Tuesday, August 11, 2009

పుటకొక్కు , Button Mushroom,పుట్ట గొడుగులు

పండ్లు , కాయగూరలు , గింజలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
కుళ్ళి పోతున్న పదార్ధాలున్న చోట పెరుగుతుంటాయి కాబట్టి మష్రూమ్స్ అంటే ఒక రకమైన ఏహ్యభావం ఉండటం సహజం . అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణం లో పెంచుతున్నారు . అందరూ తినగల కూర ఆహారము . ఇవి మాంసాహారము తో సమానము . ఆహారప్రియులకు వర్షాకాలము స్పెషల్ పుట్టగొడుగులు . ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి , డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలము లో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి . పుట్టగొడుగులలో " ఇర్గోథియోనైన్‌ , సెలీనియం " అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి . శరీరములో యధేచ్చగా సంచరిస్తూ డి.ఎన్‌.ఎ. ను దెబ్బతీస్తూ, గుండె జబ్బులకు , కార్సర్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను ఇవి ఎదుర్కొంటాయి . పోర్టొబెల్లో , క్రెమిని ... రకాల పుట్టగొడుగుల్లో ఇర్గోథియోనైన్‌ , బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయి . కొన్ని రకాలు విటమిన్‌ 'D' ఉత్పత్తికి సహకరించేవి గా పనిచేస్తాయి . పుట్టగొడుగుల్లో 90 శాతము నీరే ఉంటుంది . సోడియం ఉండదు . పొటాసియం లభిస్తుంది, కొవ్వుపదార్ధము తక్కువ .. ఫలితం గా బరువు పెరుగుతామన్న భయమే ఉండదు .
ఉడికిస్తే మంచిది : పుట్టగొడుగుల కణాల గోడలు అరగవు . పచ్చి పుట్టగొడుగులలోని పదార్ధాలు జీ్ర్ణ రసాల్ని మందగింపజేస్తాయి . శరీరము ప్రోటీన్‌ లను గహించడాన్ని అడ్డుకుంటాయి . అంటే పుట్టగొడుగులను పచ్చిగా తిన్నట్లైతే వాటిలోని పోషక ప్రయోజనాల్ని పొందలేము . ఆందుకే ఉడికించి తినాలి . కొన్నిటిలో విషపదార్ధాలు ఉంటాయి . ఉడికిస్తే విషపదర్ధాలు ప్రభావము తగ్గుతుంది . వండే ముందు బ్రౌన్‌ కలర్ చారలు ఉంటే అవి నిలవావి... అని వాటిని వాడాకూడదు . ఉప్పునీటిలో కడిగి సుబ్రము చేయడం వల్ల మట్టితాలుగా బ్యాక్టీరియా క్రిములు తొలగిపోతాయి . ఉపయోగాలు :
  • యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది ." ఇర్గోథియోనైన్‌ , సెలీనియం " అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి
  • విటమిన్‌ 'D' పుస్కలము గా లభిస్తుంచి నందువల్ల ... ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది . మామూలుగా ఆహారములో వి్టమిన్‌'D' లభించదు . పు్ట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్ పోజ్ చేయడం వల్ల విటమిన్‌ డి బాగా తయరవుతుంది . మామూలుగా సూర్యకిరణాల తాకిడివల్ల శరీరానికి విటమిన్‌ 'D' అందుతుంది ..అయితే దీనివలన సన్‌ట్యాన్‌ కి గురి అయ్యె ప్రమాధముంది .
  • వీటిలో మొక్కలు , జంతువులకు సంబంధించిన లక్షణాలు రెండూ కనిపిస్తాయి . జంతువుల మాదిరిగా పుట్టగొడుగులు ఫోటోసింథసిస్ కి అనువైనవి కావు . భూచి నుంచి గ్రహించిన పోషకాలు కలిగిఉంటాయి కావున మొక్కకలలోని లక్షణాలు కలిగిఉంటాయి . మాంస్కృత్తులు లభిస్తాయి . శరీర సౌష్టవం , కండర పుష్టికి దోహదపడతాయి .
  • పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి , కండరాలకు , ఆక్షిజన్‌ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది . గుండె , ఊపిరితిత్తులు ఆరోగ్యం గా ఉంటాయి .
  • డయబిటీస్ ను తగ్గిస్తుంది .
రక్తపోటుకు గొడుగు బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో ఉండేవి 9 కేలరీలు మాత్రమే! ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్‌, నియాసిన్‌లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. ఇక విటమిన్‌ ఈ, సెలీనియం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. ================================= Visit my web blog - > Dr.Seshagirirao.com

No comments:

Post a Comment