2014

Food substances to improve sex-ability, సెక్ష్ సామర్ధ్యము పెంచే ఆహారపదార్ధాలు.

 •  
 •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

Food substances to improve sex-ability, సెక్ష్ సామర్ధ్యము పెంచే ఆహారపదార్ధాలు.

సరైన ఎరెక్షన్‌ ,అత్యధిక పర్ఫారర్మెన్స్ కోసము కొన్ని పదారమలలు ఉంటాయి  ఇంతకముందులా శృంగారంలో పాల్గొనలేకపోతున్నారా?  చాలామంది అప్పుడప్పుడు ఇలాంటి అనుభవమే ఎదుర్కునే ఉంటారు. సెక్స్ మీద ఆసక్తి తగ్గడానికి మానసికపరమైన సమస్యలతో పాటు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. కానీ చాలామందిలో ఎటువంటి సమస్యలు కనపడదు. అయినా వారిలో ఆ విషయంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. క్రమంతప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటంతో పాటు మీరు తీసుకునే ఆహారంలో ఈ క్రిందవి తప్పకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఇక మీ శక్తికి తిరుగుండదు.

గింజధాన్యాలు... బాదం, జీడిపప్పు, అక్రోట్స్ వంటి  గింజలు క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుంది. అంతేకాదు సంతాన సామర్థ్యాలను పెంచే  సెలీనియం, జింక్ తో పాటు బోలెడన్ని పోషకాలు ఉంటాయి.. వీటితో  పాటు మెదడులో డొపమైన్ స్థాయలు పెంచడానికి గింజ ధాన్యాలు దోహదం చేస్తాయి. డొపమైన్ సెక్స్ కోరికను పెంచడంతో సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కోడిగుడ్లు... రోజంతా పనిచేసి అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం కావచ్చు. ప్రొటీన్లు దండిగా ఉండే గుడ్లు త్వరగా అలసిపోకుండా చూస్తాయి. కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి. స్తంభనలోపంబారిన పడుకుండా చూసే ఆమైన్ ఆమ్లాలు గుడ్లులో లభిస్తాయి రోజూ ఉదయం ఒక గుడ్డు తీసుకుంటే మీరు ఇక అందులో వేరీ గుడ్డే....

స్ట్రాబెర్రీ ; వీటి గింజల్లో జింక్ మోతాదు ఎక్కువ. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికనూ ఉద్దీపింపజేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా  కాకుండా స్ట్రాబెర్రీలను గింజలతో పాటు తింటూ ఉంటాం కాబట్టి జింక్ కూడా దండిగా లభిస్తుందన్న మాట. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా స్తంభన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.

కాఫీ : ఓ కప్పు కాఫీ లో లభంచేటువంటి కెఫైన్‌ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. బ్లడ్ పంపింగ్ ను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్ ను విడుదల చెయ్యడము ద్వారా ఇది రాత్రికి సరిపడా శక్తిని ఇస్తుంది.

ఆస్టర్లు : సెక్సీ రెప్యుటేషన్‌ లో వీటి వాడకము చెప్పుకోతగింది. మినరల్ జింక్ , విటమిన్‌ బి 6 , వీటిలో అధికముగ్గా లభిస్తాయి. టెస్టోస్టిరాన్‌ కు రెండూ కీలకము .

మిరప : దీన్ని తినగానే ముఖము ఉబ్బుతుంది. అంటే రక్తనాళాలు విస్తరిస్తాయి. ముఖములోని రక్తనాళాలే కాకుండా పెనిస్ లోని రక్త సరఫరా మెరుగవుతుంది.

ఉల్లి : ఉల్లిపాయలు , వెల్లుల్లి లోని " ఫిటోకెమికల్ ఎల్లిసిన్‌ " రక్తాన్ని పల్చబరిచి , రక్త సరఫరాను పెంచుతుంది . క్లాట్ లు , క్లాగ్ లు తగ్గిపోతాయి.

 • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Friday, July 11, 2014

Food to reduce fatigue,అలసటను దూరము చేసే ఆహారము
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 Food to reduce fatigue - అలసటను దూరము చేసే ఆహారము :

శారీరకముగా , మానసికముగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది.అలుపు , మత్తు , నిద్రమత్తు , నిస్సతువ లాంటివన్నిటినీ  అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది.మన ఆరోగ్యము పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనము తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది.

