Saturday, August 22, 2009

సోయా గింజలు , Soya beans

  • ఫొటో : ఈనాడు న్యూస్ పేపర్ -- సౌజన్యము తో .
గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది . మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు . త్వరగా జీర్ణము అవుతుంది . అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను . శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు , లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది . సోయద్వారా లబించే మాంసకృత్తులు -- పాలు , మాంసము , కోడిగుడ్ల తో సరిసమానము . పై గా కొలెస్టిరాల్ , లాక్టూజ్ (Lactose)లేని ఆహారము . పీచు అధికము , కేలోరీస్ పరిమితము మంచి రకానికి చెందిన ' లైపిడ్స్ ' ఉన్నాయి. నిద్రపుచ్చే సోయా! ముట్లుడిగిన (మెనోపాజ్‌) మహిళల్లో చాలామంది నిద్రలేమితో సతమతమవుతుంటారు.వీరికి సోయాబీన్స్‌లోని ఈస్ట్రోజెన్‌ వంటి రసాయనాలు ఎంతగానో మేలు చేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీటిల్లోని ఐసోఫ్లేవన్లతో నిద్రించే సమయం పెరుగుతున్నట్టు గుర్తించారు. నాలుగు నెలల పాటు ఐసోఫ్లేవన్లు తీసుకున్నాక నిద్రలేమమి సమస్య 37 శాతానికి పడిపోవటం విశేషం సోయా... చిక్కుడు జాతికి చెందినది. పిండి, నూనె, టోఫు, పాలు, పెరుగు రూపంలో వివిధ రకాలుగా వాడుతుంటారు. అలానే సోయాలో పలు ముఖ్యమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. మాంసవృద్ధి, నరాల పుష్ఠికి వీటిలో లభించే మాంసకృత్తులు ఎంతో అవసరం. * కప్పు సోయా గింజల్లో 240 గ్రాముల మటన్‌, 180 గ్రాముల చేపలు, ఎనిమిది కప్పుల పాలు, ఆరు గుడ్లకు సమానమైన మాంసకృత్తులు అందుతాయి. * సాధారణంగా మనం తీసుకొనే ప్రొటీన్లు కొన్నిసార్లు కడుపులో అజీర్ణం కలిగిస్తుంటాయి. కానీ వీటిలోని అమినో ఆమ్లాలు సాఫీగా అరిగిపోతాయి. ఉపయోగాలు * నిత్యం తీసుకొనే ఆహారంలో ఒక వంతు సోయా మిగతా మూడు వంతులు ఇతర ఆహారం చేర్చితే.. శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. ముఖ్యంగా శాకాహారులకు దీనిలోని క్యాల్షియం, అమినో ఆమ్లాలు, విటమిన్లు, ఇనుము, ఫోలిక్‌ ఆమ్లాలు ఎముకలకు, కండరాలకు, కణాభివృద్ధికి సాయపడుతుంటాయి. * హృద్రోగాలు, చక్కెర వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ సోయాను ఆహారంలో తీసుకుంటే కొవ్వు నిల్వలు పేరుకోవు. రక్తంలో చక్కెర శాతం పెరగదు. * మసాలా వంటకాల్లో ఉపయోగించే మీల్‌మేకర్‌ను సోయా పిండితోనే తయారుచేస్తారు. బరువు తగ్గాలనుకొనేవారు కూరల్లో వేసుకొని తీసుకొంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. * పసిపిల్లలకు తల్లిపాలు పడనప్పుడు సోయా పాలను కొంచెంగా ఇస్తే మంచిది. వీటిలో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. నరాల బలహీనత, నిస్సత్తువ, మానసిక ఒత్తిళ్లు.. వంటివి బాధించినప్పుడు సోయా పాలను క్రమంగా తీసుకొంటే త్వరిత ఉపశమనం లభిస్తుంది. పాలు, పెరుగు, వాటి సంబంధిత పదార్థాలు పడని వారు సోయాపాలు తీసుకోవచ్చు. * ఈ పాలను ఎక్కువగా తీసుకొంటే ఈస్ట్రోజెన్‌ అనే హార్మోను తగ్గినప్పుడు ఏర్పడే శరీర వేడి, నరాల బలహీనత, ఎముకల బలహీనత చర్మ సమస్యలు దూరమవుతాయి. * గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలు, చక్కెర వ్యాధి గలవారు ఇతర మాంసాహారాలకు బదులుగా సోయా సంబంధిత పదార్థాలు కొంచెంగా తీసుకోవచ్చును. గర్భిణులు, బాలింతలు సోయాపాలు తీసుకొంటే ఇనుము, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా అందుతాయి. * చర్మం పొడిగా, కళావిహీనంగా మారితే ప్రతిరోజూ పొద్దుటే శరీరానికి రాసుకొని నలుగు పెట్టి స్నానం చేస్తే మంచి వర్ఛస్సు వస్తుంది. జాగ్రత్తలు * సోయాగింజలపై పొట్టు కడుపులో వికారాన్ని, అజీర్ణాన్ని కలిగిస్తుంది.దానిని తీసి వాడుకోవడం మంచిది. దీనిని బాగా ఉడికించి తీసుకుంటే కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవు. * రోజుకు ఇరవై, ముప్ఫై గ్రాములకు మించి సోయా గింజలను తీసుకోకూడదు. ఆస్తమా, చర్మ, అజీర్ణ, హార్మోన్ల సమస్యలున్న వారు వైద్యుల సలహా ప్రకారమే వాడుకోవాలి. వందగ్రాముల సోయాలో పోషకవిలువలు
  • పిండిపదార్థాలు: 20.9శాతం,
  • క్యాల్షియం: 240మి.గ్రా,
  • నియాసిన్‌: 2-4మి.గ్రా,
  • ప్రొటీన్లు: 43.2 శాతం,
  • ఫాస్పరస్‌: 690మి.గ్రా,
  • కొవ్వు: 19.5మి.గ్రా,
  • ఇనుము: 11.5మి.గ్రా,
  • పీచుపదార్థం: 3.7శాతం,
  • విటమిన్‌ 'ఎ': 710యూఐ,
  • ఖనిజాలు- 4.6శాతం,
  • విటమిన్‌ 'బి1': 730ఎమ్‌సీజీ,
  • విటమిన్‌'బి2': 76ఎమ్‌సీజీ.
--పెద్ది రమాదేవి (ఆయుర్వేదిక్ ఫిజీషియన్‌ )
  • ====================================
Visit my website at -> Dr.Seshagirirao.com /

No comments:

Post a Comment