Monday, August 10, 2009

అనాస , Pineapple

 • ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. అనాస ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిరిగా ఉంటుంది. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలోని ఫిలిప్పైన్స్‌లో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పైనాపిల్‌ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్‌ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్టపడతారు. వారు దీన్ని దేవతా ఫలంగా భావిస్తారు. తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. భారతదేశంలోకి ఇది 1548 సంవత్సరంలో ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయ్యింది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్‌ను పండిస్తారు. బహువార్షిక గుల్మము. దీని శాస్త్రీయ నామం ఎకోమోసస్‌. వృక్షశాస్త్రం ప్రకారం అనాస్‌ ఎకోమోసస్‌ అని..పిలుస్తారు. ఇది బ్రొమేలియా జాతికి చెందింది.
ఇది 1 మీటరు నుండి 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది కొంచెం పరిపక్వతకు వచ్చిన తరువాత పువ్వు వస్తుంది ఈ పువ్వు సుమారుగా 15 సెం.మీ ఉంటుంది. ఈ పువ్వు 12 నుండి 20 నెలల తరువాత పూర్తి పరిపక్వానికి వచ్చి, దీనిపై కనీసం 100 కనుపులు వరకూ ఏర్పడతాయి. అనాసని 1398వ సం్ప్పరంలో మెట్టమొదట గా కనుగొన్నారు. 1664 సం్ప్పరంలో యూరోపియన్లు దీనిని పైన్‌ కోన్‌గా పిలిచారు. బ్రెజిల్‌లో టూపీ అని పిలుస్తారు. ''అద్భుతమైన పండు'' అని దీని అర్ధం. దీనిని ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. స్పానిష్‌లో పైన్‌ కోన్‌, అమెరికాలో అనాస్‌, మన దేశంలో అయితే ఒరియాలో సాపూరీ పనాసా, తమిళంలో అనాచీ పాజ్‌ హామ్‌, బెంగాళీ, మళయాళంలో అనారోష్‌ అని పిలు స్తారు. బ్రెజిల్‌లో పెద్ద అనాస పండును అబాకాక్సీ అని పిలుస్తారు. అయితే ఇంగ్లీష్‌లో పైన్‌యాపిల్‌, తెలుగులో అనాస అనే పేర్లతోనే అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వాడబడు తున్నాయి.
 • వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.
దీనిలో ఎన్నో పోషక పదార్ధాలు ఉన్నా యి.100 grams contains:
 • దీన్ని తింటే 48 కిలో కాలరీల శక్తి వస్తుంది.
 • కార్బోహైడ్రేట్స్‌ 12.63గ్రా్ప్పలు,
 • కొవ్వు పదార్ధం 0.12%,
 • కాల్షియం 1%,
 • ప్రొటీన్లు 0.54 గ్రా్ప్పలు,
 • చక్కెర శాతం 9.26గ్రా్ప్పలు,
 • ఐరన్‌ 2% ఇన్ని పోషక పదార్ధాలు ఇందులో మిళితమై ఉన్నాయి. ఇందులో ప్రొటీన్ల శాతం కూడా ఎక్కువగా ఉంది.
 • థైమిన్‌ (విటమిన్‌ బి1) 6%,
 • రైబోఫ్లెవిన్‌ (విటమిన్‌ బి2) 2%,
 • నైసిన్‌ (విటమిన్‌ బి3 ) 3%,
 • పాన్‌థోతెనిక ఆసిడ్‌ (విటమిన్‌ బి5) 4%,
 • విటమిన్‌ సి 60%,
 • పొటాషియం 2%
ఇలా ఇన్ని విటమిన్లున్న ఈ అనాసకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.దీని వల్ల కలిగే ఉపయోగాలు ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుస్తాయి. దీని నుండి తీసిన రసం పానీయంగా తాగుతారు. అనాస పండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు అనాస పండు. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. వాతాన్ని, కఫాన్ని ఉపశమనం చేయడంలో ఇది ఉపయోగ పడుతుంది.
 • ఈ పండును తింటే శరీరంలోని జీర్ణ శక్తిని పెంచుతుంది.
 • రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.
 • ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
 • పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.
 • పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
 • జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే! కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.
 • అనాసపండు రసాన్ని ముఖాని కి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
 • అనాసలోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది.
 • ఇది అర గడానికి రెండు గంటలు పడుతుంది. పండని అనాసకాయ తింటే అరగడం చాలా కష్టమవుతుంది. దీనితో విరేచనాలు అవుతాయి.
 • బాగా పండిన అనాస రసం శరీర తాపాన్ని తగ్గిస్తుంది. అదనపు శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ పండులో ఉన్న కొన్ని ఎంజైమ్స్‌ కారణంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయానికి చక్కగా పని చేస్తుంది.
 • ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.
 • అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.
 • పచ్చి అనాసకాయ రసం తెగిన గాయాలపై వేస్తే రక్త స్రావం అరికడుతుంది.
 • గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
 • పొగ తాగడం వల్ల శరీరానికి సంభవించే అనర్ధాలు తగ్గిపోతాయి.
 • తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్‌ నివారణ అవుతాయి.
 • గజ్జి, దురద ఉన్నవారు అనాస రసం పైపూత మందుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది.
 • పచ్చ కామెర్ల కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల గుండెజబ్బులు ఉన్నవారు ప్రతిరోజు అనాసరసాన్ని తాగుతే మంచి ఫలితాలని స్తాయి.
 • పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
 • అనా సరసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.
-- Dr.Seshagirirao ,vandana - MBBS, DOHM,DAc,MAMS
 • =============================================

No comments:

Post a Comment