Wednesday, December 23, 2009

కరక్కాయ , Karakkaaya(Terminalia Chebula)


దీని శాస్త్రీయ నామము " terminalia chebula. సంస్కృతం లో "హరిటకి" అంటారు . కరక్కాయ వాత తత్వము పై పనిచేస్తుంది . బుద్ధిని వికషింప జేస్తుంది . బలం కలిగిస్తుంది , ఆయుహ్ కాలం పెంచుతుంది . ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది .
  • కరక్కాయ విరేచానకారి , లుబ్రికేంట్ , మలబద్దకాన్ని నివారిస్తుంది .
  • ఫైల్స్ కి మంచి మందు ,
  • ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేతిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది .
  • పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాతులు తగ్గిస్తుంది ,
  • జీర్ణ క్రియకు తోడ్పడుతుంది ,
  • ఆదుర్దా , నాడీమండల నిస్త్రాణ ను నియంత్రిన్స్తుంది ,
  • కంటికి మంచి మందు ,
  • కంట స్వరము చక్కబెడుతుంది ,
  • కఫా జ్వరాలు నయమవుతాయి ,
ఆయుర్వేదము లో ఉపయోగాలు /--డా. చిరుమామిళ్ల మురళీమనోహర్ *

  • కరక్కాయలు, శొంఠి, తుంగముస్తలు, వీటిని సమభాగాలుగా గ్రహించి, విడివిడిగా దంచి, పొడిచేసి వస్తగ్రాళితం చేయాలి. తరువాత అన్నీ కలిపి బెల్లం చేర్చుతూ బాగా నూరి చిన్న చిన్న మాత్రలుగా చుట్టి ఆరబెట్టి గాజుసీసాలో నిల్వచేసుకోవాలి. ఈ మాత్రను బుగ్గనుంచుకొని రసం మింగుతుంటే దగ్గులో ఉపశమనం లభిస్తుంది. * కరక్కాయ పెచ్చులను అడ్డసరం (వాసా) ఆకుల స్వరంలో ఏడుసార్లు నానబెట్టి భావన చేసి ఎండబెట్టి పొడిచేసి పూటకు అర టీ స్పూన్ మోతాదులో రెండు పూటలా నేరుగా గాని లేదా పిప్పళ్లు, తేనె మిశ్రమంతో గాని కలిపి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావం ఆగిపోతుంది. * కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకొని పూటకు అర టీస్పూన్ చొప్పున మూడుపూటలా తేనెతో గాని లేదా నీళ్ళతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది. * ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకోవాలి. * ఆయాసం, ఎక్కిళ్లు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయ పలుపును ఉడికించి తీసుకోవాలి. * ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసికట్టుగా హింసిస్తున్నప్పుడు వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడాలవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. * కరక్కాయల చూర్ణం, శొంఠి చూర్ణం, పుష్కరమూల చూర్ణం, యవక్షారం, మిరియాల చూర్ణం వీటిని సమాన భాగాలుగా తీసుకొని నీళ్లతోకలిపి జారుడుగా చేసి తీసుకుంటే ఎక్కిళ్లతోపాటు ఉబ్బసంనుంచి కూడా నివృత్తి లభిస్తుంది. * రక్తహీనతతో బాధపడేవారు కరక్కాలను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా అర కప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి. * కామెర్లతో బాధపడేవారు లోహభస్మం, కరక్కాయ చూర్ణం, పసుపు వీటిని సమాన భాగాలుగా కలిపి, పూటకు చెంచాడు చొప్పున, అనుపానంగా బెల్లాన్నీ తేనెనూ చేర్చి మూడుపూటలా తీసుకుంటూ ఉండాలి. * కరక్కాయ పెచ్చులను గోమూత్రంతో సహా నూరి లేదా కరక్కాయలను, తానికాయలను, ఉసిరికాయలను కలిపి గోమూత్రంలో ఉడికించి, నూరి టీ స్పూన్ చొప్పున తీసుకుంటే కామెర్లు, రక్తహీనతలు తగ్గుతాయి. * కామెర్లతో బాధపడేవారికి జాగ్రత్తగా వమన విరేచనాలను చేయించి కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు మోతాదుగా రెండుపూటలా హెచ్చు మొత్తాల్లో తేనెను కలిపి ఇవ్వాలి. * ఉదరంలో నీరు చేరినప్పుడు (ఎసైటిస్) కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు అర టీస్పూన్ చొప్పున గోమూత్రం అనుపానంగా మూడు పూటలా తీసుకోవాలి. తరువాత పాలు మాత్రమే తాగాలి. వారంపాటు బియ్యం, గోధుమ వంటి గింజ ధాన్యాన్ని పూర్తిగా మానేయాలి. (చరక సంహిత చికిత్సా స్థానం, అష్టాంగ సంగ్రహం చికిత్సా స్థానం) * తీవ్రమైన ఉదర వ్యాధులతో బాధపడేవారు వెయ్యి కరక్కాయలను ఔషధంగా తీసుకోవాలి. అలాగే విలాజిత్తును నిర్దేశిత మోతాదులో వాడుతూ కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. * కరక్కాయలు, రోహీతక, యవక్షారం, పిప్పళ్లు వీటితో కషాయం తయారుచేసుకొని అర కప్పు మోతాదుగా ప్రతిరోజూ ఉదయంపూట తీసుకుంటూ ఉంటే ప్లీహం పెరగటం, కాలేయవృద్ధి, అసాధ్య ఉదర వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. * కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతోపాటు జిగురు పడటం ఆగుతుంది. ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గుతుంది. * కఫదోషంవల్ల శరీరంలో వాపుతయారైనప్పుడు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, పొడిచేసి పూటకు 3గ్రాముల మోతాదుగా అర కప్పు వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి. * కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు లేదా ఇప్ప సారం (మధూకం), పిప్పళ్లు చూర్ణం మూడూ కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా రెండుపూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది. * కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం మూడు సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా, వేడినీళ్లతో రెండుపూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్లిపోయి వాపు తగ్గుతుంది. * కరక పిందెల చూర్ణాన్ని 3గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అర కప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గుతుంది. * నాలుగుచెంచాల శుద్ధిచేసిన గోమూత్రంలో టీ స్పూన్ కరక్కాయ పొడిని కలిపి తీసుకుంటే వాపు తగ్గుతుంది. (గోమూత్రంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రాన్ని జారీచేసి వాపును తగ్గిస్తుంది. (అష్టాంగ హృదయం) * కరక్కాయ చూర్ణం, శొంఠి పొడి వీటి మిశ్రమాన్ని మోతాదుకు అర చెంచాడు చొప్పున బెల్లంతో కలిపి రెండుపూటలా మజ్జిగ అనుపానంగా తీసుకుంటే శరీరంలో సంచితమైన అదనపు నీరు దిగుతుంది. ================================================= Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment