Tuesday, August 11, 2009

అరటి పండ్లు , Banana


పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
  • అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (నిజం చెప్పాలంటే ఇది ఒక హెర్బ్ మాత్రమే). ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది. కూర అరటి కి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది . అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు.
ప్రపంచం మొత్తంమీద మన దేశం అరటిని పండించే విషయంలో రెండో స్థానంలో ఉంది. ఎంతోమంది రైతులకు, వ్యాపారస్థులకు ఇది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆర్థిక వెసులుబాటును కల్గిస్తూ బాసటగా నిలుస్తోంది.
  • * అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు.
  • * నూట యాభై గ్రాముల మేక మాంసంలోను, సగానికి కోసిన కోడిగుడ్డులోను, నాలుగొందల గ్రాముల ఆవుపాలలోను ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం, ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచీ కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.
  • * అరటి పండు పైనుండే దళసరి తోలు సూక్ష్మక్రిములను, విష పదార్థాలను అడ్డుకొంటూ, రక్షక కవచంగా పనిచేస్తుంది. దీనిని ప్రయాణాలలోను, ఇతర అనుచిత ప్రదేశాల్లోనూ నిర్భయంగా తినవచ్చు.
  • * మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరమేదీ లేదు. (ఒక మోస్తరు సైజున్న అరటిపండునుంచి సుమారు 100 క్యాలరీల శక్తి విడుదల అవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి, శారీరకావసరాలకు, రోజుకు సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకొని అరటి పండును తీసుకోవటంలో తప్పులేదు).
  • * అరటి పండులో కొవ్వు పదార్థం చాలా అల్పమోతాదులో ఉంటుంది. ఈ కారణంచేత దీనిని కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. (కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కొవ్వును జీర్ణంచేసే ఎంజైముల విడుదల తగ్గిపోతుంది.)
  • * అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. దీనిని కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాడకూడదు. (ఈ వ్యాధిలో మూత్రపిండాలు పొటాషియంను సమర్థవంతంగా బయటకు విసర్జించలేవు. ఫలితంగా రక్తంలో పొటాషియం మోతాదు ప్రమాద భరితమైన స్థాయిలో పెరిగిపోతుంది. అరటి పండ్లు అధికంగా తింటే ఇది మరింత పెరుగుతుంది.)
  • * ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం అరటి పండు కఫాన్ని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్త్మా వంటి కఫ ప్రధాన వ్యాధుల్లో దీనిని వాడటం మంచిది కాదు.
  • * అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫ దోషం తగ్గుతుంది. లేదా అరటి పండు తినేటప్పుడు రెండు లవంగాలను గాని, మూడు మిరియాలను గాని గుజ్జుతోపాటు తిన్నా సరిపోతుంది.
పోషక విలువలు : అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు
  • 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది.
  • 23% కార్బోహైడ్రేటులు, ~
  • 1% ప్రోటీనులు,
  • 2.6% ఫైబరు ఉంటుంది.
ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్దతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం , శ్రేష్టమైనది . వందగ్రాముల అరటిలో
  • * నీరు - 70.1 గ్రా.
  • * ప్రోటీన్ - 1.2 గ్రా.
  • * కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
  • * పిండిపదార్థాలు - 27.2 గ్రా.
  • * కాల్షియం - 17 మి.గ్రా.
  • * ఇనుము - 0.4మి.గ్రా.
  • * సోడియం - 37 మి.గ్రా.
  • * పొటాషియం - 88 మి.గ్రా.
  • * రాగి - 0.16 మి.గ్రా.
  • * మాంగనీసు - 0.2 మి.గ్రా.
  • * జింక్ - 0.15 మి.గ్రా.
  • * క్రోమియం - 0.004 మి.గ్రా.
  • * కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
  • * రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
  • * సి విటమిన్ - 7 మి.గ్రా.
  • * థయామిన్ - 0.05 మి.గ్రా.
  • * నియాసిన్ - 0.5 మి.గ్రా.
  • * శక్తి - 116 కిలోకాలరీలు
ఉపయోగాలు
  • * దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • * శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
  • * అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
  • * అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
  • * జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.
  • * పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.
  • * అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.
అరటి తో వైద్యము
  • * అమెరికాలో పాయిజన్ ఐవీ (poison ivy) అనబడే చెట్లు చర్మానికి తగిలిన వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు
  • * అరటికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే 'బాన్‌లెక్‌' అనే రసాయనం ఎయిడ్స్‌ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్‌ నిరోధానికి వాడుతున్న 'టీ20, మారావిరాక్‌' మందులతో సమానంగా ఈ రసాయనం పని చేస్తుంది..అరటిలోని లెక్టిన్‌ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది. ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.
  • * అమ్మాయి పుట్టాలని కోరుకునే గర్భిణులు అరటిపళ్లు తినడం మానేయాలి.
అరటితో ఆరోగ్యం,Health with banana
అందానికీ ఆరోగ్యానికీ అరటి మంచి నేస్తం. పెరట్లో పండే, అందుబాటు ధరలో దొరికే అరటితో ఎన్నిరకాల లాభాలున్నాయో చూడండి.
  •  అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది.
  •  అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.
  •  డయేరియాను తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడ్డ బాక్టీరియాను మంచి బాక్టీరియాగా మార్చుతుంది.
  •  ఒక అరటి పండుతో 95 క్యాలరీలు అందుతాయి. అంతేకాదు దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలో విటమిన్‌ బి6, కాల్షియం, జింక్‌ ఫోలిక్‌ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి.
  •  అరమగ్గిన అరటిలో క్యాలరీలు తక్కువగా ఉండి శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
  •  రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్‌ తయారుచేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరుగుతారు.
  •  బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్‌ డిశ్ఛార్జ్‌ సమస్యను దూరం చేస్తుంది. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే రుతుచక్రం సమయంలో నొప్పినీ రక్తస్రావాన్నీ తగ్గిస్తుంది.
  •  చిన్నపాటి కాలిన గాయాలను మాన్పించే గుణం అరటిగుజ్జుకు ఉంది.కనిపించింది.

  • ఆరోగ్యానికి అరటి పండు

చలి కాలంలో సాధారణంగా వచ్చే చర్మ సమస్యలు మొటిమలు, ముఖం పొడిబారటం.ఈసమస్యలను దూరంచేయడానికి అరటి పళ్ళు ఎంతో ఉపయోగపడతాతి . ఎ`బి,,సి,`ఇ'  విటమిన్లే కాక పొటాషియం కూడా కలిగిన ఈపళ్ళుఅటు చ…ర్మానికి, ఇటు జుట్టుకు కూడా పోషకాలుగా ఉపయోగపడతాయి.

మొటిమలు :
చాలాత్వరగా మొటిమలు, ఇతర సమస్యలువచ్చే సున్నితమైన చర్మానికి అరటి పండు ఒక వరంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పండులో చర్మానికి సమస్యలు తీసుకువచ్చే పదార్ధాలు ఏమీ ఉండవు. అందుకే సున్నితమైన చర్మానికి ఇది సరైన పరిష్కారం. బాగా పండిన అరటిపండును ఒక దానిని తీసుకుని మెత్తగా చిదిమి ఆ పేస్ట్ ను ముఖానికి పట్టించి, 20 నిమి షాల పాటు ఉంచుకొని గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇన్ఫెక్షన్‌తో కూడిన మొటమలలోని బాక్టీరియాను అరటిపండులోని పొటాషియం హరించి వేయడంతో అవి చాలా త్వరగా తగ్గిపోతాయి.అలాగే ఇందులో ఉన్న `బి' విటమిన్‌ దురదవంటివాటిని తగ్గించడమే కాదు మన చర్మం కూడా మంచి రంగులో ఉండేలా చేస్తుంది. అంతేకాదు వేసవి కాలంలో చెమట వల్ల వచ్చే పేలుడును, అతివేడివల్ల వచ్చే రాష్‌ను తగ్గించడంలోకూడా ఇది ఉపయోగపడుతుంది.

పొడి చర్మం :
ముఖంపై గీతలు, పొట్టు లేచి పోవడంవంటి చిహ్నాలు కనిపించాయంటే ముఖం పొడిబారుతోందని అర్థం.పురాతనకాలం నుంచి ముఖంలోతేమను నిలపడానికి అరటి పండ్లను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ పండులో ఉన్న విటమిన్‌ `ఎ' చర్మలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది. ఇక విటమిన్‌ `ఇ' పాడైన చర్మా న్ని మరమ్మత్తు చేసి, ఏజింగ్‌ స్పాట్స్ ను తగ్గిస్తుంది. విటమిన్‌ `సి' చర్మ కణాలలోని విషవాయువు లను నిల్వఉంచకుండా చేయడంతో సన్నటి గీత…లు ఏర్పడటం, వయసు పెరిగినట్టు కనిపించ…డం తగ్గుంది. వయసు మీదపడి నట్టు కనిపిస్తున్నా మని భావించే వారు, ఒక పండిన అరటిపండు ను తీసుకుని దానిని మెత్తగా పేస్ట్ లా చేసి, దానికి ఒక చెమ్చా తేనెను కలిపి ముఖానికి పట్టించుకు ని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఎండిన తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని కడిగి వేయాలి. తేనె చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక అరటిపండు ముఖాన్ని మృదువుగా చేస్తుంది. పొడి చర్మానికి అరటి పండ్లు బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే అవి సహజంగానే తేమను ఇస్తాయి. ఈ ప్యాక్‌ నే ఎండవల్ల కమిలిన చర్మాన్నిసహజ స్థితికి తీసుకు వచ్చేందుకు ఉపయోగించవచ్చు.వేసవిలో జుత్తు కూడా దెబ్బతింటుంది. వేడిమివల్ల అదిఎండి, పాడవుతుంది. అరటిపళ్ళు జుత్తుకు సహజ మెరుపును తెచ్చేందుకు సాయపడతాయి.

జుట్టు పొడిబారడం :
ఎండలోఎక్కువగా తిరిగే వారికి,రంగులవంటిరసాయనాలను ఉపయో గించే వారికి, జుట్టును వంకీలుతిప్పుకునే వారికి వాతావరణంలో వచ్చేమార్పులు హాని చేస్తాయి. అరటిపళ్ళు పొడిబారినజుట్టును, మాడుకు కూడా మరమ్మత్తు చేసి సహజ స్థితికి తీసుకువస్తాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం మాడుపై ఉన్న ఎటువంటి బాక్టీరియానైనా తొలగించి, ఆరోగ్య వంతమైన జుట్టు పెరగడానికి సహాయపడు తుంది. ఒక పండిన అరటిపండును తీసుకుని మాష్‌చేసి,దానినిమాడుకు జుట్టుకు పట్టించాలి. దానిపై క్యాప్‌ ధరించి ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచి తరువాత షాంపూ చేయాలి. దీనితో జుట్టు ఆరోగ్యవంతంగా అవుతుంది. అలాగే జీవరహితంగా కనిపించే జుట్టుకు ఒక అరటిపండులో ఒక టేబుల్‌ స్పూన్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ను కలిపి దానిని జుట్టుకు పట్టించాలి. తరువాత వేడినీటిలో ముంచి పిండిన టవల్‌ను తలకు చుట్టుకుని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో తలను కడుక్కొని షాంపూ చేసుకోవాలి సంవత్సరం పొడువునా దొరికే ఈ పండుని అన్ని రకాలుగా మనం ఉపయో గించుకోవచ్చు.


 అరటిపండు సగం చాలు...
జిమ్‌లో ఎక్కువ సమయం వ్యాయామం చేశాక శరీరానికి శక్తి రావడం కోసం స్పోర్ట్స్‌ డ్రింకో, బజార్లో దొరికే మరో పానీయమో తీసుకుంటారు. కానీ 'వాటికి ప్రత్యామ్నాయంగా అరటి పండు ఎంచుకోవాలి. అప్పుడు కనీసం సగం అరటి పండు తిన్నా కావాల్సిన శక్తి అందుతుంది' అని అమెరికాకు చెందిన అధ్యయన బృందం తెలిపింది. క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్లే కొందరిపై అధ్యయనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా ఈ విషయాన్ని చెప్పారు. స్పోర్ట్స్‌ డ్రింక్స్‌తో పోల్చినప్పుడు... అరటి పండ్ల నుంచి పిండిపదార్థాలే కాక అదనంగా యాంటీఆక్సిడెంట్లూ, పీచు, పొటాషియం, బి6 విటమిన్‌ లాంటి పోషకాలూ అందుతాయి. అరటి పండులో లభించే పొటాషియం, మెగ్నీషియం బీపీని అదుపులో ఉంచుతాయి. అంతేకాదు ఎముకలూ దృఢపడతాయి. అజీర్తితో బాధపడేవారు రోజుకో పండు తింటే చాలు అంటున్నారు నిపుణులు.
  •  

అరటి తెచ్చే అందం

    ఇంట్లో అరటిపండు ఉంటే చాలు.. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే! నిజమే... చర్మాన్ని తేమగా ఉంచడానికీ, వయసు పెరిగిన ఆనవాళ్లను తెలియకుండా చేయడానికీ, పగిలిన పాదాలను అందంగా తీర్చిదిద్దుకోవడానికీ అరటిపండు ఎంతో ఉపయోగపడుతుంది. పండిన అరటిపండును మెత్తని గుజ్జులా చేసుకుని, ముఖానికి పట్టించి, పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ముఖానికి ఖరీదైన మాయిశ్చరైజర్లు ఇవ్వలేని తేమా, నునుపుదనం వస్తాయి.

బయటికెళ్లిన కాసేపటికే కొందరి ముఖం జిడ్డుగా మారిపోతుంది. ఈ సమస్య తగ్గాలంటే పండిన అరటి పండు గుజ్జుకు, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి దానిని ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే... జిడ్డు వదిలిపోతుంది. ఎన్నిసార్లు కండిషనింగ్‌ చేసినా జుట్టు పొడి బారుతుంటే... పండిన అరటి పళ్లు తీసుకుని, దానిలో కొద్దిగా పెరుగు కలిపి... మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ, అందంగా మెరిసిపోతుంది.

అరటిపళ్లలోని 'ఇ' విటమిన్‌ ముఖంలో వయసు తాలూకు ఛాయలను కనిపించకుండా చేస్తుంది. దీనికి ఓట్‌మీల్‌, కొబ్బరిపాలు కూడా జోడించి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే మృతకణాలు తొలగిపోతాయి. అరటి పండు గుజ్జుని పాదాలకు పట్టిస్తే, వాటికి తగినంత తేమ అంది పగుళ్లు రాకుండా ఉంటాయి.

  • ========================================
Dr.Seshagirirao -MBBS

No comments:

Post a Comment