Monday, August 10, 2009

ఆలివ్ నూనె , Olive Oil,సీమనూనె

ప్రస్తుతం ప్రపంచమంతటా ఆరోగ్య పరిరక్షణకు , దీర్ఘకాలము ఆనందముగా జీవించడానికి ఏది మంచో , ఏది చెడో అన్న ఆలోచనలతో మానవ మేధస్సు ఎక్కువ ఆలోచిస్తోంది . నూనెలలో మంచిది ఆలివ్ ఆయిల్ . ఒకవిధమైన సీమచెట్టు, దాని యొక్క పండున్ను, దానివిత్తులలోనుంచి నూనె తీస్తారు, నేతికి సమానమైనది. ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము . మధ్యధరా ప్రాంత దేశాలలో ఈ వంటనూనె ఎక్కువగా వాడతారు . రుచిని , పరిమళాన్ని , ఆరోగ్యాన్ని ఇస్తుంది .చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధన చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌మెంట్స్‌ తయారీ లో నూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగానూ మారుతుంది. చలికాలంలో డ్రై చర్మం కలవారు ఆలివ్‌ ఆయిల్‌ను చర్మానికి ప్రతిరోజూ రాస్తుంటే, చర్మం పగలకుండా ఉంటుంది. చర్మంపై పుండ్లు గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలను పోగొట్టి చర్మం సహజ రంగుతో నిగారింపుగా ఉండేలా చేస్తుంది. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి శరీరానికి మసాజ్‌ చేస్తే వారి చర్మం మృదువుగా ఉండి అందంగా తయారవుతారు. పీలగా ఉన్న పాపాయిలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే బొద్దుగా అందంగా అవుతారు. గ్రీస్‌కు చెందిన మహిళలయితే.. ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటూ సూచిస్తారు. రోజు స్నానానికి ముందు కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుంటే చాలు.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. దాంతోపాటు.. స్నానపు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెనూ వేసుకుంటారు వీరు. ఇక కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుని.. ఆ తర్వాత పంచదారతో రుద్దుకుంటే.. ముడతలు దరిచేరవని వీరి నమ్మకం. ఆలివ్ నూనె లో Extra Virgin , virgin , pure , Extra Light అని నాలుగు ఏకాలుగా దొరుకుతుంది . అందులో మొదటిది ( ఎక్స్ ట్రా వర్జిన్‌ ఆలివ్ ఆయిల్ ) మంచిది .
  • నాలుగు చెంచాల ఓట్‌మీల్ పొడిలో మూడు చెంచాల ఆలివ్‌నూనె కలిపి పాదాలకు మర్థన చేసి అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేస్తే మృతకణాలి తొలగిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి.
  • వంటకాల్ని రుచిగా మాత్రమే కాదు.. పోషకాలు తగ్గిపోకుండా వండటం.. కూడా తెలిసుండాలి. అందుకు ఏం చేయాలంటే.. ఆకుకూరలు ఉడికించే నీళ్లలో కొద్దిగా ఆలివ్‌నూనె లేదా నిమ్మరసం వేస్తే పోషక విలువలు పోకుండా తగ్గకుండా ఉంటాయి.
  • జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేయాలి.
  • బరకగా(rough) మారిన మోచేతులకు కొద్దిగా ఆలివ్‌నూనె రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుంది
  • చెంచా గ్లిజరిన్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌, రెండుచెంచాల ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు... చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
  • నాలుగుచుక్కల అల్లంరసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి.
  • ఆముదం, ఆలివ్‌నూనె వేడిచేసి చేతులను వేళ్లను ముంచి పావుగంటయ్యాక బయటకు తీసి మర్దన చేయడం వల్ల చక్కటి పోషణ అందుతుంది.చక్కగా పెరుగుతాయి.
  • ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బోర్డియక్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మూడు ఫ్రెంచ్ సిటీల్లో నివసించే 65 సంవత్సరాల వయసులో గల వారి 8000 వైద్య రికార్డులను పరిశోధించినట్లు మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడింది.ఐదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో వృద్ధుల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా సగానికి సగం తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ ఉపయోగించిన వృద్ధుల్లో 41 శాతం స్ట్రోక్ తగ్గిందని పరిశోధనలో తేలింది.
Collected /dr.seshagirirao-MBBS (Srikakulam)
  • --------------------------------------------------
  • ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
  • చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్‌ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.
  • ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ ధృడత్వం, అందం పెరుగుతాయి.
  • ఆలివ్‌ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్‌, పెరుగుకలిపి మచ్చల మీద రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి.
  • స్నానం చేయబోయే ముందు పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌ను ఒంటికి పట్టించి, మృదువుగా మర్దనా చేసి, మెత్తని సెనగపిండితో రుద్ది స్నానం చేయిస్తే పిల్లల లేతచర్మం ఎంతోకాంతిగా వుంటుంది. ఎముకలు ధృడపడతాయి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
  • చలికాలంలో ఆలివ్‌ఆయిల్‌ను ఆరారగా పెదాలకు రాస్తూంటే పెదాలు పగలకుండా మృదువుగానే వుంటాయి.
  • ఆలివ్‌ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు పగలవు, మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
  • ఆలివ్‌ఆయిల్‌ను వెచ్చచేసి, వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి, పది పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలిపోకుండా వుంటుంది.
  • ఈ ఆయిల్‌లో వెల్లుల్లిపొట్టును కాల్చిన పొడిని కలిపి కానీ లేదా వెల్లుల్లి పొట్టును అలాగే ఆయిల్‌లో కలిపి కాచి కానీ తలకు రాసుకుంటే జుట్టు నల్లబడటమే కాకుండా, త్వరగా జుట్టు నెరవదు.
  • పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ఆరారగా రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.
  • ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది.
  • ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.
  • ఆలివ్‌ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకురాచుకుని, తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు మెత్తగా మారుతాయి. కేశాలు పొడవుగా పెరుగుతాయి.
- కె. అనురాధ(ఆయుర్వేదిక్ వైద్యులు )నల్లకుంట -హైదరాబాద్ .
  • ===================================================
Visit my website -- Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment