Tuesday, August 11, 2009

శాకోలేట్ ,chocolate,చాక్లెట్

లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చక్లైట్లు కుడా ఒకటి . చాక్లైట్ల లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్ , డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి . అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని , డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి . ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుసాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి . రక్తనాళాలను వ్యాకోజింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్శైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి . కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాక్లైట్లు వాడితేనే ఫలితం బాగా ఉంటుంది .
  • రక్తపోటు అధికంగా ఉందని డాక్టరు దగ్గరికి వెళితే ఔషధ నిర్ణయం (ప్రిస్కిప్షన్)లో ఒక డోస్ డార్క్ చాక్లెట్ తీసుకోమని సలహా ఇస్తున్నారట! అదెలా అంటారా? అయితే చదవండీ....
రక్తపోటు నివారణకు డార్క్ చాక్లెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాక్లెట్లలో- ''కేటచిన్‌'' అనే ఫ్లావనాయిడ్ పదార్ధం ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
  • క్యాన్సర్ రానివ్వని చాక్లెట్స్ :
కోకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది . కోకోవాలో ఉన్న " పాలీఫినాల్స్ " క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. వీటిల్ శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంట్స్ ఉన్నాయి. అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావమునుండి రక్షిస్తాయి. ఎంతో మేలు చేకూరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్స్ చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది .
  • ఫ్లావనాల్స్ అనే పదార్ధం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
  • చాక్లెట్‌..గుండెకు మేలు
    డార్క్‌ చాక్లెట్‌ రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు, గుండెకు మేలు చేస్తున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇదెలా జరుగుతుందోననేది మాత్రం తెలియదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇందులోని గుట్టును ఛేదించారు.

    కోకో గింజల్లోని పీచు మన పేగుల్లో ఎలా పులుస్తుందో, ఎలా మేలు చేస్తుందో గుర్తించారు. మన పేగుల్లో హానికర బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా. బైఫైడోబ్యాక్టీరియం, లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా వంటి మేలు చేసే సూక్ష్మక్రిములు చాక్లెట్‌ను ఆహారంగా తీసుకొని.. దాన్ని పులియబెడుతున్నట్టు తేలింది. అనంతరం అందులోంచి వాపు నివారక రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నట్టు బయటపడింది. సహజ సిద్ధంగా పుట్టుకొచ్చిన ఈ వాపు నివారక రసాయనాలు రక్తంలో కలిసి గుండె కణజాలం, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా దీర్ఘకాలంలో రక్తపోటు ముప్పు తగ్గుతుందన్నమాట. కోకో గింజల్లో క్యాటెచిన్‌, ఎపిక్యాటెచిన్‌ వంటి ఫాలీఫెనాల్స్‌తో పాటు కొద్దిమొత్తంలో పీచూ ఉంటుంది. నిజానికి ఈ ఫాలీఫెనాల్స్‌ ఆలస్యంగా జీర్ణమవుతాయి. కానీ పెద్దపేగులోని మంచి బ్యాక్టీరియా పీచును పులిసేలా చేసి, ఫాలీఫెనాల్స్‌ను త్వరగా చిన్న చిన్న అణువులుగా మారుస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డార్క్‌ చాక్లెట్‌కు దానిమ్మ వంటి పండ్లు కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతుందని వివరిస్తున్నారు. 
కొంత మందికి కోకోవా పడదు ... ఎలేర్జీ వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి .  

 చాకొలైట్ గురించి కొన్ని విషయాలు :

  •  చాక్‌లెట్ వాడకం అన్నది క్రీస్తుపూర్వం 100వ సంవత్సరం నుంచీ వుందని లెక్క తేల్చారు. ఆ కాలంలో దక్షిణ మెక్సికోలోని OLMECS అనే ఆటవికుల తెగ చాక్‌లెట్ పానీయాన్ని సేవించేవారని పరిశోధకులు తేల్చారు.
  •  1528లో స్పానిష్ పరిశోధకుడు HERNANDO CORTEZ కోకా బీన్స్ మెక్కను దక్షిణ అమెరికా నుంచి స్పానిష్ రాజకుటుంబానికి బహుమతిగా తెచ్చాడట.
  •  అమెరికాలో సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితమే కోకా మొక్కను పెరటితోటలో పెంచే అలవాటు వుండేది.
  •  మొదటి సారి మెక్సికోలో చాక్‌లెట్ బార్ తయారీ ప్రారంభమైంది. అదీ 300 ఏళ్ల క్రితం. ఆ తరువాత చాలా కాలానికి 1840లో ప్రఖ్యాత క్యాడ్‌బరీ కంపెనీ ప్రారంభమైంది.
  •  కోకా చాక్‌లెట్లు తిని సెక్స్‌లో పాల్గొంటే మరింత హుషారుగా వుంటుందన్నది కేవలం మానసిక భావనే తప్ప నిజం కాదట.
  •  మనుషులకు అంత ప్రియమైన చాక్‌లెట్లు కుక్కలకు మాత్రం ఏమంత మంచివి కాదట. చాక్‌లెట్‌ల్లో వుండే థియోబ్రొమైన్ అనే పదార్ధం కుక్కల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ను దెబ్బతీస్తుందట.
  •  హిచ్‌కాక్ ప్రఖ్యాత చిత్రం సైకోలో ఒక సన్నివేశంలో రక్తం చూపించడం కోసం కోకో సిరప్‌ను వాడారట.
  •  మిల్క్ చాక్లెంట్లంటే ప్రపంచవ్యాప్తంగా మోజే కానీ, మగవారు ఎక్కువ డార్క్ చాక్‌లెట్లనే ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.
  •  ఒక్క సింగిల్ చాక్‌లెట్ తింటే 150 అడుగుల దూరం నడించేంత శక్తి వస్తుందట.
  •  ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్‌లెట్లు ఖర్చయిపోతున్నాయి.
 
  • ==========================
--డా.శేషగిరిరావు -- శ్రీకకాకుళం

No comments:

Post a Comment