Sunday, November 22, 2009

బెర్రీస్ , Berries

కాలం కదిలే కడలితరంగము . కాలము ఒక నిరంతర ప్రవాహము ... నిరంతర ప్రస్తానము . పరుగులు తీసే కాలం తో మారే ఋతువులు మనోహరము . కాలానికి అనుగుణం గా ప్రక్రుతి లో అనేక రకాల పండ్లు , కాయలు , ఆకుకూరలు , దుంపలు తినేందుకు లబిస్తూ ఉంటాయి . ఆయా సీజన్లలో దొరికే వాటిని తప్పకుండా తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది . .. అదే ప్రక్రుతి వైద్యము . పండ్లు , కాయలు , ఆకుకూరలు , దుంపలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో సహా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం . బెర్రీస్ రొసేసీ కుటుంబానిది చెందిన అనేక రకాల పండ్ల జాతి రకాలు . వీటిలో కొన్ని మానవులు తినేందుకు ఉపయోగపడతాయి. కొన్ని విషపూరితమైనవిగా గుర్తించబడ్డాయి . Some types of berry fruits: బెర్రి పండ్లలో కొన్ని రకాలు :
  • బ్లాక్ బెర్రీ (balck berry),
  • రాస్బెర్రీ (రెడ్ కలర్ -Rasp berry),
  • క్లౌడ్ బెర్రి (Cloudberry),
  • హకిల్ బెర్రీ (Huckliberry),
  • వైన్‌ బెర్రీ (Wineberry),
  • బిల్ బెర్రీ (Bilberry or Whortleberry),
  • బ్లూ బెర్రీ(Blueberry),
  • నానీ బెర్రీ (Nannyberry),
  • బార్ బెర్రీ (Barberry),
  • గూస్ బెర్రీ (Gooseberry),
  • మల్ బెర్రీ (mulberry),
మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీర తత్త్వం ఉంటుంది. అందుకే మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. తినే ఆహారానికి సరిపడా వ్యాయామం ఉంటే ఎటువంటి రోగాలు దరికి రాకుండా ఉంటాయి. ఆరోగ్యం ఉంటేనే మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఏకకాలంలో అనేక పనులను చేయగల సామర్ధ్యం కలిగింది. ఆధునిక కాలంలో మానవుడు సృష్టించిన కంప్యూటర్ కన్నా మన మెదడు ఎన్నో రెట్లు సామార్తవంత మైనది. దాని పని తీరు కేవలం మనం తినే ఆహారంలోని పోషకాల పై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం తినే ఆహారంలో మెదడుకు కావాల్సిన పోషకాలు ఉండేలా ఆహారాన్ని తినాలి. మెదడుకు కావలసిన పోషకాలు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు బెర్రీస్ అనే ఈ పండ్లుం ముఖ్యమైనవి . బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. కాంతులీనే చర్మంతో మెరిసిపోతారు. బెర్రీస్ అన్నీ, cherry blueberry strawberry, అన్నిటిలోనూ cell damage ని తగ్గించే anti-inflammatory పదార్ధాలు ఉన్నాయి. Raspberries లో ellaginic acid, selinium ఉండటం మూలంగా oral and liver cancer cells పెరగటానికి అవరోధం కలిపిస్తుందని కనుగొన్నారు. బెర్రీస్‌ విదేశాలనుండి దిగుమతి అయ్యే బెర్రీస్‌ మహా రుచిగా వుంటాయి. కాడతో సహా ఉన్న స్ట్రాబెర్రీలను పంచదార కలిపి కానీ, కలపకుండా కానీ దాదాపు సంవత్సరంపాటు నిలవ వుంచుకోవచ్చు. వీటిల్లో వుండే ఫైటోకెమికల్స్‌ వల్ల శక్తి పెరుగుతుంది.బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. మార్కెట్‌లో కనిపించే ఎర్రెర్రటి బెర్రీలను కడుపార ఆరగిస్తే... అందులోని యాంటీ ఆక్సిడెంట్‌ శరీరంలో చేరి ఆరోగ్యాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. పైగా బెర్రీలె క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు జరిగి, మీలో యవ్వనత్వాన్ని పెంచి, వయసు తక్కువ ఉండేలా చూస్తుందని, అందంగా ఉండాలని కోరుకునేవారు బెర్రీస్‌ని తింటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. --- బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. బ్లూ బెర్రీస్‌, వయోజనులలో జ్ఞపకశక్తి పెరగడానికి దోహదం చేస్తాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ''బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ 'ఆక్సిడేటివ్‌ ఫైటో కెమికల్స్‌', ఇలా జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం'' అని, జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ'లో ప్రచురితమైన ఒక వ్యాసంలో, శాస్త్రజ్ఞులు వివరించారు.గతంలో, బ్లూ బెర్రీస్‌ మేసిన జంతువుల మీద జరిపిన పరిశోధనల ఆధారంగా, వయోజనులలో జ్ఞాపకశక్తి పెరగడానికి బ్లూ బెర్రీస్‌ తోడ్పడతాయని, ఇటీవల జరిపిన అధ్యయన కర్త, రాబర్ట్‌క్రికోరియన్‌ తెలియజేస్తున్నారు. ఆయన తమ సహాధ్యాయులతో సహా, ఎన్నో సంస్థల అండదండలతో, యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటీలో ఈ పరిశోధన నిర్వహించారు. 70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల మీద బ్లూబెర్రీస్‌ జ్యూస్‌ ప్రభావం గురించి, క్రికోరియన్‌, ఆయన బృందం, అసంఖ్యాకమైన పరీక్షలు జరిపారు. అధ్యయన కాలంలో, ఈ స్టడీగ్రూప్‌లోని వృద్ధులు, 2 నుంచి 2 1/2 కప్పుల బ్లూ బెర్రీ రసం సేవించారు. 'కంట్రోల్‌ గ్రూప్‌'గా రూపొందిన మరో బృందం, రెండు నెలల పాటు, రోజూ, మరొక 'పానీయం' సేవించారు. ''కానీ, 'బ్లూ బెర్రీ జ్యూస్‌' తీసుకున్న వయోన్న వృద్ధులలో, జ్ఞాపకశక్తి బాగా పెరిగింది. ఈ ప్రయోగాల ఫలితాలు ఎంతో, ఆశా జనకంగా వుండడంతో, 'న్యూరో డిజెనరేషన్‌' నిరోధించడానికి, బ్లూ బెర్రీస్‌ ఎంతగానో ఉపకరిస్తాయనే నిర్ణయానికి వచ్చాం'' అన్నారు. రాబర్ట్‌ క్రికోరియన్‌. బ్లూ బెర్రీస్ - వీటిలో బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు , అంథోసియానిన్ అనే ఫ్లావనాయిడ్లు, ఎలాజిక్ అనే పోలీఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం,పొటాషియం మరియు పీచు పదార్థము ఉన్నాయి .ఇతర బెర్రీస్ కూడా మంచివే . స్ట్రాబెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడు, నరాల రుగ్మతలు వచ్చే అవకాశాలను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. రక్తంలోని హానికర విష పదార్థాలను తొలగిస్తాయి స్ట్రాబెర్రీలు. ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల కాలేయ రోగాలు, కంటిచూపు మందగింపు, వాతరోగం, కీళ్లవాతం, మలబద్దకం, అధిక రక్తపోటు, మెదడు పనితీరు క్షీణించడం, చర్మ క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలను దూరంగా ఉంచవచ్చు. స్పష్టమయిన ఆరోగ్య ప్రయోజనాల సంగతి అలా ఉంచితే, రోజూ 8 నుంచి 10 స్ట్రాబెర్రీలను తినడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్‌లో గుండెపోటు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుందని ఇటీవల అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అతిసార, వాతరోగం, జీర్ణక్రియ సమస్యలు స్ట్రాబెర్రీ ఆకులు, వేరులు తినడం వలన నయమవుతాయి. స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున అల్జీమర్స్ (జ్ఞాపక శక్తి తగ్గడం) మెదడు పనితీరు క్షీణించడం వంటి వ్యాధులు వస్తే తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. గుండెకు, మెదడుకు ఎంతో శక్తినిచ్చేవి క్రాన్‌ బెర్రీస్‌, బిల్‌బెర్రీస్‌, బ్లూబెర్రీస్‌. యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్‌ 'సి, 'ఇ పుష్కలంగా వుంటాయి బ్లూబెర్రీస్‌లో. వీటివల్ల మెదడు చురుగ్గా పని చేయడమే కాదు వార్థక్యంలో వచ్చే ఎన్నో వ్యాధులు కూడా నయం ఫ్లవనాయిడ్స్ గుండెకు బలము నిస్తాయి . కాన్సర్ ను నివారిస్తాయి ,


  • =========================================
Visit my website -- Dr.Seshagirirao MBBS

No comments:

Post a Comment