Monday, September 28, 2009

బాదం పప్పు , Almond Nuts


  •  



  •  

కాలం కదిలే కడలితరంగము . కాలము ఒక నిరంతర ప్రవాహము ... నిరంతర ప్రస్తానము . పరుగులు తీసే కాలం తో మారే ఋతువులు మనోహరము . కాలానికి అనుగుణం గా ప్రక్రుతి లో అనేక రకాల పండ్లు , కాయలు , ఆకుకూరలు , దుంపలు తినేందుకు లబిస్తూ ఉంటాయి . ఆయా సీజన్లలో దొరికే వాటిని తప్పకుండా తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది . .. అదే ప్రక్రుతి వైద్యము . పండ్లు , కాయలు , ఆకుకూరలు , దుంపలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో సహా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .  
  • బాదం (Almond) : ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది . బాదం పప్పు నే తినేందుకు వాడుతారు . కాయలు , పళ్ళు పనికిరావు .
  • పచ్చి గింజలు తినవచ్చును , రోస్ట్ చేసికొని తింటే చాలా బాగుంటాయి . బాదం సిరప్ , నీనే ను వాడురు .
  • బలము వస్తుంది .
  • గుండె ఆరోగ్యం పదిలం గా ఉంటుంది ,
  • వీటి లో ఉండే 'ఫైటో కెమికల్స్' - కాన్సర్ ను నిరోధించును .
  • దీని లోని పీచు పదార్ధము మలబద్దకం ను నివారించును .
  • ఇందులో లబించే విటమిన్ "ఇ" యాంటి ఆక్షిడేంట్ గా పనిచేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు .
  • పిందిపదర్దము చాలాతక్కువ ... మధుమేహ రోగులకు మంచిది .

బాదం.. పోషకాహారం. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మసంరక్షణకు దోహదం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ నాలుగు తీసుకున్నా ఎంతో మేలు జరుగుతుంది .

 పోషకాలు :
  •  బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది.  
  • గుండెకు : పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌.  
  • కొలెస్ట్రాల్‌ నియంత్రణ : వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు బాదంపప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది.  
  • రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. 
  • ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. 
  •  బరువుతగ్గడానికి : బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు. 
  •  తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, రాగి, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకని దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు. 
  • మధుమేహానికి : మధుమేహంతో బాధపడేవారు భోజనం తరవాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.  
  • మెదడుకు మేత : నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది.  
  • బద్ధకం దూరం : వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. 

గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు

బాదంపప్పు చూడటానికి చిన్నదే... కానీ చేసే మేలు మాత్రము  ఒక విశాలమయిన జీవితమంత... గుండెపోటు రాకుండా చేసే చక్కటి గుణాలు ఈ బాదంపప్పులో ఉన్నాయట.


-బాదంపప్పులో మనలో ఆయుష్యూను పెంచే ఎన్నో గుణాలున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెకు సంబంధించిన వ్యాధుల్ని నివారించే శక్తి గుండెలో మంటను, కడుపులో కలవరాన్ని ఈ బాదంపప్పులు తగ్గిస్తాయి. మన కడుపులో కారం తినడం వల్ల వచ్చే మంటను బాగా తగ్గించే విశిష్టగుణం ఈ బాదంపప్పులో ఉంది. ఈ విషయాన్ని టొరొంటో విశ్వవిద్యాలయం ఇటీవల సాగించిన నూతన అధ్యయనం తేల్చిచెప్పింది. కడుపులో మంటను తగ్గించేందుకు మనం మందులు వాడతాం. కానీ ఆ మందులకు సమానంగా ఈ బాదం పప్పులు ఉపయోగపడతాయట. యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషియన్‌ ఈ అధ్యయన విశ్లేషణల్ని ప్రచురించింది.

బాదంపప్పు వల్ల ఉపయోగాలు
  •     గుండె సంబంధవ్యాధుల నివారణ.
  •     శరీరంలో కొలెస్టెరొల్‌ను సమస్థాయిలో ఉంచుతుంది.
  •     ప్రొటీన్‌లు అందిస్తుంది.
  •     న్యూట్రిషన్‌ గుణాలు అధికంగా ఉన్నాయి.
  •     బాదంపప్పులు తింటే వేరే పోషక పదార్థాలున్న మెడిసిన్‌ వాడనవసరం ఉండదు.
  •     బాదంపప్పులో ఆరోగ్యానికి సంబంధించిన హానికర అంశాలేమీలేవు.


    బాదం పప్పుల వినియోగం
  •     ఉపయోగాలకు సంబంధించి అమెరికాలోని కాలిఫోర్ని యాలో అధ్యయనం జరిగింది. మామూలు భోజనం అలాగే బాదంపప్పులతో కూడిన భోజనాన్ని ఎంపిక చేసిన కొంతమందికి వడ్డించారు. వీరు మామూలు భోజనం తిన్నారు. అలాగే బాదంపప్పుల భోజనం తిన్న తర్వాత మరింత శక్తివంతంగా తయారయ్యారని కాలి ఫోర్నియాలో జరిగిన అధ్యయనం తేటతెల్లంజేసింది. టొరొంటో విశ్వవిద్యాలయం వైద్యనిపుణులలో సిరిల్‌ కెన్‌డాల్‌ మాటల్లో ‘‘బాదంపప్పుల పై  మాఅధ్యయనంలో ఒక విషయం స్పష్టమైంది. అది గుండెలో, కడుపులో మంటల్ని తగ్గించి చల్లదనం ఇస్తుంది. అలాగే కెలొస్టెరొల్‌ శాతం తగ్గిస్తుంది’’.ఒక జీన్సు లేదా 164 గ్రాముల  బాదంపప్పులు లేదా గుప్పెడు బాదంపప్పులు ఎంతో విలువయినవి. ఆ మోతాదు బాదంపప్పులు తింటే మన శరీరంలో ‘ఇ’ విటమిన్‌కు తిరుగుండదు. అలాగే బాదంపప్పులు వల్ల శరీరానికి మాగ్నిషియమ్‌, పొటాషియమ్‌, కాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ లభిస్తాయి.

  • గుండెకు బాదం అండ
ఇతర గింజపప్పుల (నట్స్‌) మాదిరిగానే బాదంపప్పులోనూ కొవ్వు అధికంగానే ఉంటుంది. కాకపోతే ఇందులో గుండెకు మేలు చేసే కొవ్వులు (మోనోఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌) దండిగా ఉంటాయి. అందువల్ల క్రమం తప్పకుండా బాదంపప్పు తినటం గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయులు పెరగటానికీ బాదం దోహదం చేస్తుంది. అందువల్ల నిద్ర బాగా పట్టటానికీ తోడ్పడుతుంది. బాదంపప్పులో ఇన్‌ఫెక్షన్లను నివారించే, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే విటమిన్‌ ఇ మోతాదులూ ఎక్కువే. ఇక బాదంలోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, చాలాసేపు ఆకలి వేయకుండా చూస్తుంది. ఇలా బరువు పెరగకుండానూ కాపాడుతుందన్నమాట. ముఖ్యంగా వీటిల్లోని పీచు మధుమేహులకు చాలా మేలు చేస్తుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. రక్తప్రసరణను సైతం మెరుగుపరుస్తుంది.
  • ================================ 

No comments:

Post a Comment