Monday, August 10, 2009

Water , నీరు,

 • నీరు : సహజసిద్ధమైన పానీయము నీరు . పంచభూతాల్లో నీరు ఒకటి ... ప్రాణాధారమైన ఈనీరు లేనిదే జీవరాశి మనుగడ లేదు . ప్రతి జీవి ఆహారము తో నీటిని త్రగాల్సిందే .
 • అన్నింటి కి దివ్య ఔషధం నీరు .శరీరములో జరిగే మెటబాలిక్ చర్యల్కు నీరు అతిముఖ్యము . చాలా మందికి తెలియకునా నీరు , నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరి చేరవు . శరీరము లొ రక్తం కి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉన్నది . మానవ శరీరము లోని ద్రవ పదార్ధాల సమ్మేళనానికి , విటమిన్లు , మినరల్స్ అన్ని అవయవాలము సరఫరా చేయడం లో నీరు భూమిక వహిస్తుంది . నీటిలో క్లోరిన్‌ , ఇయోడి్న్‌ , ఆక్షిజన్ వంటి వాయువులు సమపాళ్ళ లో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యం గానే ఉంటాడు .
నీటి వలన కలిగే లాభాలు :
 • అలసటను తగ్గిసుంది ,
 • ముత్రపిందాల్లో రాళ్ళు ను కరిగిస్తుంది ,
 • డీ హైడ్రేషన్ ను నివారిస్తుంది .
 • శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది .
 • శరీరములోని మలినాలను శుభ్రము చేస్తుంది ,
 • గాయాలను మానే (heeling process) పక్రియను ఉత్తేజ పరచును ,
 • ఎక్కువ నీరు తాగుట వలన శరీరం బరువు తగ్గును ,
 • రక్త పోటు ను తగ్గించును .
మనిషికి రోజుకు 2.5-3.0 లీటర్ల నీరు అవసరము మరియు ఆరోగ్యము . కొంత నీరు మనము తినే ఘన పదార్డ ఆహారము నుండి లభిస్తుంది ... మిగతాది త్రగావలసిందే .
 • ఒక మనిషి రోజుకి ఎంత నీరు త్రాగాలి అంటే :
సుమారుగా మనిషి బరువు కిలోగ్రాములలో / 30 = లీటర్లలో . ఉదా : మనిషి బరువు =60 కి.గ్రా. రోజూ త్రాగవలసిన నీరు =60/30 = 2 .0 లీటర్లు) .(సుమారు అటు .. ఇటు గా )
 • ఎక్కువగా తాగితే ? :
నీరు తాగడము వల్ల సైడు ఎఫెక్ట్సు ఉండవు . ఎక్కువగా తాగితే మూత్రపిండాలకు శ్రమ ఎక్కువవుతుంది. తక్తం లొని సోడియం నిల్వలు పల్చబడతాయి. అందువలన ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు . దఫ దఫాలు గా కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి .
 • తక్కువగా తీసుకుంటే :
రక్తము చిక్కనై రక్తప్రసరణ సాఫీగా జరుగదు . మెదడు చైతన్యము తగ్గుతుంది . శరీరానికి అలసట ఎక్కువవుతుంది . గ్లాని (fatigue) ఎక్కువవుతుంది .
 • తక్కువ , ఎక్కువ లు ఎలా తెలుస్తాయి :
మూత్రము స్వచ్చముగా , ఏ రంగూలేనిదిగా ,లేదా లేత పసుపు రంగులోగాని ఉంటే శరీరములో తగినంత నీరు ఉన్నట్లు లెక్క . ముదురు పసుపు , బంగారపు రంగులో ఉంటే గనుక నీరు తాగవలసిన అవస్యకత ఉంటుంది. ఏవైనా మందులు ఉదా: బి.కాంప్లెక్ష్ మాత్రలు లాంటివి వాడుతున్నవారిలో ఇలా రంగులు సరిపోల్చడము కుదరదు. ఆయా మందుల రంగులు మాత్రములో కలిసి ఉంటాయి.
 • రక్తపోటు నివారణకు మంచినీరు
ఆరోగ్యంగా ఉండాలంటే అధికంగా నీటిని సేవించండని వైద్యులు పదేపదే చెబుతుంటారు. అయితే నీటిని ఎక్కువగా సేవించడం ద్వారా రక్తపు పోటును కూడా నియంత్రించవచ్చునని అమెరికాలోని వండర్‌ఫీల్డ్ వైద్య విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.
 • ప్రతిరోజూ నీటిని అధికంగా సేవించడం ద్వారా నరాల బలహీనత నివారించవచ్చని ఈ పరిశోధన తేల్చింది. పరిమితంగా నీటిని తాగడంతో ఆరోగ్యానికి కలిగే మేలు కంటే.. అధికంగా సేవించడం వల్లే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని వండర్ ఫీల్డ్ యూనివర్శిటీ బృందం స్పష్టం చేసింది.
అధిక నీటిని సేవించడం ద్వారా రక్తపు ధమనుల్లో చేరిన మలినాలను పూర్తిగా కరిగి పోతాయని ఈ పరిశోధనలో తేలింది. అలాగే, శరీరంలో రక్తపోటు నియంత్రణ జరిగేందుకు వీలవుతుందని వైద్యుల వెల్లడించారు. రక్తపోటుతో బాధపడేవారికి కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ కోల్పోవడం, వాంతులు వంటి సంకేతాలు కనిపిస్తే.. ఒక గ్లాస్ నీటిని సేవించడం మంచిదని వారు అంటున్నారు. అలాగే శరీరంలోని నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా.. రోజు నీటిని పరిమితంగా తీసుకుంటూ ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. దాహం లేదని ... నీరు తాగకుండా ఉండరాదని సర్వే చెపుతోంది. దాహం ఉన్నా లేకపోయినా నీటిని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సేవిస్తూ ఉంటే.. రోజువారీ పనులకు కావలసిన శక్తిని పొందవచ్చునని ఈ సర్వే పేర్కొంది.
 • ఈ విషయమై వండర్ ఫీల్డ్ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. నీటిని అధికంగా తాగడం ద్వారా రక్తపోటును నియంత్రించడం మరియు తగ్గించడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే శరీరంలోని నాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నీటిని సేవించడం మంచిదని ఆయన తెలిపారు. ఇంకా నీటిని తాగడం ద్వారా రక్తపు పోటును నియంత్రించడానికి వీలవుతుందనే విషయం పదేళ్ల పాటు జరిగిన పరిశోధనలో తేటతెల్లమైందని ఆయన చెప్పారు.
 • నీటి వల్ల కనిగే వ్యాధులు : స్వచ్చమైన నీరు ఎంత మేలు చేస్తుందో .. కలుషితమైన నీరు అంతే కీడు చేస్తుంది . కలుషితమైన నీటితో స్నానము చేస్తే చర్మరోగాలు వస్తాయి. కలుషితమైన నీరు తాగితే విరోచనాలు , వాంతులు , టైఫాయిడ్ , కలరా , పచ్చకామెర్ల వ్యాధులు వస్తాయి.
 • డయేరియా ,
 • టైఫాయిడ్ ,
 • డిసెన్ట్రి ,
 • అమిబియసిస్ ,
 • కలరా ,
 • రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు
వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది. ఈ రెండు వాయు పదార్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది. అవి ఏమిటంటే.
 • గొంతునొప్పి, టాన్సిల్స్‌ : నీరు వేడిచేయాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిట పట్టాలి. ఉపశమనం కలుగుతుంది.
 • జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ : నీటిని మరిగించాలి. దానిలో కొద్దిగా పసుపు లేక యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండుచుక్కలు వేయాలి. ఆ నీటిఆవిరిపడితే మంచి రిలీఫ్‌.
 • తలనొప్పి : ఐస్‌ ముక్కలు నుదుటిపై రుద్దాలి.
 • జ్వరం : తడిగుడ్డతో/ మంచు ముక్కలతో శరీరం ముఖ్యంగా పాదాలు, ఆరిచేతులు తుడవాలి. దీనివల్ల 1-2 డిగ్రీల జ్వరం తగ్గుతుంది.
 • ఎక్కిళ్ళు : గోరువెచ్చని గ్లాసుడు నీరు నెమ్మదిగా సిప్‌ చేస్తూ త్రాగాలి.
 • కుక్క కరిస్తే : సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. గాయాన్ని కడగాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కల్గించే సూక్ష్మజీవులు, తొలగిపోతాయి. తిరిగి సబ్బు నీటితో కడిగి కట్టుకట్టాలి.
 • చర్మం కాలితే : వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశం తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింతగా చర్మం కాలి పోకుండా ఉంటుంది.
 • దగ్గు : వేడినీరు త్రాగితే కఫం కరుగు తుంది. పసుపును మరిగేనీటిలో వేసి ఆవిరి పట్టాలి.
 • చిన్న చిన్న గాయాలు : చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకట్టి రక్తం కారడం తగ్గుతుంది.
 • నిద్రపట్టకపోతుంటే : చల్లటి/ గోరువెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. పాదాలు వేడినీటి తో తడుపుకోవడం మంచిది.
 • ఒళ్ళు నొప్పులు : వేడినీటిలో ఉప్పువేసి కాపడం కాయాలి.
 • మలబద్దకం : ఎక్కువగా నీరు త్రాగాలి. రాత్రి రాగి చెంబులో నీరుపోయాలి. అది పరగడుపున త్రాగాలి. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగును.
 • వాపులవల్ల కలిగే నొప్పి : ఐస్‌ ముక్కతో బాగా రుద్దాలి.
 • ముక్కులోంచి రక్తం పడుతుంటే : చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వెయ్యాలి.
 • దంతాల నొప్పి : గోరువెచ్చని నీటిలొ ఉప్పువేసి పుక్కిలించాలి.
 • శరీరంలోనొప్పులు: వేడినీటి కాపడం, వేడినీటి ఆవిరి.
 • రుమాటిజం : ఎక్కువనీరు త్రాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ లెవెల్‌ తగ్గుతుంది. యూరిన్‌ ద్వారా యూరిక్‌ ఆమ్లం బయటికిపోతుంది.
 • మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ : ఎక్కువనీరు త్రాగితే ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సూక్ష్మజీవులు వేగంగా, మూత్రం ద్వారా ఎక్కువగా విసర్జింపబడి ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.
 • కంటిలో నలక పడితే : నలపకూడదు. గ్లాసు నిండా నీరు తీసుకోవాలి. దానిలో కన్ను ముంచి చికిలించాలి. కంటిలోని దుమ్ము, ధూళి, నలకలు వంటివి నీటిలోకి వచ్చి బయటికి పోతాయి.
 • విరోచనాలు, వాంతులు : శరీరంలో నుండి ఎంతనీరు బయటికిపోతుందో అంతే పరిమాణంలో నీరు త్రాగితే నిర్జలీకరణం అరికట్టబడుతుంది.
 • రసాయనాలు చర్మంపై పడితే : ఎక్కువసేపు, ఏకధారగా నీరుపోస్తూ కడగాలి. తీవ్రత తగ్గుతుంది.
 • మూత్ర పిండాలలో రాళ్ళు : ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్న రాళ్ళు మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. మూత్రం పలచబడడం వల్ల యూరిన్‌లో యాసిక్‌ రాళ్ళు ఏర్పడవు. మూత్రకేశ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది.
 • ఎక్కువగా నడవడంవల్ల కలిగే కాళ్ళనొప్పులు : గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలపాలి. కొద్దిసేపు ఆ నీటిలో పాదాలు ఉంచాలి.
 • కడుపునొప్పి : హాట్‌వాటర్‌ బేగ్‌ ఆ ప్రదేశంలో ఉంచాలి.
 • జ్వరం : గంటకు కనీసం ఒక గ్లాసు నీరు త్రాగడం మంచిది. శరీరం నుండి బయటికిపోయే నీరు భర్తీ అవుతుంది. నీరు ఆవిరి అవడంవల్ల చర్మం చల్లబడు తుంది. మలినాలు ఎక్కువగా విసర్జింప బడతాయి. ఇన్‌ఫెక్షన్‌ త్వరగా తగ్గుతాయి.
 • శరీరంలో ఏ అవయవమైనా వాపు, నొప్పి : ఐస్‌ముక్కలతో రాయాలి.
 • ఒంటికి నీరు పడితే : పెరుగు ఎక్కువగా వాడాలి. ఇది కఫాన్ని కరిగిస్తుంది కూడా.
 • ముక్కులో, గొంతులో శ్లేషం : దోసిట్లో నీరు పోసుకొని ముక్కుతో లోనికి లాగడం.
నీరు తాగే సరియైన సమయాలు : Correct timings to take water-> ఒక గ్లాసు నీరు = సుమారుగా 200 మి.లీ.
 • 2 గ్లాసులు నీరు -- నడక వ్యాయామం తర్వాత తీసుకుంటే శరీరములోని అవయవాలు ఉత్తేజితమగును,
 • 2 గ్లాసులు నీరు-- 30 నిముషాలు భోజనము ముందు తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగును ,
 • 2 గ్లాసులు నీరు-- 60 నిముషాలు భోజనము తరువాత తాగితే జీర్ణసంభందిత రుగ్మతలు పోవును .,
 • 2 గ్లాసులు నీరు--05 నిముషాలు స్నానము చేసే ముందు తాగితే రక్తపోటు (బి.పి) తగ్గును ,
 • 2 గ్లాసులు నీరు--05 నిముషాలు పడుకునే ముందు త్రాగితే గుండె పోటు వచ్చే అవకాశము చాలా శాతము తగ్గును ,
 • 2 గ్లాసులు నీరు-- పరగడుపున త్రాగితే ఎసిడిటీ బాదలు లేకుండాపోవును .. మూత్రపిండాల వ్యాధులు దరిచేరవు ,
 • జలసంక్షోభం
పురోగమనం... జలవనరుల్ని వెతుక్కుంటూ మనిషి సాగించిన ప్రయాణమే...నాగరికత. నీటి ప్రాధాన్యం తెలుసుకోవడం మానవ వికాస చరిత్రలో ఓ మైలురాయి. ఆ గలగలల వెంబడే పరిగెత్తాడు. నదీతీరాల్లో నివాసాలు కట్టుకున్నాడు. పంటలు పండించాడు. కార్ఖానాలు నడిపాడు. సరుకుల్ని ఓడలకెత్తించి వర్తకం చేశాడు. అక్షరాల్ని కనిపెట్టాడు. ఆలోచనల్ని విస్తరించుకున్నాడు. సృష్టిమూలాలపై ఆసక్తి పెంచుకున్నాడు. తెలియని శక్తికి దేవుడని పేరుపెట్టాడు. నీటికి దైవత్వాన్ని ఆపాదించాడు. ప్రవాహాల పక్కనే పుణ్యక్షేత్రాలు కట్టాడు. జలసంపద ఉందంటే, సకల సంపదలూ ఉన్నట్టేనని భావించాడు.
 • జలమే బలం. జలమే జయం!
తిరోగమనం..: జీవనదులు కళతప్పాయి. చెరువులు రియల్‌ఎస్టేట్‌ వెంచర్లుగా మారాయి. కుంటలు కనిపించకుండా పోయాయి. భూగర్భం...గర్భవిచ్ఛిత్తికి గురైంది. పాతాళానికి పైపులేసినా...చుక్క నీరు కూడా దొరకదు. గొంతెండిపోతోంది. పంటెండిపోతోంది. రాకాసికరవు రాజ్యమేలుతోంది.జలంతో నాగరికుడైన మనిషి.. నీటికరవుతో మళ్లీ మృగసమానుడు అవుతున్నాడా? భవిష్యత్‌లో నీటికోసం యుద్ధాలు జరుగుతాయా? జరుగుతాయి. నిస్సందేహంగా జరుగుతాయి. మనిషి మేల్కొనకపోతే, తీరు మార్చుకొనకపోతే...బిందెలు ఆయుధాలై పైకిలేస్తాయి. నీటి ట్యాంకర్ల కోసం యుద్ధట్యాంకులు రంగంలో దిగుతాయి. జలవనరుల చుట్టూ సైనికదళాల్ని మోహరించాల్సిన పరిస్థితి రావచ్చు.
 • 20వ శతాబ్దాన్ని చమురు శాసించింది.
21వ శతాబ్దాన్ని నీరు ప్రభావితం చేస్తుంది! గొంతెండుతోంది -- జీవనదులు, భూగర్భం , వర్షాలకు నిండే వాగులూవంకలూ... ఈ మూడూ మనిషికి జలనిధులు. భూగోళంలో 70 శాతం నీరే. అందులో 97 శాతం ఉప్పునీరు. మిగిలిన మూడుశాతం మంచినీళ్లు. అందులోనూ సగానికిపైగా మంచురూపంలో ఉంది. మహా అయితే, ఒకటి నుంచి ఒకటిన్నర శాతం మాత్రమే సురక్షితమైన తాగునీరు. కోటానుకోట్ల మానవాళి గొంతు తడుపుకోడానికి ఆ కాసిన్ని నీళ్లే ఆధారం.
 • పర్యావరణ వినాశం...అనేకానేక దుష్ఫరిణామాలకు కారణం అవుతోంది. అడవులు కుంచించుకుపోతున్నాయి. పచ్చదనం నాశనమైపోతోంది. ప్రకృతిలో సమతౌల్యం లోపిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు తగ్గిపోతున్నాయి. జీవనదులు బక్కచిక్కిపోతున్నాయి. దీంతో నీటివనరులు అడుగంటుతున్నాయి. అవసరాలు మాత్రం నానాటికీ పెరుగుతున్నాయి. జనాభా అధికమవుతోంది. పారిశ్రామిక రంగానికి మరింత నీరు కావాలి. సేద్యానిది ఎప్పుడూ సింహభాగమే. మనకున్న జలవనరుల్లో 85 శాతం వ్యవసాయానికే. ఈ సరఫరాలో ఒక్కశాతం తగ్గినా.. తీవ్రస్థాయిలో ఆహారకొరత ఏర్పడుతుంది. జనాభా పెరగడంతో, 1970తో పోలిస్తే నీటివాడకం రెట్టింపు అయింది. సరఫరా మాత్రం రవంత కూడా పెరగలేదు. ఎంతోకొంత తగ్గింది కూడా. ఫలితంగా, జలవనరుల మీద ఒత్తిడి పెరుగుతోంది. నీటి కష్టాలు అధికం అవుతున్నాయి. ఆసియాలో ఆ తీవ్రత మరీ ఎక్కువ. కారణం, ప్రపంచ జనాభాతో పోలిస్తే... ప్రపంచ జలవనరుల్లో ఆసియా వాటా అతి తక్కువ. నీటి కొరత అంతర్జాతీయ సమస్యే అయినా... తొలి దెబ్బ మాత్రం మనకే! పట్టిక చూస్తే పరిస్థితి అర్థమైపోతుంది.
