Monday, August 10, 2009

కాఫీ , Coffee


కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి వేగించి పొడి చేసి కాఫీ తయారీకి ఉపయోగిస్తారు. కాఫీగింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా మరియు ఆఫ్రికాదేశాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేగించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి. కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్సాహపరుస్తుందని ఊహించబడుతుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపూరితమైన పానీయము. కాఫీ అనేది ఒక ప్రసిద్ద పానీయం. ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్రాంతాలలో దొరికే ఈ పానీయం. పెద్దల నుండి పిన్నల వరకు అనేకంగా అలవాటు పడిన ఉత్తేజాన్ని కలిగించే పానీయము. కాఫీ గింజలను సువాసన వచ్చేవరకు వేగించి పొడిచేసి దానిని నీటితో మరిగంచి ఆ నీటిని వడకట్టి కాఫీ డికాషన్ తయారు చేస్తారు. కాఫీ డికాషన్ లో పంచదారను చేర్చి పానీయంగా వేడిగా త్రాగుతారు. మనదేశంలో కాఫీ డికాషన్ లో పాలను చేర్చి త్రాగే అలవాటు కాని అమెరికా మరియు యూరప్ లాంటి దేశాలలో పాలను చేర్చకుండా అధికంగా త్రాగుతుంటారు. కాఫీని అతి వేడిగానూ, అతి చల్లగానూ త్రాగడం చాలా మందికి అలవాటు.
  • కాఫీ ఒక ఉత్సాహ పానీయం. దీనిని అనేక మందికి ఉదయపు వేళలో ఉట్టిది గానూ మిగిలిన సమయాలలో అల్పాహారంతోనూ త్రాగడం అలవాటు. ప్రస్తుతం స్నేహితులు బంధువులు వచ్చినపుడు కాఫీతో సత్కరించడం సాదారణం అయింది. విందులు వినోదాలలో కాఫీలు అతి ముఖ్యం అయ్యాయి. ఉత్తర అమెరికాలో 1688లో కాఫీ సేవించిన ఘటన పేర్కొనబడింది. కాఫీ అనేక సమాజాలలో వారి సంస్కృతిలో ప్రధాన పాత్ర వహిస్తూ జీవిత ఆహారపు శైలిలో ఒక భాగం అయింది.
కాఫీ చెట్లు వాడని పచ్చదనాన్ని కలిగిన చిన్న చెట్లు. ఇవి సాధారణంగా కొండ ప్రాంతాల్లో నాటబడతాయి. ఇవి 3-9 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. ఇవి సామాన్యంగా సంవత్సరానికి ఒకసారి ఆకుపచ్చ గింజల రూపంలో వికసిస్తాయి. ఎనిమిదవ సంవత్సరంలో ఇది వాణిజ్యమైన మంచి దిగుబడిని ఇవ్వగలుగుతుంది. కాఫీ పానీయాన్ని తాగుతున్నప్పుడు అందులో ఉన్న కెఫిన్ (ఆల్కలాయిడ్) మనకు కావలసిన ఉత్సాహాన్నిచ్చి మానసిక స్థితిని ఒక ఉచ్చ దశకు తీసుకెళ్తుంది. అందులో ఉన్న మరో వస్తువు కాఫీయోల్ చాలా హాయినిచ్చే రుచి సువాసలనలు కాఫీకి అందజేస్తుంది. కాఫీకి చికోరీ చేర్చడం వలన ఒక విధమైన రుచి వస్తుంది. కాఫీ తీసుకోవడం ద్వారా అల్జీమర్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని దక్షిణ ఫ్లోరిడా యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. కాఫీలోని కఫేన్‌లు శరీరంలోని రక్తపు స్థాయిని పెంచుతుందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. కాఫీ గింజల్లోని కఫేన్‌ల ద్వారా జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులు కూడా నయమవుతాయని తెలియవచ్చింది. కఫెనేటెడ్ కాఫీ సాధారణంగా రక్తపు గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందని యూఎస్ఎఫ్ న్యూరోసైంటిస్ట్ చవాన్‌హయ్ కో తెలిపారు. అలాగే కాఫీ తాగడం వల్ల ఉత్సాహం, చురుకుదనం కలగడమే కాకుండా గుండెకు మేలు జరుగుతుంది. కెఫిన్‌ గుండెకు రక్షణ కల్పిస్తుంది. క్రమం తప్పకుండా కాఫీ సేవించడం వల్ల గుండె క్రమబద్ధంగా పనిచేస్తుందని సర్వేలో తేలింది. కెఫిన్ కాపీ తాగడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని చవాన్ వెల్లడించారు.
  • ఒక రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగితే పక్షవాతం వంటి వ్యాధులు దరిచేరవని స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అదేసమయంలో ఇష్టానుసారంగా తాగితే మాత్రం బీపీ వంటి రోగాలు కొని తెచ్చుకున్నట్టేనని వారు హెచ్చరిస్తున్నారు. స్వీడన్‌లోని పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను పరిశీలిస్తే.. 1960 నుంచి స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు దాదాపు ఐదు లక్షల మంది కాఫీ ప్రియులపై ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది. కాఫీ తాగితే మెదడులో రక్తం గడ్డ కట్టడాన్ని 14 శాతం తగ్గిస్తుందని వారు తెలిపారు. అలాగే, కాఫీ ద్వారా చెడ్డ కొలస్ట్రాల్ నుంచి మెదడును కాపాడవచ్చు. అయితే కాఫీ మోతాదు ఎక్కువైతే రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరించారు. ఈ విషయాలన్నీ అమెరికల్ జర్నల్‌లో ప్రచురితం చేశారు. కాఫీ తాగే వారిలో కెఫీన్ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇది రక్తపు పోటును పెంచుతుందని తద్వారా ధమనులు మొద్దుబారుతుందన్నారు. పైపెచ్చు.. గుండె వేగాన్ని పెంచే ఒత్తిడి హార్మోన్‌ స్థాయిలను పెంచుతుందన్నారు. ఈ విషయం అమెరికాకు చెందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు 400 మందిపై గుండెపోటు బాధితులపై జరిపిన సర్వేలో వెల్లడైనట్టు డైలీ టైమ్స్ పత్రిక పేర్కొంది.
కాఫీ మరీ అనారోగ్యకరమైన వ్యసనమేమి కాదని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధింత వ్యాధులు, సమస్యలతో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది. కానీ కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌లు కూడా ఉన్నాయని తేలింది. కాఫీలోని కెఫీన్‌ మూలంగా శరీరంలో ఒకరకమైన వ్యాధి నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ శక్తి కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, క్యాన్సర్‌, టైప్‌2 డయాబెటిస్‌ సమస్యలను నివారిస్తుంది. కాఫీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కప్పు కాఫీలో 6 కేలరీలు ఉంటే అందులో కలిపే చక్కెరలో 23 నుంచి 27 కేలరీలు ఉంటాయి. కాఫీలో చక్కెర కలపకుంటే కేలరీలు పెరిగే సమస్యే ఉండదు.
  • లో(low) బ్లడ్‌ ప్రెషర్‌తో బాధపడే వారికి కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని సేవిస్తే బ్లడ్‌ ప్రెషర్‌ లెవెల్స్‌ క్రమ,క్రమంగా పెరుగుతాయి. కానీ ఎక్కువగా కాఫీ తీసుకుంటే శరీరంలో యాంటిఆక్సిడెంట్స్‌ పెరుగుతాయి. ఫలితంగా గుండెలో మండినట్టవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ‘కాఫీ జిట్టర్స్‌’ అనే స్థితికి చేరుకుంటారు. కెఫీన్‌ ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల యాంగ్టిటీతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎక్కువగా దీన్ని సేవిస్తే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాఫీని అవసరమైన మేరకు సేవిస్తేనే మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కాఫీలోని మంచి గుణాలు (positive effects):
  • ప్రతిరోజూ దీర్ఘకాలము కాఫీ వాడితే గుండెజబ్బులు , మధుమేహము వచ్చే అవకాశము తగ్గుతుంది .
  • కాఫీ వాడకం వల్ల వుద్ధాప్యము దూరమవుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ,
  • కాఫీ లోని కెఫిన్‌ .. న్యూరొట్రాన్స్మిటర్స్ అయిన " నార్ ఎడ్రినాలిన్‌ , అసిటైల్ కొలిన్‌ , డోపమైన్‌" స్థాయిలను ఎక్కువ చేస్తుంది . వీటిమూలాన పనిలో ఏకాగ్రత , చురుకుతనము , జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి .
  • కెఫిన్‌ తక్కువమోతాదో ఉత్సాహాన్ని పెంచి ... అలసటను తగ్గిస్తుంది ,
  • కెఫిన్‌ మెటబాలిక్ రేట్ ను ఎక్కువచేస్తుంది ....తాత్కాలికం గా ఉసారుగా ఉండేటట్లు చేస్తుంది .
  • కెఫిన్‌ క్యాస్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు .
  • కెఫిన్‌ " పార్కిన్‌సోనిజం " జబ్బు వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు .
  • కెఫిన్‌ " టైప్ 2 మెధుమేహము " వచ్చే రిష్క్ తగ్గిస్తుందని ఆదారాలు ఉన్నాయి.
  • కెఫిన్‌ కొన్ని కాలేయ క్యాన్సర్లు రానీయదని పరిశోదనలు ఉన్నాయి .
కాఫీలోని చెడు గుణాలు (Negative effects):
  • కెఫిన్‌ " రక్తనాళాలను కుదించడం(vasoconstruction) వలన రక్తపోటు పెరిగే అవకాశము ఉన్నది . హై బ్లడ్ ప్రషర్ వలన అనేక గుండె జబ్బులు ... స్ట్రోక్ లు ,రక్తనాళాలు మూసుకుపోవడము ... వచ్చే అవకాశము ఉన్నది .
  • కెఫిన్‌ శరీరములో చలన కదలికలు (Motor movements) నియంత్రించడము వలన చేతులు వణకడము అనే గుణము కలుగవచ్చును .
  • కెఫిన్‌ Diuretic గా పనిచేయడం ద్వారా అతిమూత్రము కలుగజేయును .
  • కెఫిన్‌ కార్టిసాల్ (cortisol) తయారీ ఎక్కువ చేయడం వల్ల cortisol Tolerence పెరుగును.
  • కెఫిన్‌ ఎక్కువమోతాదులో గాబరా(anxiety) ని కలుగుజేయును .
  • కెఫిన్‌ అలవాటుగా మారి అది త్రాగడం మానివేసే పక్షము లో విత్డ్రాల్(withdrawal) లక్షణాలు .. తలనొప్పి , అలసట , నీరసము , సమయస్పూర్తి లోపము కలుగును .
  • కెఫిన్‌ ఎక్కువైతే నిద్రలేమి కలిగి ... తత్సంబందిత దుష్పరిణామాలు కలుగును .
  • కాఫీ పరిమితములో తాగితే తప్పులేదుగాని .... ఇది ఒక అలవాటుగా మారును . అదిలేనిదే నిత్య కృత్యాలు , కార్యక్రమాలు సరిగా జరుగవు
  • స్త్రీలకు కాఫీ మంచిది :
రోజుకు రెందు (2) కప్పులు కాఫీ తాగితే స్త్రీల ఆరోగ్యము మెరుగా ఉంటుందని తాజా పరిశోధనలు , ముఖ్యముగా గుండె ఆరోగ్యము చెడిపోయే ప్రమాధము , పక్షవాతము వచ్చే అవకాశాలు తగ్గుతాయి అని అంటారు . కాఫీ సేవనము వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదము 22-25 శాతం ఆడవారిలో తగ్గిందని స్వీడెన్‌ పరిశోధకులు తేల్చిన అంశము . కాఫీ వల్ల ఇన్‌సులిన్‌ సెన్‌సివిటీ మెరుగవుతుంది . ఆక్షిడేటివ్ ఒత్త్తిడి తగ్గుతుంది . ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది . దాదాపు 35 వేలమంది స్త్రీలమీద 10 సం.ల కాలం పాటు జరిపిన పరిశోధనల ఫలితం అని అంటున్నారు .

జ్ఞాపకశక్తిని పెంచే కాఫీ..!!--24-12-2012

కాఫీలు, టీలు కడుపు నింపుతాయా, ఆరోగ్యాన్నిస్తాయా అని చాలా మంది సణుగుతూ ఉంటారు. దానికి కారణం దాని వల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయంతో. కానీ ఇప్పుడు భోజనాన్ని తగ్గించి మరీ రోజుకోసారైనా కాఫీ తాగండీ, ఆరోగ్యాన్ని కాపాడుకోండని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు చూస్తే కొంతమంది జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని బాధపడుతుంటారు. అయితే ఇక నుంచి కాఫీ తాగండి. నడుం కొలత పెరిగిపోతోందని దిగులు పడుతున్న వారు కూడా కాఫీ తాగితే వారి బాధ తగ్గిపోతుంది. ఈ వాస్తవాలన్నీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయ్యాయి. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నడుం కూడా సన్న బడుతుందట. మెదడు చురుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడు కడుపును మాడ్చుకుంటే మంచిదని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల ఒంట్లోని క్యాలరీలు ఖర్చయి ఆరోగ్యవంతంగా ఉండడంతోపాటు ఆయుర్దాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. క్యాలరీలు బాగా ఖర్చయితే జ్ఞాపకశక్తికి, పరిజ్ఞాన శక్తికి అవసరమైన మెదడులోని సీఆర్‌ఈబీఐ అనే ప్రోటీన్ బాగా ఉత్పత్తి అవుతుందని వైద్య పరిశోధనలో తేలింది. ఇలా చేయడం వల్ల రోజుకు సుమారు 600 క్యాలరీలు ఖర్చవుతాయట. అందువల్ల కాఫీలు తాగితే ఆరోగ్యం చెడిపోతుందన్న అపోహలు వదిలేసి మితాహారం, కప్పు కాఫీతో మీ రాత్రి మెనూ సిద్ధం చేసుకోండి. 
  • =====================================
Visit my website at ---> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment