Monday, August 10, 2009

వెల్లుల్లి , Garlic

పండ్లు , కాయగూరలు ,గింజలు పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం
  • image : Courtesy with Andhraprabha news paper
దీని సాస్త్రీయ్ నామము " allium sativum " , సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది . రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర చుట్టం .. దానికన్నా ఔషధ గుణాలు ఎక్కువ . ఉపయోగాలు :
  • జలుబు , ఫ్లూ జ్వరం తగ్గిస్తుంది ,
  • కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది ,
  • బి.ఫై.ని సరైన స్థితి లో ఉంచుతుంది ,
  • గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ,
  • కేన్సర్ వ్యాదిని దరి చేరనివ్వడు ,
  • శరీర రక్షణ శక్తిని పెంచుతుంది ,
  • కాలేయానికి మంచి చేస్తుంది ,
  • కీళ్ళ నోపుఉలు తగ్గిస్తుంది ,
తీసుకునే విధానము :
  1. మనలో చాలా మందికి తరచుగా జలుబు , కుక్కు దిబ్బడ , జ్వరం వస్తు ఉంటాయి .... వారు వెల్లుల్లి రోజు ఆహారం లోతీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది . అర చెంచా నేటి లో వేయిన్చియన్ రెండు వెల్లుల్లిపాయలను క్రమం తప్పకుండా రోజూ తినాలి .
  2. మీ ముఖం , శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి . దీనివల్ల రక్తం శుభ్రపడి దేహకాంతి పెరుగుతుంది . అపుడు చాక్లెట్లు , మసాలా వస్తువులు తినకూడదు .
  3. ఒక వెల్లుల్లి పాయ తిని , రాగిచెంబు లో నీరు సాధ్యమైనంత కెక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా వచ్చేసి మనం శుభ్రపడతాం ,
  4. మనం తినే ఆహారం లో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టిరాల్ తగ్గిపోతుంది . LDL ని నియంత్రించే anti-oxident గా పనిచేస్తుంది .
  5. ఒళ్ళు తగ్గాలని అనుకుంటున్నారా .. సగం నిమ్మకాయ రసం లో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము , సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయం లో కొవ్వుపదార్ధాలు , పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి ( నడక).
  6. అర్ధ రాత్రి చెవిపోటు వస్తే ... డాక్టర్ , మాదులు దొరకవు కావున వేడిచేసిన వెల్లుల్లి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నాలుగు చుక్కలు వేయండి చెవి నొప్పి తగ్గిపోతుంది .
  7. గర్భిణి గా ఉన్నప్పుడు రోజూ ఒక వెల్లుల్లి పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుంది .
  8. రోజూ రెండు వెల్లుల్లిపాయలను కాన్సర్ ఉన్నావారు తీసుకుంటే కాన్సెర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమువుతుంది .
  9. మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసు నీటిలో కలిపి రోజూ తీసుకుంటే కొన్నాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి .
  • జాగ్రత్తలు :
  1. వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్నపిల్లలకు తాక్కువ మోతాదులో వాడాలి . ఎక్కువైతే గాబరా పడతారు
  2. వెల్లుల్లి గాటుగా ఉంటుంది .. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది .
  3. వెల్లుల్లి కొంతమందికి పడదు .. ఎలర్జీ వస్తుంది , దురదలు , తలనొప్పి , ఆయాసం వస్తాయి . వీళ్ళు వెల్లుల్లి తినరాదు .
  4. ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు .
  • వెల్లుల్లిలో ఉండే ఔషధగుణాలు
 ప్రతి 100 గ్రాములలో,
  •  శక్తి 149 కేలరీస్‌, 
  • కార్బోహైడ్రేడ్స్‌-33.6 గ్రాములు , 
  •  చక్కెర-1.00 గ్రాములు, 
  • ఫైబర్‌-2.1 గ్రాములు, 
  • కొవ్వుపదార్ధాలు-0.5 గ్రాములు,
  •  ప్రొటీన్లు-6.39 గ్రాములు, 
  • బిటా కారొటిన్‌ 0%, 
  • విటమిన్‌ బి - 15%, 
  • విటమిన్‌ బి2 - 7%, 
  • విటమిన్‌ బి3 - 5%, 
  • విటమిన్‌ బి5 - 12%, 
  • విటమిన్‌ బి6 - 95%, 
  • విటమిన్‌ బి9 - 1%, 
  • విటమిన్‌ సి - 52%, 
  •  కాల్షియం - 18%, 
  • ఐరన్‌ - 14%, 
  • మాగ్నీషియం - 7%, 
  • ఫాస్పరస్‌ - 22%, 
  • పొటాషియం - 9%, 
  • సోడియం - 1%, 
  • జింకు - 12%, 
  • మాంగనీస్‌ 1.672 మిల్లీగ్రాములు, 
  • సెలినియం 14.2 ------------కూడా లభ్యమవుతాయి.



వెల్లుల్లితో ఉపయోగాలు వెయ్యి


ఆరోగ్యాన్ని పెంపొందించటానికి వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆధునిక వైద్యానికి పితామహుడనదగ్గ హిప్పో క్రేట్‌‌స(460-357 బి.సి) వెల్లుల్లిని అంటు రోగాలకు, ఉదర సంబంధ వ్యాధులకు వైద్యంగా ఉపయోగించేవాడని చెబుతారు.

ఔషధ విలువలు:
ఉబ్బసం, జర్వం, నులి పురుగులు, కాలేయం, పిత్తాశయ సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వెల్లుల్లి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యుల ప్రకారం హృదయ సంబంధ వ్యాధులు, కేశవృద్ధికి, ఆకలి పుట్టటానికి వెల్లుల్లి ఉపయుక్తమవుతుంది. ల్యుకోడెర్మా కుష్టు, మొలలు, కడుపులో పురుగులు, ఉబ్బసం, దగ్గు మొదలైన వ్యాధులకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ఆధునిక పరిశీలనలు కూడా వీటిని నిరూపిస్తున్నాయి.

ఛాతీ సంబంధ వ్యాధులు:
ఛాతీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను వెల్లుల్లి సమర్ధవంతంగా నివారిస్తుంది. శ్వాసకోశాలకు పట్టిన కొవ్వును కరిగించి శ్వాస సక్రమంగా జరిగేట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి వెల్లుల్లి సరిఅయిన ఔషధం అని డాక్టర్‌ మెక్‌డుఫీ కనుగొన్నారు. న్యుమోనియాకు వెల్లుల్లి అద్భుతమైన ఔషధమని డాక్టర్‌ ఎఫ్‌. డబ్లూ్య, క్రాస్‌మాన్‌ అంటారు. 48 గంటల లోపల టెంపరేచరును, నాడీ చలనాన్ని, శ్వాసను దారిలోకి తెస్తుందని అంటున్నారు. వెల్లుల్లిని నీటిలో మరగబెట్టి క్షయవ్యాధి రోగులు సేవిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది. ఒక గ్రాము వెల్లుల్లిని ఒక లీటరు పాలు, ఒక లీటరు నీటిలో కలిపి ఆమొత్తం నాలుగోవంతు మిగిలేదాకా మరగబెట్టి ఆ వచ్చిన డికాక్షన్‌ని రోజుకు 3 సార్లు సేవిస్తే క్షయ నయమవుతుంది.

ఉబ్బసం:
వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిలోని ఒక పాయను చితకకొట్టి 120 మిల్లిలీటర్ల మాల్‌‌ట - వెనిగార్‌తో కలిపి మరగబెట్టి, తర్వాత చల్లార్చి పడగట్టి, అంతే పరిమాణవు తేనెను అందులో కలిపి ఒక సీసాలో నిలవ ఉంచుకోవాలి. రెండు లేక మూడు మూడు స్పూన్లు ఈ సిరప్‌ను మెంతికూర డికాక్షన్‌తో కలిపి సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారీ ఒకటి లేక రెండు సార్లు చొప్పున సేవిస్తే ఉబ్బసం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.

జీర్ణకోశ వ్యాధులు:
జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది. ఇది లింఫ్‌ గ్రంధుల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటికి పంపటంలో సహకరిస్తుంది. వెల్లుల్లి అరుగుదలకు ఉపయోగపడే రసాలను ప్రేరేపిస్తుంది. వెల్లుల్లిని ముద్దలుగా నూరి పాలతో గాని నీటితో గాని కలిపి సేవిస్తే అరుగుదల చక్కగా ఉంటుంది. జీర్ణయంత్రాంగానికి సోకే అన్ని రకాల అంటురోగాలనూ వెల్లుల్లి సమర్థవంతంగా అరికడుతుంది. అందుకు కారణం- వెల్లుల్లిలో ఉన్న యాంటీ సెప్టిక్‌ గుణం!

హై బీపి నియంత్రణలో:
బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన వైద్యంగా వెల్లుల్లి తగ్గిస్తుంది. చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడి చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం లాంటివాటిని అరికడుతుంది. మందుల షాపులలో లభించే వెల్లుల్లి క్యాప్యూల్‌‌సని రోజుకు రెండు లేదా మూడిటిని వేసుకోవటం ద్వారా బీపిని దారిలోకి తెచ్చుకోవచ్చు.

వాత రోగాలు:
రష్యాలో వాతరోగాలకు వెల్లుల్లి ఉపయోగిస్తుంటారు. బ్రిటనులో కూడా అంతే. జపానులో జరిపి పరిశీలనలో మిగతా వాతరోగాల మీద ఎలాంటి సైడ్‌ఎఫెక్‌‌ట్స లేకుండా వెల్లుల్లి వైద్యం పని చేసినట్లుగా నిరూపితమైంది. వెల్లుల్లిలో వాపును తగ్గించే గుణం ఉంది. వాతరోగానికి గురైన ప్రదేశాన వెల్లుల్లి రసాన్ని మర్ధన చేయటం వల్ల ఆ భాగంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. వెల్లుల్లి తైలాన్ని చర్మం పీల్చుకొని రక్తంలో కలిసి వేగంగా నొప్పులను నివారిస్తుంది.

గుండెపోటు నివారణలో:
వెస్‌‌ట జర్మనీకి చెందిన డాక్టర్లు జరిపిన పరిశోధనలలో వెల్లుల్లి గుండెపోటును సమర్థవంతంగా నివారిస్తుందని విదితమైంది. వెల్లుల్లి రక్త కణాల్లో కొలెస్ట రాల్‌ని కరిగించి రక్తం సాఫీగా సాగేట్లు సహకరిస్తుందనీ, దీనితో హైబీపీ, గుండెపోటు నివారించబడతాయనీ కోలోన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ హామ్‌‌స రాయిటర్‌ అంటున్నారు.గుండె పోటు వచ్చిన రోగి వెల్లుల్లిని తీసుకుంటే కొలెస్ట రాల్‌ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల అంతకు పూర్వం గుండెకు జరిగిన డామేజ్‌ అయితే తొలగిపోదు గాని తిరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు మాత్రం తగ్గిపోతాయంటారు.

సెక్‌‌స సంబంధవ్యాధులు:
సపుంసకత్వ నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుందని అమెరికా లోని ప్రముఖ సెక్సాలజిస్‌‌ట డాక్టర్‌ రాబిన్‌సన్‌ పేర్కొంటున్నారు. సెక్‌‌స సామర్ధ్యం సన్నగిల్లడం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం తదితర సెక్‌‌ససంబంధ లోపాలకు వెల్లుల్లి దివ్యౌషధమని అంటారు.

వంటకాలలో:
మన ఆహారంలో ఉల్లిని తరచుగా ఉపయోగిస్తే, వెల్లుల్లిని అరుదుగా ఉపయోగిస్తుంటాం. కానీ వెల్లుల్లిని వాడటం దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ఆయుర్వేదం చెబుతున్నది. వెల్లుల్లిని వంటకాలలో బహు విధాలుగా వాడతారు. వెల్లుల్లిని నీరుల్లి, అల్లం, టమోటాలతో కలిపి వాడితే రుచిగా ఉండడమే కాక చాలా రోజులపాటు చెడిపోకుండా కూడా ఉంటుంది.

విటమెన్లూ అధికమే:
వెల్లుల్లిని పచ్చిగా కాని, ఆహార పదార్థాలతో గానీ వండుకుని, వేయించుకుని మందులాగా కానీ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయం. వెన్నలో వేయించుకుని రోజుకు ఏడు, ఎనిమిది వెల్లుల్లి పాయల్ని తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా తయారై క్రియాశీలతను పెంచుకుంటుంది. ఇందులో విటమిన్‌- సి, బి6, సెలీనియమ్‌, జింక్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌ వంటి లక్షణాలు ఉన్నాయి. విటమిన్‌-సితో అల్లిసిన్‌ కలిపి పని చేయడంవల్ల బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను నిరోధించడం చాలా తేలిక అవుతుంది. అంతేకాదు వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవల్ల విటమిన్‌-సి, అల్లిసిన్‌ల పనితనం మరింతగా పెరుగుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి:
జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి, రొంప నుండి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిలోని అవశ్య తైలాలలో గంధక శికాల ఉంటాయి. ఈ గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం. ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. జీర్ణాశయానికి వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది. ఆస్తా్మను అరికడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును కంట్రోల్‌ చేస్తుంది.

 
 వైద్యశాస్త్ర పరంగా మనం ముందు చెప్పుకున్నవి మాత్రమే కాక అనేక రుగ్మతలకి ఉత్తమ దివ్యౌషధంగా దీనిని వినియోగిస్తున్నారు. అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే ''హైడ్రోజన్‌ సల్ఫేట్‌'', ''నైట్రిక యాసిడ్‌'', రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుట్టిస్తుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలనీ దరిచేరనీయదు. ప్రతి నిత్యం పరగడుపున 2,3, వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా ఎంతగానో కాపాడు తుంది. వెల్లుల్లి మీద చేసిన అనేక అద్యయనాల వల్ల ఇందులో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగిస్తుందని వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచేగుణం కూడా ఇందులో ఉందని ఈ అద్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది. 1858లో లూయీస్‌ పాశ్చర్‌ వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రబలిన ''గాంగ్రీన్‌ '' వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు. తూర్పు యూరప్‌ దేశాలలో వెల్లుల్లి రేకల్ని పంచదార, ఉప్పు , మొదలైనవాటిలో ఊరబెట్టి ఆ ఊరగాయని అడపాదడపా జీర్ణవృద్ధిని పెంపొందించుకోడం కోసం వాడుతూవుంటారు. వెల్లుల్లిని పౌడరుగా కూడా తయారుచేసుకుని నిల్వవుంచుకుంటారు. ఇది ఫ్రెష్‌ వెల్లుల్లి రేకతో సమానంగా ఉంటుంది. 1/8వ వంతు చెంచా వెల్లుల్లి పౌడరు ఒక వెల్లుల్లి రేకతో సమానం గా ఉంటుంది. అందుకే దీనిని వంటకాల్లో కూడా వినియోగించు కోవచ్చు. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కళంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ 'సి' అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివౌషధంగా ఉపయోగపడుతుందని 1924లోనే కనుగొనడం జరిగింది. అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడు పులో నులిపురుగుల నివారణకి, లివర్‌ (కాలేయం)వ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే గుండెజబ్బులకి దీన్ని మించిన ఔషధం లేదంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. లుకోడెర్మా, కుష్ఠు వ్యాధులకి కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి దీనికి మించినది లేదు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది. రక్తపోటుని నియంత్రించడంలోను, టెన్షన్‌ తగ్గించడంలోను, జీర్ణకోశ వ్యాధుల నివారణకి, రక్తకణాల్లో కొలస్ట్రాల్‌ శాతాన్ని అదుపుచేయడానికి వెల్లుల్లిని మించిన ఔషధం లేదు. వారాని కి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్‌ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ నిర్మూలిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగనివారిణి అనే అనవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని ఉత్పత్తులు గణనీయంగా ఉన్నా యి. ఈ కోవలో చైనా 12,088,000, ఇండియా 645,000, సౌత్‌ కొరియా 325,000, ఈజిప్ట్‌ 258,608, రష్యా 254,000, యునైటె డ్‌ స్టేట్స్‌ 221,810, స్పెయిన్‌ 142,400, అర్జంటీనా 140,000, మయన్‌మార్‌ 128,000, ఉక్రయిన్‌ 125,000క్వింటాలు ఉత్పత్తి చేస్తూ చైనా అగ్రస్థానంలోను, ఇండియా రెండవస్థానం లోను నిలిచాయి. ఇంత విలువైన ఔషధగుణాలున్న వెల్లుల్లి మనం నిత్యం వాడుతున్నప్పటికీ, దీని విలువ తెలుసుకుని మరింత వినియోగించు కుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
  • ============================
డా.శేషగిరిరావు -శ్రీకాకుళం

No comments:

Post a Comment