 • మనిషి - నీరు
బతకడానికి నీరు కావాలి. బతుకు సాగించడానికీ నీరు కావాలి. శరీర వ్యవస్థలో నీటికున్న ప్రాధాన్యం అంతాయింతా కాదు. నీరు లారీ డ్రైవరులాంటిది. మనం తీసుకున్న ఆహారంలోని పోషకవిలువల్ని వివిధ భాగాలకు చేరవేస్తుంది. నీరే లేకపోతే...ఆ పోషక విలువల పంపిణీ బంద్‌. మంచమెక్కాల్సిందే. మన శరీరంలో 70 శాతం దాకా నీరే. ఆహారం లేకుండా ఐదువారాలు బతకొచ్చు కానీ, నీళ్లు లేకుండా ఐదు రోజులు కూడా ఉండలేం. ఒంట్లో తగినంత నీరు లేకపోవడం...ప్రాణానికే ప్రమాదం. మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాల్ని నీటిద్వారానే బయటికి పంపుతాయి. నీరు లేకపోతే, ఆ చెత్తంతా అలానే పేరుకుపోతుంది. తగిన మోతాదులో నీరు అందకపోతే...చర్మం పొడిబారిపోతుంది. కండరాల్లో కదలిక సమస్యలొస్తాయి. వూపిరితిత్తులు, గుండె సక్రమంగా పనిచేయవు. అందుకే రోజుకు కనీసం రెండులీటర్ల నీళ్లయినా తాగాలంటారు డాక్టర్లు. వేసవిలో ఆ మోతాదు మరింత పెరగాలి. గొంతు తడుపుకోడానికో, దప్పిక తీర్చుకోడానికో మాత్రమే కాదు...పరిపూర్ణ ఆరోగ్యం కోసం తాగాలి. నీటి కొరత తీవ్రంగా ఉన్న రాజస్థాన్‌ లాంటి ప్రాంతాల్లో...చర్మరోగాలు మొదలు మూత్రపిండాల సమస్య దాకా...అనేకానేక రుగ్మతలు రాజ్యమేలుతున్నాయి. నీటికరవు మనసు మీదా ప్రభావం చూపుతుంది. మానసిక జాడ్యాలకు కారణం అవుతుంది.
 • ఇదంతా వ్యక్తికి సంబంధించి. వ్యవస్థను ఇరుకునపెట్టే ప్రభావాలూ ఉన్నాయి. తగినంత సాగునీరు అందకపోతే, పంటలెండిపోతాయి. దిగుబడి తగ్గిపోతుంది. ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతాయి. డ్యాములు నిండుకుంటే, జలవిద్యుత్‌ తగ్గిపోతుంది. పారిశ్రామిక ప్రగతి మందగిస్తుంది. లాకౌట్లు పెరుగుతాయి. నిరుద్యోగం అధికం అవుతుంది.
 • పరిస్థితి ఇలానే ఉంటే, 2030 నాటికి భారత్‌లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ హెచ్చరిస్తోంది. ఈ కన్నెర్రకు కారణం ఉంది. 2030 నాటికి దేశ జనాభా రెట్టింపు అవుతుంది. అంటే నీటిసరఫరాను 700 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నుంచి 1400 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు పెంచితీరాలి. దాదాపుగా అసాధ్యమైన పనే ఇది. ఇక అంతమంది ఆకలి తీర్చాలంటే, ఎంత పంట పండించాలి? అందుకు ఎంత సాగునీరు కావాలి? ఇప్పటికే భూగర్భాన్ని ఎంతగా పిండేయాలో అంతగా పిండేశాం. తవ్వితీసుకోడానికి అక్కడేమీ మిగలదు. ఆ జలసంక్షోభం నుంచి ఎలా బయటపడాలి?
...తలుచుకుంటేనే వణుకుపుడుతుంది.
 • కాలకూట జలం
గుక్కెడు కలుషిత జలం చాలు, అంటువ్యాధులూ అనారోగ్యాలూ ముసురుకోడానికి. రకరకాల కాలుష్యాల వల్ల నీటి స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆ ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి.
 • * సురక్షితం కాని నీరు ప్రతి ఇరవై సెకెన్లకూ ఒక పసివాడిని పొట్టనపెట్టుకుంటోంది. అంటే, ఆ కాలకూట జలం తాగి...నిమిషానికి మూడు, గంటకు నూట ఎనభై పసిమొగ్గలు రాలిపోతున్నాయి.
 • * ప్రపంచంలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరికి...సురక్షితమైన మంచినీరు అందడం లేదు. ఏటా దాదాపు నలభైలక్షలమంది కలుషిత జలాల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై, ప్రాణాలు కోల్పోతున్నారు.
 • * కాలకృత్యాలు తీర్చుకోడానికీ వ్యక్తిగత పరిశుభ్రతకూ తగినంత నీరు దొరకని పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. యుద్ధ మరణాల కంటే కూడా, అలా చనిపోతున్నవారే ఎక్కువని ఓ అంచనా.
 • * ఒక్క అతిసార వల్లే ఏటా పదిలక్షలమంది మరణిస్తున్నారు.
 • * సురక్షితమైన మంచినీరు అందించగలిగితే...నూటికి తొంభై వ్యాధులను నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక.
 • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రతిపౌరుడికీ జీవించే హక్కునిచ్చింది. ప్రజలందరికీ సురక్షితమైన నీటిని అందించలేకపోవడం అంటే, ఆ హక్కుకు భంగం కలిగించడమే. ఈ కేసులో తొలి ముద్దాయి ప్రభుత్వమే. ఓ అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన తాగునీరు అందిస్తున్న దేశాలూ...అరక్షితమైన నీటితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దేశాలూ ఇవే...
జల సాధికారత
 • నీటిని 'గంగమ్మ' అని పిలుస్తాం. మాతృత్వపు హోదానిచ్చి స్త్రీత్వాన్ని ప్రసాదించాం. పురుషుడితో పోలిస్తే...మహిళకు నీటితో అవసరమూ అనుబంధమూ ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిల్లిపాది నీటి అవసరాలనూ ఇల్లాలే తీరుస్తుంది. బావుల నుంచీ చెరువుల నుంచీ బిందెల్లో మోయాల్సిన బాధ్యత కూడా ఆమెదే. వంటావార్పులకూ అంట్లు తోముకోడానికీ గంగాళాల నిండా నీళ్లు కావాలి. లేదంటే పనులు సాగవు. అందుకే ఆ తల్లి, బిందె నెత్తిన పెట్టుకుని మైళ్లకు మైళ్లు నడుస్తుంది. మండుటెండలనూ ముళ్లదార్లనూ మౌనంగా భరిస్తుంది. ఏ రికార్డులకూ ఎక్కని శ్రమదోపిడీ ఇది. 'ఆ లక్షల లక్షల పనిగంటలతో మహాసామ్రాజ్యాల్ని నిర్మించవచ్చు' అంటుంది వాటర్‌.ఆర్గ్‌ అనే స్వచ్ఛంద సంస్థ. ఇప్పటికీ అనేక గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యం లేదు. బిక్కుబిక్కుమంటూ మహిళాజనం వూరవతలికి వెళ్లాలి. ఇదామె ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య. మరుగుదొడ్ల నిర్మాణం నీటి సౌకర్యంతో ముడిపడి ఉంది. రాజస్థాన్‌లోని కొన్ని గ్రామాల్లో అయితే, నీటికొరత విడాకులకూ కారణం అవుతోంది. కనీస అవసరాలకు కూడా నీరులేని కొంపలో మేం కాపురం చేయలేమంటూ ఆడపడుచులు పుట్టింటికి ప్రయాణం అవుతున్నారు. ఆ వూరి కుర్రాళ్లకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మన పాలకులకు మాత్రం, ఇదేమీ పట్టడంలేదు. నీటి సరఫరాను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేసి, చల్లగా జారుకోవాలని చూస్తున్నారు.
 • 'మహా' దాహం!
ఉపాధి కోసం పల్లెలన్నీ పట్టణాలకు వలస వెళ్తున్నాయి. దీంతో మహానగరాల మీద ఒత్తిడి ఎక్కువవుతోంది. ఉన్న కొద్దిపాటి నీటివనరులు కోట్లాదిమంది దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. నగరపాలక సంస్థలు చేతులెత్తేయాల్సిన పరిస్థితి. ఏటికేడాది అవసరాలకూ సరఫరాకూ మధ్య అగాథం పెరుగుతోంది. 2050 నాటికి సగం భారతదేశం నగరాల్లోనే ఉంటుందని అంచనా. ప్రస్తుత జనాభాకే నీరందించలేని దుస్థితిలో ఉన్నాం మనం. సమర్థత + పొదుపు + టెక్నాలజీ = పరిష్కారం
 • ఉన్న వనరుల్ని చక్కగా వాడుకోవాలి. ఆ వాడుకోవడమూ చాలా పొదుపుగా జరగాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఈ త్రిముఖ వ్యూహంతోనే జలసంక్షోభాన్ని నివారించగలం.
 • * మన డ్యాముల నీటినిల్వ సామర్థ్యం చాలా తక్కువ. ఒక్కొక్కరికి 200 క్యూబిక్‌ మీటర్ల చొప్పున మాత్రమే నిల్వచేయగలవు. చైనా లాంటి దేశాల్లో ఆ సామర్థ్యం, మన కంటే ఐదురెట్లు ఎక్కువ.
 • * ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాం. అపార్ట్‌మెంట్లూ ఇళ్ల 'ప్లాన్‌'లకే అవి పరిమితం అవుతున్నాయి. జానెడు జాగా కూడా ఖాళీగా వదలకూడదన్న కక్కుర్తి. భూగర్భం 'రీఛార్జ్‌' కావడానికి ఇంకుడు గుంతలు చాలా ఉపయోగపడతాయి.
 • * నదుల అనుసంధానంపై సాక్షాత్తు సుప్రీంకోర్టు చివాట్లుపెట్టినా, తోలుమందం పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. వేల టీఎంసీల నదీజలాలు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయి. వాటిని నిలబెట్టుకుంటే... ఇంత కరవు ఉండదు.
 • * సరఫరాలో వృథాను అరికట్టడంలో మనం ఘోరంగా విఫలం అవుతున్నాం. ఢిల్లీలో 35 శాతం, ముంబయిలో 30 శాతం నీరు వృథాగా పోతోంది. హైదరాబాద్‌లో నలభై శాతానికిపైగా రక్షిత మంచినీరు నాలాల పాలవుతోందని అంచనా. మీటర్ల విధానం ద్వారా ... కచ్చితమైన నీటిలెక్కలు తీయడం సాధ్యమవుతుంది. సిబ్బందినీ, ప్రజలనూ జవాబుదారులను చేయవచ్చు.
 • * వ్యవసాయ రంగంలో నీటి వృథాను అరికట్టగలిగితే సగం సమస్య పరిష్కారం అయినట్టే. ఎందుకంటే, మన జలవనరుల్లో 80 శాతం సేద్యానికే కేటాయిస్తున్నాం. బిందు సేద్యం ద్వారా, తుంపర్ల సేద్యం ద్వారా ఆ లోపాన్ని అధిగమించవచ్చు. తక్కువ నీటితో పండించగల రకాల్ని అభివృద్ధి చేసుకుంటే మరింత ప్రయోజనం.
 • * నీటివనరుల్లో ఆరుశాతం పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటున్నాం. కాస్త శ్రద్ధపెడితే, అక్కడా వృథాను అరికట్టవచ్చు. పొదుపుగా వాడుకున్న సంస్థలకు పన్ను రాయితీలూ, వృథాకు పాల్పడిన సంస్థలకు జరిమానాలూ ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. పారిశ్రామికవాడలన్నీ మహానగరాల చుట్టూ ఉన్నాయి కాబట్టి, శుద్ధిచేసిన జలాల్ని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.
 • * ఆ వందగజాల భూమి మనదైనంత మాత్రాన, అట్టడుగు పొరల్లోని జలధార మీద కూడా మనకు హక్కులొచ్చేస్తాయా? నీరు అందరి ఆస్తి. బోరుబావుల్ని యథేచ్చగా తవ్వేయకుండా, నీటిని విచక్షణలేకుండా తోడేసుకోకుండా నిబంధనలు కఠినం చేయాలి.
 • * బాట్లింగ్‌ యూనిట్లలో పారిశ్రామిక సంస్థల్లో సీసాల్నీ పాత్రల్నీ శుభ్రం చేయడానికి నీళ్లే అక్కర్లేదు..గాలి ప్రవాహం (ఎయిర్‌ ప్రెషర్‌)తోనూ ఆ పని చేయవచ్చు. ఇదేమంత ఖరీదైన టెక్నాలజీ కూడా కాదు.
సింగపూర్‌ పాఠం
 • సింగపూర్‌ పాఠం...చిన్నదేశమే అయినా, సింగపూర్‌ జలవిజయం మనకో పాఠం. చక్కని ప్రణాళికతో ప్రజాభాగస్వామ్యంతో నీటికరవును అధిగమించింది. సింగపూర్‌ ప్రభుత్వం చుక్క నీటిని కూడా వృథాగా పోనివ్వడం లేదు... మురుగునీరు, మురికినీరు దేన్నయినా సరే స్వచ్ఛమైన మంచినీటిగా మార్చే టెక్నాలజీని రూపొందించుకుంది. నిజానికి ఆ దేశానికున్న జలవనరులు చాలా పరిమితం. అయితేనేం, రాబోయే యాభై ఏళ్లలో కూడా నీటిసమస్య రాకుండా జాగ్రత్తపడుతోంది.
 • * భూగర్భజలాల సద్వినియోగం ... ఉన్న కొద్దిపాటి వనరుల్నీ చాలా జాగ్రత్తగా వాడుకుంటోంది.
* శుద్ధిచేసిన జలాల వాడకం...నీటిశుద్ధికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది.
 • * సముద్రజలాల్ని మంచినీరుగా మార్చుకోవడం... దీని ద్వారా పదిశాతం అవసరాలు తీర్చగలుగుతోంది.
ఆ దేశ విస్తీర్ణం 710 చదరపు కిలోమీటర్లే అయినా..ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా, మొత్తం భూగర్భంలో ఇంకిపోయేట్లు జాగ్రత్తపడుతోంది. వర్షపునీటిని ఒడిసిపట్టడంలో నగర ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. నిర్మాణాలు కూడా అందుకు అనువుగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రేపటి తరానికి నీటి పొదుపు విలువ తెలిసేలా...పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకొచ్చింది.
 • నేర్చుకునే మనసుండాలే కానీ, మన దేశంలోనూ ఎన్నో ఉదాహరణలు. మహారాష్ట్రలోని హివ్రేబజార్‌ గ్రామప్రజలు వర్షపు నీటిని అమృతంలా ఒడిసిపట్టుకుంటున్నారు. చెక్‌డ్యాముల ద్వారా ఎక్కడికక్కడ నిల్వచేస్తున్నారు. దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. సహజవనరుల సద్వినియోగంపై ఏర్పాటైన అశోక్‌ చావ్లా కమిటీ 'ఇలాంటి పల్లెలే జలవనరుల సంక్షోభానికి పరిష్కారం చూపుతాయి..' అని కొనియాడింది. అన్నాహజారే స్వగ్రామం రాలెగావ్‌సిద్ధి కూడా సమష్టికృషితో జలస్వావలంబన సాధించింది.