అలసటను అధికమించడానికి అవసరమైయ్యే ఆహారపదార్ధాలు - అలవాట్లు :

టిఫిన్‌ తప్పనిసరి -- ఉదయాన్నే కడుపు ఖాలీ గా ఉండడము వలన మనము తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజ , పోషకాలు , కార్బోహైడ్రేట్స్ ఉంటే టిఫిన్‌ తినాలి .

లంచ్ లో ఉండాల్సినవి : మధ్యాహ్నం పూట శక్తి , చురుకుదనము కోసము కార్బోహడ్రేట్సు , ప్రోటీన్లు వున్న ఆహారము తీసుకోవాలి. చురుకుదనాన్ని , మానసిక కేంద్రీకరణను పెంచే న్యూరోట్రాన్సుమీటర్ల కోసము పోటీన్లు పుష్కరముగా లభించే ఆహారము తప్పనిసరిగా తీసుకోవాలి .

ఎక్కువ నీరు త్రాగాలి : శరీరములో తగినంత నీరు లేకపోతే పని సామర్ధ్యము తగ్గిపోతుంది. శరీరము లో నీరు తగ్గిపోవడము వల్ల అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోయి మెదడు పనితనము నెమ్మదిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ 8 గ్లాసులు (1600 -2000 మిల్లీలీటర్ల ) నీరు తాగాలి. దప్పిక అయ్యేవరకు ఆగకూడదు.

ఉపవాసాలు , విందులు వద్దు : బోలెడన్ని పదార్ధాలతో మితిమీరి కేలరీలు అభించే ఆహారము తీసుకోవద్దు .దీనివలన తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. వయసు , స్త్రీ-పురుష బేధము , బరువు , చేసేపని ... ఆధారముగా పోషకవిలువలు గల ఆహారము అవసరము . బోజనము మానివేయవద్దు . మానేస్తే రక్తము లో చెక్కెర శాతము తగ్గి అలసట వస్తుంది. శరీరానికి కావసైన శక్తినిచ్చే తగినన్ని కార్బోహడ్రేట్స్ లేని రకరకాల ఆకర్షనీయమైన చిరుతిండ్లు పనికిరావు . . . వీటిలో విటమిన్లు ఉండవు . పోషకవిలువలు లేని ఆహారపదార్దములు అలసటకు దారితీస్తాయి.

ఐరన్‌ ఎక్కువగా ఉంటే మేలు : శరీరములోని వివిధ అవయవాలకు రక్తము ద్వారా ఆక్షిజన్‌ బాగా సరఫరా కావడానికి ఐరన్‌ దోహదము చేస్తుంది.ఐరన్‌ శరీరానికి సరిపడినంత లభించకపోతే అలసటకు దానితీస్తుంది. ఒకవేళ రక్తహీనత లేకపోయినా ఐరన్‌ శాతము తక్కువగా ఉన్నట్లైతే అలసటకు , మనోవ్యాకులతకు దారితీస్తుంది.

కెఫిన్‌ తో జాగ్రత్త : రోజులో కెఫిన్‌ వున్న కాఫీ , టీ , కోలా లాంటి డ్రింక్సు ఒకటి .. రెండు సాలు తాగినట్లయితే శరీరములో శక్తి పెరుగుతుంది . చురుకుదనము వస్తుంది . అలా కాకుండా రోజులో 5-6 సార్లు మించి కెఫినేటెడ్  ద్రవపదార్ధాలు తీసుకున్నట్లయితే అది ఆందోళనకు , చికాకు కలగడానికి , శారీరక సామర్ధ్యము తగ్గిపోవడానికి దారితీస్తుంది.

యోగర్ట్ : దీర్ఘకాలికంగా అలసటకు గురవడానికి ముఖ్యకారణము జీర్ణక్రయ జరిగే మార్గములో మైక్రో-ఆర్గానిజమ్స్ అసమతుల్యముగా ఉండడమే. రోజులో 200 మి.లీ. యోగర్ట్ (పెరుగు/మజ్జిక ) రెండు సార్లు తీసుకుంటే అలసట లక్షణాలు తగ్గుతాయి.

విటమిన్‌ సి : యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసే విటమిన్‌ ' సి ' ఉన్న ఆహార-పానీయాలు తీసుకుండే శరీరానికి మంచిది , వ్యాదినిరోధక శక్తిని పెంచుతుంది. . రక్తకణాలు తయారీకి , ఫ్రీరాడికల్స్ పారద్రోళి అలసటను తగ్గిస్తుంది. శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే అందుకే మల్టీవిటమున్‌ మాత్రలు రోజూ ఒకటి డాక్టర్ల సలహా తో తీసుకోవాలి .

 • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Sunday, June 22, 2014

Cannabis,మార్జువానా,గంజాయి

 •  

 •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 మార్జువానా ...(గంజాయిని  అలాగే పిలుస్తారు) --గంజాయి Cannabaceae కుటుంబానికి చెందిన వార్షిక ఔషధ మొక్క. ప్రజలు అనేక అవసరముల కోసం చరిత్రలో అన్ని చోట్ల గంజాయిని సాగు చేసారనడానికి ఆధారాలున్నాయి.

పారిశ్రామిక అవసరముల కొరకు నారను, విత్తనముల నుండి నూనెను, ఆహారంను, మందుల తయారి కొరకు ఈ గంజాయి మొక్కను ఉపయోగించారు.

మానసిక, శారీరక ఒత్తిడుల నుండి ఉపసమనాన్ని పొందడానికి ఈ మొక్క యొక్క వివిధ భాగాలను వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.

ఈ గంజాయి మొక్క 5 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Cannabis sativa. ఇది పుష్పించినపుడు విపరీతమైన వాసన చాలా దూరం (అర కిలోమీటరు) వరకు వస్తుంది.

గంజాయి మొక్క మనదేశానికి సుపరిచితం.పూర్వకాలంలో recreational గా హక్కలో వాడేవారు. ధనవంతులు,రాజులు,సామంతులు-స్త్రీలు,పురుషులు కూడా హక్కపీచ్చేవారు.గంజాయిని మెక్సికో దేశంలో మార్జువానా అంటారు. గంజాయిలో 84 cannabinoid drugs ఉన్నాయట. కెనాబిడయాల్,కెనాబినాల్,టెట్రా హైడ్రో కెనాబినాల్ వంటి psycho active పదార్ధాలున్నాయి.అందుకనే గంజాయి పేల్చేవారికి Tension తగ్గటం, మనస్సు తేలిక పడటం,ఆ హ్లదకరంగా feel అవ్వటం ఇత్యాది భావనలు వస్తాయి.మోతాదు ఎక్కువైతే నోరుతడారి పోవటం,కళ్ళు ఎర్రబారటం,హుస్వకాలపు మతిమరుపు ,భయం ఇత్యాది సమస్యలు వస్తాయి.గంజాయి అలవాటైతే వదలనే వదలదని అభిప్రాయం,అనుభవంతో చెప్పిన మాట ఇంతకుముందు జోగులు,సన్యాసులు,బైరాగులు గంజాయి పీల్చేవారు.గంజాయి పీల్చి సంగీతం వింటుంటే ఆ ఆనందమే వేరనేవారు కవులు కూడా. మొత్తం మీద దీన దుష్ర్టభావాలను గ్రహించి 20వ శతాబ్డంలో గంజాయి వాడకాన్ని నిషేధించారు.

ఇటీవల కొంతమంది వైద్యులు ఏమంటున్నారంటే,గంజాయి దుర్గుణాలు గంజాయికి ఉన్న మాట నిజమే కాని ఔషధలక్షణాలు కూడా ఉన్నాయి .గంజయి మొక్కలో మొత్తం 483 కాంపౌండ్స్ ఉన్నాయి.వాటిల్లో 84 కెవాబినాయిడ్స్ ఉన్నాయి.కొన్ని వైద్యంలో పనికి వస్తాయి అంటున్నారు.ఉదాహరణకు cancer treatment తీసుకుంటే chemotherapy వలన ఆకలి చచ్చిపొతుంది; వికారంగా,వాంతి చేసుకుందా మన్నట్లుగా ఉంటుంది.దీనికి గంజాలు మంచి వైద్యం.ఆస్మా(ఉబ్బసం)లో, depression లో కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు. Dronabinol వంటి మందుల్ని గంజాయి నుంచే తీస్తారు.కాని,దుర్లక్షణాలు తక్కువేమీ కావు కాబట్టి నిషేధాన్ని అట్లాగే ఉండనివ్వాలని నిపుణులు అంటున్నారు.

మాదకద్రవ్యాల్లో ఒకటైన మార్జువానాను ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని ప్రాచీన కాలం నుంచి జనం నమ్మకం. అయితే మార్జువానాను ఔషధంగా మోతాదుకు మించి ఉపయోగిస్తే మనుషుల్లో జ్ఞాపక శక్తి నశిస్తుందని, మెదడు పనిచేసే తీరులో అసాధారణ మార్పులు వస్తాయని తాజా పరిశోధనల చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా స్కిజోప్రెనిక్ మానసిక వ్యాధిగ్రస్తులైన వ్యక్తులలో కనిపించే లక్షణాలు మార్జువానాను సేవించే వారిలో కనిపిస్తాయని చెప్పారు.

స్కిజోప్రేనియా బులెటిన్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక వ్యాసం ఈ దిగ్బ్రాంతికరమైన విషయాన్ని బయటపెట్టింది. మానసిక వ్యాధిగ్రస్తులలో కనిపించే తీవ్ర లక్షణాలకు మార్జువానా కారణమవుతోందని అధ్యయనంలో తేలడం ఇదే మొదటిసారి. అమెరికా లో కొన్ని రాస్ట్రాలలో స్వేచ్ఛావిప ణిలో గంజాయి అమ్మకాలు జరగడం కారణంగా నేరాలు పెరిగే వీలుందని భయాందో ళనలు చెందుతున్నవాళ్లూ లేకపోలేదు

గంజాయి శరీర ఆరోగ్యానికి మంచిదేనని కొందరూ, కాదని మరికొందరూ సిగపట్టు పడుతున్న అమెరికాలో పరిశోధన చేస్తున్నారు. మన సాధువులు గంజాయి దమ్ము పట్టిస్తూ, సామూహికంగా అనుభవిస్తూ, అది ముక్తి మార్గానికి సన్నిహితమని నమ్మారు. రానురాను గంజాయి పండించడం, తాగడం, అమ్మడం ప్రపంచవ్యాప్తంగా నేరం కింద ప్రకటించారు. అయినా దొంగచాటుగా పండిస్తూ, వ్యాపారం సాగిస్తున్నారు.మూలము : ఆంధ్రప్రభ 23 Dec 2013

 • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Saturday, June 21, 2014

Alternative substances for sweet(sugar), చక్కెర(తీపి) కి ప్రత్యామ్నాయ పదార్ధాలు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

Alternative substances for sweet(sugar), చక్కెర(తీపి) కి  ప్రత్యామ్నాయ పదార్ధాలు

    తియతియ్యని వంటకాల్ని చూడగానే ఎవరికైనా నాలుక జివ్వున లాగేస్తుంది. ఒక ముక్కయినా నోట్లో పెట్టుకోకపోతే.. మనసు వూరుకోదు. అదేపనిగా అటువైపే లాగేస్తుంది. తీపి తహతహ తీవ్రతే అలాంటిది. మరోవైపు తీపి పదార్థాల్లో ఉండే చక్కెర మనల్ని భయపెడుతూ వెనక్కి నెడుతుంటుంది. మరిలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గమే లేదా? ఇలాంటప్పుడు చక్కెరకు బదులుగా ఇతర పదార్థాల్ని వెదుక్కోవటమే మేలు. చక్కెరకు తేనె, పండ్లు మంచి ప్రత్యామ్నాయాలు. వీటినీ పరిమిత మోతాదుల్లో తీసుకోవటమే మంచిదని హెచ్చరిస్తున్నారు. తీపి విషయంలో నిత్యం మనల్ని వేధించే కొన్ని సందేహాల్ని తీర్చుకుందామిలా..

తేనెతో ఆరోగ్య ప్రయోజనాలేమిటి?
తేనెలో గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం వంటి ఖనిజాలు, బి-కాంప్లెక్స్‌ వంటి విటమిన్లు ఉంటాయి. తేనెలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది సూక్ష్మక్రిమినాశినిగా, యాంటీఇన్‌ఫ్లమేటరీగానూ పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులో కొవ్వు ఉండదు. కాకపోతే.. క్యాలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.

అల్పాహారానికి పండ్లు ప్రత్యామ్నాయమా?
అల్పాహారానికి పండ్లు చక్కని ప్రత్యామ్నాయం. అవి పీచు, ఫ్రక్టోజ్‌, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఎక్కువెక్కువ క్యాలరీలు లేకుండానే వీటన్నింటినీ పొందవచ్చు. పండ్లను చిరుతిండ్లలా కూడా తినొచ్చు.

