Monday, November 3, 2014

Body and Nutrients,శరీరం మరియు పోషకాహారం

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
 •  


 •  Body and Nutrients,శరీరం మరియు పోషకాహారం

మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే పని చేయదు. మనం తీసుకొనే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ‘ఇంధనం’ లా పని చేస్తుంది.

ఆహారం మన శరీరానికి ఈ క్రింది మూడు విధాలుగా ఉపయోగపడుతుంది.
1. శరీర నిర్మాణానికి:
మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహద పడుతుంది. 2.7 కిలోల నుంచి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. అంటే ఈ ఎదిగిన బరువంత కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుంచి నిత్యం తీసుకొంటున్న ఆహారం ద్వారానే లభించుతుంది. దీనిని బట్టి తేలేది ఏమిటంటే ఆహారం యొక్క అతి ముఖ్యమైన ఫంక్షన్‌ శరీర నిర్మాణానికి సహకరించటం! పుట్టిన దగ్గరనుంచి పెరిగి పెద్దయేదాకా -అంటే అడల్ట్‌హుడ్‌ దాకా మీరు ప్రతిరోజు ఆహారాన్ని సరెైన పరిమాణంలో తీసుకుంటే అది మీ శరీరంలో అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాల్ని నిర్మించుతూ, మీ శరీరం సక్రమమైన రీతిలో ఎదుగుతూ ఆరోగ్యంతో విలసిల్లుతూ పరిపూర్ణస్థాయికి చేరుకొనేటట్లు చేస్తుంది.

2. శక్తిని చేకూర్చటానికి:
ఆహారం మన శరీరానికి అందజేసే రెండవ ఉపకరణం ఏమిటంటే - మన శరీరం చేసే సంకల్పిత, అసంకల్పిత చర్యలకు అవసరమైన శక్తిని అందించటం. సంకల్పిత చర్యలు అంటే ఇంటిపని నుంచి ఆఫీసు పని దాకా నిత్య జీవితంలో మనం తెలిసి చేస్తుండే - ప్రయత్నపూర్వకంగా చేసే పనులు.
అసంకల్పిత చర్యలు: అంటే మన ప్రయత్నం మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు! ఉదాహరణకు గుండె కొట్టుకో వడం, జీర్ణం కావడం, శరీరంలో టెంపరేచరు క్రమబద్దీకరించబడటం మొదలెైనవి.

3.శరీర కార్యక్రమాన్ని క్రమబద్దీకరించటం:
మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే, జరగాల్సిన, కార్యక్రమాల క్రమబద్ధీకరణ ఈ కోవలోకి వచ్చే చర్యలు:
గుండె కొట్టుకోవటం
కండరాల సంకోచవ్యాకోచాలు
నీటి సమతుల్యాన్ని కాపాడటం
రక్తం గడ్డ కట్టటం
శరీరం నుంచి వ్యర్థపదార్థాల్ని తొలగించటం మొదలెైనవి.
శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తి సరిప డా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్యాహారాన్ని రెగ్యులర్‌గా తీసుకొంటూ ఉండాలి.
మన మనుగడకు అవసరమైన ఆహారం ద్వారా మనకు లభించే పోషక విలువలు:
కార్బోహైడ్రేట్స్‌
మాంసకృత్తులు
కొవ్వు పదార్థాలు
విటమిన్‌లు
ఖనిజ లవణాలు
నీరు
పీచు పదార్థం
సమతులాహారం

మీరు నోట్లో ఆహారాన్ని పెట్టుకున్నప్పుడల్లా ‘మానవ శరీరం’ అనబడే అత్యంత తెలివెైన రసాయన యంత్రాంగానికి మీరు రీ-ఫ్యూయల్‌ చేస్తున్నారన్నమాట! మన శరీరం పని చేయటానికి ఆహారం, నీరు - ఈ రెండూ అతి ముఖ్యమైన పోషకావసరాలు.మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకరమైన బాక్టీరియాలతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతరత్రా మరెన్నో శరీర ధర్మ నిర్వహణల కోసం ఆహారం ద్వారా లభించే అనేక రసాయనాలు శరీరానికెంతగానో అవసరమవుతాయి.

కొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కొన్నింటిలో తక్కువ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని తీసి పారేయటానికి వీలులేదు. మనం ఎంత తింటు న్నామన్నది మాత్రమే కాదు. ఏమి తింటున్నామన్నది కూడా ముఖ్యమైన అంశమే.కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని వ్యాధుల్ని నిరోధించగలవు. నియంత్రించగలవు. ఇందుకు
ఉదాహరణ: పండ్లు, కూరగాయలు క్యాన్సర్‌ వ్యాధిని నిరోధించగలవు. ఆహార పదార్థాలలోని పీచు (ఫెైబర్‌) కొలెస్టరాల్‌ నియంత్రణకు సాయపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ‘అస్టియోపొరాసిస్‌’ వ్యాధిని నిరోధించటానికి కాల్షియం అధికంగా లభ్యమయ్యే పాలులాంటి వాటిని తీసుకోవాలి. ‘ఆస్టియోపొరా సిస్‌’ కారణంగా ఎముకలు బోలుబారి తేలికగా విరుగుతాయి.

ఈ రకంగా...
శరీరారోగ్యానికి అవసరమైన ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుం టూ, ప్రాధాన్యతనిస్తూ, మనం సక్రమమైన ఆరోగ్యంలో ఉండటానికి ఏ ఏ ఆహార పదార్థాలను ఏఏ మేర తీసుకోవాలన్న విషయమై అమెరికా శాస్త్రజ్ఞులు ‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’ అన్న పేరుతో ఆహార నియమావళిని రూపొందించారు.

‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’
ప్రకారం మనం: అన్నం, రొట్టె, బ్రెడ్‌ వగెైరాలు: వీటిని ఎక్కువగా వాడుకోవాలి. ఈ ఆహార పదార్థాలలో ఫెైబర్‌, ‘బి’ విటమిన్‌లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్స్‌ కూడా లభిస్తాయి.
పళ్ళు:వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉంటాయి. విటమిన్‌లు ‘ఎ’,‘సి’ లాంటివి అధికంగా లభిస్తాయి. పొటాషియం, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా లభించటమే కాక ఫెైబర్‌ అధికంగా లభిస్తుంది. వీలెైనప్పుడల్లా తాజా పళ్ళను తినటం మేలు.
కాయగూరలు: వీటిలో కూడా కొవ్వు తక్కువగానూ, ‘ఎ’, ‘సి’ విటమిన్‌లు ఎక్కువగానూ లభిస్తాయి. ఫెైబర్‌, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మాంసం, చేపలు, చికెన్‌, గుడ్లు, జీడిపప్పు, వగెైరాలు: వీటిలో సాధారణంగా ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. ఐరన్‌, ‘బి’ విటమిన్‌, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా బాగానే ఉంటాయి. కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి.
పాలు,పెరుగు,వెన్న: డెైరీ ఉత్పత్తులలో కాల్షియం, ప్రొటీన్‌లు, విటమిన్‌లు, కొన్ని ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువగా వాడటం మంచిది.
స్వీట్లు,నూనెలు:ఈ ఆహారపదార్థాలలో పోషకవిలువలు అంతగా ఉండవు కాని కేలరీలు (శక్తి) మాత్రం సమృద్ధిగా లభిస్తాయి. కేకులు, స్వీట్లులాంటి వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
ఆహారాన్ని అసలు తీసుకోకపోతే...కొందరు చానాళ్ళపాటు ఏ ఆహారం తీసుకోకుండా ఉండాల్సి వస్తుంది. నిరాహారదీక్ష వల్ల, అనోరెగ్జియా నెర్వోసా వల్ల, జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏ భాగానన్నా తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్నప్పుడు, పక్షవాతం వల్ల, కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు...
ఇలాంటి సందర్భాలలో మనుషూలు ఆహారాన్ని తీసుకోకుండా నిరాహారా నికి గురి కావల్సి వస్తుంది.

ఎన్నాళ్ళకూ ఆహారాన్ని తీసుకోని ఇలాంటి సందర్భాలలో శరీరం శక్తికోసం తనలోని కణజాలాన్నే కేలరీల కింద హరాయించుకోవటం మొదలెడు తుంది. ఫలితంగా శరీరంలో నిలవ ఉంచుకున్న కొవ్వు దాదాపు అదృశ్యమై పోతుంది. అంతర్గతావయవాలు, కండరాలు,క్రమేపీ డామేజ్‌ కావటం మొదలెడతాయి.నిరాహారానికి గురెైన సందర్భంలో పెద్దవాళ్ళు తమ శరీరానికి చెందిన బరువులో సగానికి పెైగా కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఇంకా ఎక్కువ బరువును కోల్పోతారు.
శరీరపు బరువును కోల్పోతున్న నిష్పత్తిలోనే లివరు, పేగులు అధికంగా కృశించుతాయి. కిడ్నీలు, గుండె కాస్త తక్కువ స్థాయిలో కృశించుతాయి.

ఇంకా జరిగే మార్పులు ఏమిటంటే:
కండరాలు కరిగిపోయే ఎముకలు పొడుచుకు వస్తాయి.
చర్మం పల్చగా అయి పొడిబారిపోతుంది. చర్మంలో సాగేగుణం తగ్గిపోతుం ది. తెల్లగా పాలిపోతుంది .చల్లగా అవుతుంది.
వెంట్రుకలు పొడిబారి చిట్లుతుంటాయి. తేలికగా రాలిపోతుంటాయి.
పూర్తిగా నిరాహారంగా ఉంటే ఆ మనిషి 8 నుంచి 12 వారాల లోపు చనిపోతాడు.

ట్రీట్‌మెంట్‌
ఎక్కువ రోజుల పాటు నిరాహారంగా ఉన్న మనిషిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటానికి కొంత వ్యవధి పడుతుంది. ఎంతకాలం పడుతుందనేది అతను ఎన్నాళ్ళనుంచి నిరాహారంగా ఉన్నాడు, దాని ప్రభావం అతని శరీరం మీద ఎంతగా పడింది అన్న వాటిమీద ఆధారపడి ఉంటుంది.అధిక రోజులపాటు నిరాహారంగా ఉండటం వల్ల జీర్ణయంత్రాంగా ముడుచుకు పోతుంది. మామూలు సమయాలలో తీసుకునేంత ఆహారాన్ని అది ఇముడ్చుకోలేదు.

మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. 2.7 కిలోల నుంచి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. అంటే ఈ ఎదిగిన బరువంత కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుంచి నిత్యం తీసుకొంటున్న ఆహారం ద్వారానే లభించుతుంది.

అసంకల్పిత చర్యలు: అంటే మన ప్రయత్నం మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు! ఉదాహరణకు గుండె కొట్టుకో వడం, జీర్ణం కావడం, శరీరంలో టెంపరేచరు క్రమబద్దీకరించబడటం మొదలెైనవి.

- డాక్టర్‌ సి.ఎల్‌. వెంకట్రావు, హైదరాబాద్‌
 • ============================ 
 • Visit my Website - Dr.Seshagirirao... http://dr.seshagirirao.tripod.com/

4 comments:

 1. Nice Website...
  Hey JOIN now fblikesbot.com and Increase Facebook Likes your profile and websites.
  Increase Facebook Likes and check your website worth worth my websites
  its may be very beneficial for you also really

  ReplyDelete
 2. Nice , health is wealth....its true.

  ReplyDelete
 3. For good health and healthy life you can also add Tahitian Noni Juice to your diet as it is full of anti-oxidants and antibiotics meant for good health for longer hours.

  ReplyDelete 4. मुलेठी के फायदे
  Readmore todaynews18.com https://goo.gl/KH2O27


  ReplyDelete