ప్రతి చుక్కా విలువైందే...
 • ఒక్కో బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. నీటి ఆదా అన్నది మన నుంచే మొదలు కావాలి..
 • * చిన్నచిన్న లీకేజీల వల్ల బోలెడంత నీరు వృథాగా పోతోంది. ఎక్కడ ఏ చిన్న సమస్య కనిపించినా, ప్లంబర్‌ను పిలిపించి మరమ్మతు చేయించాలి.
 • * బాత్‌టబ్‌లూ షవర్‌బాత్‌ల వాడకమే పెద్ద వృథా. చక్కగా ఓ బకెట్‌ నీటితో స్నానాదులు ముగించేస్తే సమస్యే ఉండదు.
 • * డిష్‌వాషర్లూ వాషింగ్‌మెషీన్లూ...పూర్తి కెపాసిటీలో మాత్రమే ఉపయోగించాలి. పని తక్కువైతే, నీటి వినియోగం ఎక్కువైనట్టే. యంత్రాల ద్వారా బట్టలు ఉతకడానికీ అంట్లు తోమడానికీ ఉపయోగించిన నీటిని టాయిలెట్‌ అవసరాలకు వాడుకోవచ్చు.
 • * పళ్లు తోముకునేప్పుడు, వాష్‌బేసిన్‌లోని కుళాయి పారుతూ ఉండాల్సిన పన్లేదు. మగ్గులో నీళ్లు నింపుకుని, శుభ్రంగా కట్టేయండి. గెడ్డం గీసుకుంటున్నప్పుడూ ఈ సూత్రమే వర్తిస్తుంది. దీనివల్ల ప్రతిసారీ పదకొండు లీటర్ల నీటిని ఆదా చేసినవాళ్లం అవుతాం.
 • * సింక్‌లోని నల్లాను విప్పేసి...పారుతున్న నీటిలో కూరగాయలు కడగడం కంటే, ఓ పాత్రలో నీళ్లు నింపుకుని శుభ్రం చేసుకోవడమే ఉత్తమం. దీనివల్ల పద్నాలుగు లీటర్ల నీరు ఆదా అవుతుంది.
 • * ఎన్ని నీళ్లు ఖర్చుచేశామన్నది కాదు, ఎంత శుభ్రంగా స్నానం చేశామన్నది ముఖ్యం. ఎప్పటి కంటే ఓ నిమిషం ముందు స్నానం ముగించినా తొమ్మిది లీటర్ల నీటిని పొదుపు చేసినట్టే.
 • * ఆర్థిక పాఠాలు నేర్పించినట్టే, ఆరోగ్యసూత్రాలు బోధించినట్టే, పిల్లలకు నీటిపొదుపు గురించీ చెప్పాలి. వాటిని పాటించేలా చూడాలి. నీటిని జాగ్రత్తగా వాడుకునేవారు, తమకున్న సమయాన్నీ నైపుణ్యాన్నీ కూడా సమర్థంగా వినియోగించుకోగలరు.
 • * ఇల్లు కడగడం కంటే, తడిగుడ్డతో తుడవడమే మంచిది. శ్రమ తగ్గుతుంది. నీరు ఆదా అవుతుంది.
 • * అపార్ట్‌మెంట్‌ స్థాయిలోనే నీటిశుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. అతిగా షాంపూలూ సబ్బులూ డిటర్జెంట్లూ వాడకపోతే..నీటిని శుద్ధిచేయడం తేలికే.
 • * తెల్లవారుజామున లేదా సాయంత్రం మొక్కలకు నీళ్లుపోయడం మంచిది. ఆ సమయంలో అవి తక్కువ నీటిని తీసుకుంటాయి.
 • వ్యక్తిగా పొదుపుచేద్దాం. కుటుంబాన్ని ప్రోత్సహిద్దాం. పొరుగువారికి చాటిచెబుదాం. ప్రభుత్వాన్ని నిద్రలేపుదాం.
'అంతపెద్ద సమస్యను మనం పరిష్కరించగలమా?' అన్న నిరాశవద్దు.'మానవ ప్రయత్నం' అన్న మాట ఉండనే ఉంది.
 • గంగను దించిన భగీరథుడు మనవాడే, మానవుడే!
 • మన కోసమే, మనందరి కోసమే రెండు హైడ్రోజన్‌ అణువులూ, ఒక ఆక్సీజన్‌ అణువూ ఒక్కటై చల్లని నీటి చుక్కగా మారాయి.
 • అందుకు కృతజ్ఞతగా...మనమంతా ఒక్కటవుదాం.నీటిని రక్షించుకుందాం!
Source : General items Collected from Telugu News papers
 • =============================
-- Dr.Seshagirirao MBBS

No comments:

Post a Comment