తీపిని పూర్తిగా పక్కన పెట్టాలా?
చక్కెరను ఎక్కువెక్కువగా తీసుకోవటం వల్ల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పలురకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. చక్కెరను రోజుకు రెండు చెంచాలకు మించి తీసుకోవద్దు. పూర్తిగా మానేసినా మంచిదే. ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, బెల్లం, తేనె వంటివి తీసుకోవచ్చు.

తీపి తహతహను ఎలా అణచుకునేది?
తీపి తహతహను నియంత్రించుకునేందుకు ఇతరత్రా ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. బాగా శుద్ధి చేసిన ఆహార పదార్థాల్ని, ఐస్‌క్రీముల వంటి వాటిని మానెయ్యాలి. నీటిని ఎక్కువగా తాగాలి. పీచు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తినాలి. మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. తీపిపై తహతహ తగ్గుతుంది.
 •  ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Monday, June 16, 2014

Similarity in Fruits,పండ్లను పోలిన పండ్లు , డూప్లికేట్‌ పండ్లు ,

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

భిన్న జాతులకు చెందిన పండ్లు రూపంలో ఒకేలా ఉండటం విశేషం - రూపం అదే... రుచే వేరు. మామిడిపండులానే ఉంటుంది. కానీ మామిడి కాదు. కొబ్బరిబోండాన్నే తలపించినా మరుగుజ్జు రూపం. సీతాఫలంలా కనువిందు చేసినా ఆ రుచి దానికెక్కడ? ఆయా పండ్ల రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న ఈ డూప్లికేట్‌ పండ్ల కథేంటో చూద్దాం! పండుని పోలిన పండ్లూ ఉన్నాయి. రూపం అచ్చు అలాగే ఉన్నా రుచిలోనో సైజులోనో తేడా

మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆయా పండ్ల జాతులు వేరు కావడమే ఇందుకు కారణం.

కాక్విటో నట్స్‌-బుల్లి కొబ్బరి.
ఓ రకం పామ్‌ చెట్టుకి కాసే ఈ కాయల్నే కాక్విటో నట్స్‌ అంటారు. వీటినే మరుగుజ్జు కొబ్బరికాయలనీ మంకీస్‌ కోకోనట్స్‌ అనీ పిలుస్తారు. చిలీ వీటి స్వస్థలం. ఈ చెట్ల నుంచి కారే పాలలాంటి ద్రవాన్ని తేనె, వైన్‌ తయారీలో

వాడతారు. అందంకోసం ఎక్కువగా పెంచే ఈ చెట్ల కాయలు అచ్చం మినీ కొబ్బరికాయల్నే తలపిస్తాయి. రుచి కూడా దాదాపు కొబ్బరిదే. వీటిని పచ్చిగా గానీ ఉడికించి కానీ తింటుంటారు. కొబ్బరి మాదిరిగానే దీని గుజ్జుని

కూడా అన్నిరకాల వంటల్లోనూ వాడతారు.

ప్లమ్‌ మ్యాంగో-చిన్ని మామిడి పండ్లు ,
మాప్రాంగ్‌, ప్లమ్‌ మ్యాంగో అని పిలిచే ఈ పండ్లు చూడ్డానికి చిన్నసైజు మామిడిలానే ఉంటాయి. ఆకులు కూడా అలాగే కనిపిస్తాయి. కానీ, తీపీ పులుపూ కలగలిసిన ఒకలాంటి రుచితో ఉంటాయివి. కాస్తో కూస్తో మామిడినే

తలపించే ఈ చెట్లు ఎక్కువగా ఇండొనేషియా, మలేషియాల్లో పెరుగుతాయి.

పెర్సిమన్‌ పండ్లు -తియ్యని టొమాటో.
చూడ్డానికి అచ్చం టొమాటో పండ్లలా కనిపించినా ఈ పెర్సిమన్‌ పండ్ల రుచి మాత్రం సూపర్‌. వీటిల్లో గ్లూకోజ్‌ శాతం చాలా ఎక్కువ. ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ పండుని నేచురల్‌ స్వీట్‌ అని పిలుస్తారు.

విటమిన్‌-సి, కాల్షియం, ఐరన్‌, పొటాషియంలతోపాటు మరెన్నో విటమిన్లూ ఖనిజాలూ సమృద్ధిగా ఉండే ఈ పండులో ప్రాంతాన్ని బట్టి చాలా రకాలే ఉన్నాయి.

మౌస్‌ మెలన్-పుచ్చదోస.
దీన్ని మెక్సికన్‌ సోర్‌ జెర్కిన్‌ లేదా మౌస్‌ మెలన్‌, సందీతా(స్పానిష్‌లో బుల్లి పుచ్చకాయ అని అర్థం) అనీ పిలుస్తారు. ఒకటిన్నర అంగుళాలు మాత్రమే ఉండి చూడ్డానికి మినీ పుచ్చకాయల్ని తలపించే ఈ కాయలు కొరికి

తింటే మాత్రం అచ్చం కీరా దోసలా కాస్త పులుపుతో కూడిన వగరుతో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు వీటిని ఎక్కువగా తింటారు. తీగకు కాసే ఈ కాయల్ని సలాడ్లలో కూడా వాడతారు. వీటితో పెట్టిన నిల్వపచ్చడి

చాలా రుచిగా ఉంటుందట.

మాతా కుచింగ్‌-రుచిలో ద్రాక్ష... రూపంలో సీతాఫలం.
లేత పసుపురంగులో ఉండే చిన్న సైజు సీతాఫలంలా కనిపిస్తుంది. కానీ అస్సలు కాదు. మాతా కుచింగ్‌గా పిలిచే ఈ పండు వాసన డ్రాగన్‌ ఐ ఫ్రూట్‌ని తలపిస్తే, రుచి మాత్రం ద్రాక్షపండుని పోలి ఉంటుంది. తెరిచి చూస్తే ఒకే

ఒక కన్ను ఉంటుంది. అందుకేనేమో దీన్ని క్యాట్స్‌ ఐ ఫ్రూట్‌ అంటారు. మాతా కుచింగ్‌ అంటే పిల్లి కన్ను అని అర్థమట.

మలక్కా ఆపిల్-జీడిలేని జీడిపండు.
మలక్కా ఆపిల్‌, వాటర్‌ ఆపిల్‌, రోజ్‌ ఆపిల్‌, లిలీపిలీ అనీ పిలిచే ఈ పండ్లు అచ్చం మనదగ్గర కాసే జీడిమామిడి పండ్లను తలపిస్తాయి. దక్షిణాసియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. జామ్‌లూ

జెల్లీలతోబాటు తాజాగానూ వీటిని ఎక్కువగా తింటుంటారు.

ఇవి మాత్రమేనా... టొమాటోలా కనిపించే పేషన్‌పండ్లూ అకాకర లాంటి గాక్‌ పండ్లూ పనస లాంటి డురియన్‌లూ అరటిపండులాంటి ట్యాక్సోలూ... ఇలా మనకు తెలిసినవీ తెలియనవీ ఇంకెన్నో... అయినా భిన్న జాతులకు

చెందిన పండ్లు రూపంలో ఒకేలా ఉండటం విశేషమే.

 • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Friday, May 16, 2014

food items to improve Haemoglobin,హీమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచే ఆహారపదార్ధాలు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 food items to improve Haemoglobin,హీమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచే ఆహారపదార్ధాలు :

ఎనీమియా - రక్తహీనత--స్త్రీలలో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత – రక్తం తక్కువగా ఉండడం ఇది ముఖ్యంగా మూడు కారణాల వలన వచ్చును.

1.పౌష్టికాహార లోపం – ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిలువలుండును. ఇవి గలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.

2.రక్తం నష్టపోవడం – స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో నత్తల ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.

3.రక్తం తయారీలో అవరోధం – జబ్బుల వలన ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు. దీంతో  రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.

లక్షణాలు : నాలిక, కనురెప్పల క్రింద, గోళ్ళు తెల్లగా పాలిపోయినట్లు ఉండడం బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం.

చికిత్సా విధానం : చిన్న పిల్లలకి నట్టలు తొలగించి మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునేలా అలవాటు చేయించాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయసు మధ్యలో గల స్త్రీలందరికి ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.

 food items to improve Haemoglobin,హీమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచే ఆహారపదార్ధాలు :

పుచ్చ : ఈ పండులో అత్యధిక స్థాయిలో ప్రోటీన్లు , కార్బోహైడ్రేట్స్ , పొటాషియం , విటమిన్‌ - సి , బి , ఉంటాయి . ఆహారము లో ఐరన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరము లో శక్తి , ఓపిక పెరుగుతాయి .

