Monday, August 10, 2009

టీ , Tea

 •  

 •   • ------------------------------------------------
టీ - త్రాగానివారు ఉండరనే చెప్పాలి , అన్ని దేశాలలో ఇది అలవాటు గా మారినది . తక్కువ మోతాదు లో ఆరోగ్యానికి మంచిది . దీని శాస్త్రీయ నామము " Camellia sinensis" సాదారణము గా ఎండు ఆకులనుండి Tea ని తాయారు చేస్తారు . ప్రపంచములో మంచినీరు తరువాత ఎక్కువగా తాగే పానీయము ... టీ.

Tea లో రకాలు :
 •  White tea : Unwilted and unoxidized ,
 • Yellow tea : Unwilted and unoxidized but allowed to yellow ,
 • Green టీ : Wilted and unoxidized ,
 • Oolong : Wilted, bruised, and partially oxidized ,
 • Black tea : Wilted, sometimes crushed, and fully oxidized 
 • Post-fermented tea : Green Tea that has been allowed to ferment/కంపోస్టు ,, 
టీ లో ఉన్నా పదార్దములు : (contents):
 • catechins - ఒక రకం 'యాంటి ఆక్షిడెంట్ '(Anti Oxident) . 
 • theanine -కాన్సుర్ ని నయము చేయును , రాకుండా కాపాడును ,
 • Ceffine -- stimulant, 
 • theobromine - stimulant and broncho dialator, 
 • theophilline- stimulant and broncho dialator, 
 • fluoride --విసపదార్దము , 
 • tanin -- విసపదార్దము , టీ లో కార్బో హైడ్రేట్ లు , ప్రోటీన్లు , కొవ్వులు ఉండవు.  

ఆరోగ్య కరం గా చుస్తే :
 • కాన్సర్ రాకుండా కాపాడును - polyphenals ఉన్నందున ,స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది , సెర్వికల్ కాన్సర్ ప్రమాదము వెనకబడుతుంది , అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా దూరమవుతుంది . జీర్ణ నాళం లోని పాలు భాగాలకు వచ్చే కాసర్లకు ఇది విరుగుడు గా పనిచేస్తుంది . కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది ,
 • fluoride ఉన్నందున పళ్ళను గట్టిపరుచును ,
 • dehydration రాకుండా కాపాడును - నీరు తాగేందుకు దోహదం చేయును ,
 • కెఫీన్ - కొద్ది పాలు ఉన్నా శరీరము , మనసు ఉల్లాసం గా ఉండేందుకు ఉపయోగపడును , ఇది గ్లుకోస్ ను లివర్ ద్వారా విడుదలచేయడం వలన శక్తిని ఇచ్చును .
 • రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది .
 • చెడ్డ కొలెస్టిరాల్ పరిమితి తగ్గిస్తుంది ,
 • హైపర్ టేన్సున్ (BP) రానీయదు ,
 • ట్యూమర్లు కలిగించే ఎంజైములను తటస్త పరుస్తుంది ,
 • జీవకణాలను నాశనం కానీయదు - పాడయిన జీవకణాలను మరమ్మత్తు చేస్తుంది ,
అనారోగ్య కరం గా చుస్తే :
 • ఆహారముతో పాటు టీ ని తీసుకుంటే ఆహారము లోని పోశాకపదర్దములు శరీరము గ్రహించడం లో ఇబ్బంది కలుగుతుందిముఖ్యం గా ' ఐరన్ ' టానిన్ తో కలిసి పనికిరాకుండా పోతుంది .
 • టీ ఎక్కువ గా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాసముంటుంది .
 • టీ మెదడు ని ఉత్తేజ పరిచి నందున శరీరాణి ఉషారు గా ఉన్నా కొంత సేపటికి దాని ప్రభావము తగ్గి మెదడు డిప్రెషన్ కిలోనవుతుంది .
 • విద్యార్దులు టీ తాగి ఉషారుగా నిద్ర రాకుండా చదివి నా .. ఆ ఏకాగ్రత ఎక్కువ సేపు నిలువదు .
 • టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగించి భోజము తీసుకోవడం తగ్గడం వలన ఆరోగ్యము క్షీనించును .
మన దేశము లో తెలుగువారు రుచి కోసం వాడే కొన్ని టీ రకాలు :
 1. సాదారణ టీ ,
 2. గ్రీన్‌ టీ ,
 3. మసాల టీ ,
 4. గార్లిక్ టీ ,
 5. జింజర్ టీ ,
 6. బ్లాక్ టీ ,
 7. లెమన్‌ టీ ,
 8. హెర్బల్ టీ -Herbal Tea,
'టీ'తో లాభాలెన్నో : అదేదో చేయకూడని పనిలా 'మా వాడు ఛాయ్‌ కూడా తాగడోయ్‌'... అని గొప్పగా చెప్పుకోవడం చాలామందికి అలవాటు. తేనీరువల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాక అలాంటి వారి ఆలోచన మారిపోవచ్చు. అవేంటంటే...
 • రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.
 • బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.
 • రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.
 • టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.
 • తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి.
 • గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.
 • టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.
 • అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు.
 • టీ డీహైడ్రేషన్‌ సమస్యనూ దూరం చేస్తుంది.

 • ==============================
- డా.వందన శేషగిరిరావు ......... శ్రీకాకుళం

No comments:

Post a Comment