బెర్రీస్ : నలుపు ,బ్లూ , క్రౌన్‌ రకము గల బెర్రీలు , స్ట్రా బెరీలల్తో కొన్ని రకాలయిన బెర్రీఅలలో ఐరన్‌ అత్యధికము గా లభ్సుంది. వీటిలో యాంటీ ఆక్షిడెంట్స్ , ఎ, ఇ - విటమనులు  కూడా ఉంటాయి  .

ఖర్జూరము : వెట్ , డరి ఖర్జూరాలు రెండింటిలోనూ ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికము గా ఉండును ఇందులో పొటాహియం మెగ్నీషియం లాల్సియం లు హీమోగ్లోబిన్‌ ను పెంచును , 
పండ్లు - కూరగాయలు , : బీట్ రూట్ , ఆరెంజ్ ,క్యారెట్ , బ్రేక్ ఫాస్ట్ కి ముందు  తాగితే హీమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగును .
మీట్ : మీరు మాంసాహారులైతే  మటన్‌ రెగ్యులర్ గా తింటే మంచి హీమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి , గుడ్లు , షెల్ ఫిష్ .. ఐరన్‌ స్థాయిలు పెంచుతాయి. అత్యధికము గా కెఫిన్‌ , గ్లూటెన్‌ ఉన్న పధార్ధాలు తినకూడదు .

 • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

Sunday, March 30, 2014

Rejuvelac Drink , రెజువెలాక్ డ్రింక్
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

Rejuvelac  పులియబెట్టిన మొలకెత్తిన గింజల నుండి  తయారు చేసే ద్రవం. ఇది పులియబెట్టినందువలన, Rejuvelac లాభదాయకమైన బాక్టీరియా మరియు యాక్టివ్ ఎంజైములు కలిగి ఉండి  విధంగా అది ఆహార జీర్ణక్రియ మెరుగు పర్చునని నివేదించబడింది . Rejuvelac ను పెరుగు , చీజ్ , సాస్ మరియు ఎస్సెన్ వంటి ఇతర పులియబెట్టిన FOODS కోసం ఒక తోడుగా ఉపయోగించవచ్చు . Rejuvelac సంపూర్ణ గోధుమ , వోట్స్, వరి మొక్క , quinoa , బార్లీ , జొన్నలు, buckwheat, వరి మరియు ఇతర రకాల ఉపయోగించి తయారు చేస్తారు . Rejuvelac లేత గడ్డి, మేఘాలు యొక్క రంగు తో ఉండి, ఒక తేలికపాటి భూసంబంధమైన వాసన తోనూ , , lemony వాసన తోనూ మరియు కొద్దిగా ఉప్పగా  రుచి కలిగి ఉంటుంది.

Rejuvelac తయారుచేయు విధానము :  ఏదో ఒక రకము మొలకెత్తిన ధాన్యం(grain) గది ఉష్ణోగ్రత వద్ద  రెండు రోజులు నీటిలో నానబెట్టి  ఆ పై వచ్చిన ద్రవాన్ని శుద్ధి(వడపోసి)డ్రింక్ గా తయారుచేయుదురు.  రెండవ బ్యాచ్ ఇదే మొలకల నుండి కేవలం ఒక రోజునానబెట్టి  , అదే మొలకలు మూడవ బ్యాచ్ కూడా ఒక రోజే నానబెట్టి తయారు చేయవచ్చు . మూడవ బ్యాచ్ సాధ్యమే కానీ రుచి చెడుగా(డిజ్ఎగ్రియబుల్) ఉండవచ్చు . మిగతా గింజలు సాధారణంగా చిన్న జంతువులు ఆహారం గా వాడుతారు).దీనిని
AnnWIGMORE కనిపెట్టారు ... పందుల ఆహారము కోసము కాని ఇది మంచి బలవర్ధకమైన మరియు విటమున్లు తో కూడుకొని ఉన్నందున ఇతర రుచికరమైన పానీయాలతో కలిపి మనుషులు వాడుతూ ఉన్నారు.

Rejuvelac is a fermented beverage that is inexpensive, easy to make, refreshing to drink and FULL of wonderful nutrients for your body. A healthy probiotic, it also has vitamins B, K and E, proteins, and enzymes. It is beneficial to your digestive system, promoting a healthy intestinal environment. It is also a great starter for raw nut cheese

 • ============================ 

Visit my Website - Dr.Seshagirirao...