-
అయొడిన్ అన్నది మనషి శరీరానికి అవసరమైన ధాతువు. ఇది భూమిలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా అయొడిన్ శరీరానికి లభిస్తుంది. ప్రత్యేకంగా మందులు, టానిక్కులు తీసుకోవలసిన పనిలేదు. అయొడిన్ లోపం ఏర్పడితే అనేక రకాలయిన అనారోగ్యాలు కలుగుతాయి.గాయటర్ వ్యాధికి గురవుతారు. ఇందులో కొన్ని అనారోగ్యాలకు నివారణ కలగటం కూడా కష్టమే.
అందువల్ల, దేహంలో అయొడిన్ లోపం ఏర్పడకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఎదుగుదలకు అయొడిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయొడిన్ లోపాన్నినివారించటానికి అయొడైజ్డ్ సాల్టును ఉపయోగించి అరికట్టవచ్చు. అంతేకాకుండా, అయొడైజ్డ్ సాల్టును వాడటంవల్ల అయొడిన్ లోపం కూడా ఏర్పడదు.
అయొడైజ్డ్ సాల్ట్‌ను వాడటంవల్ల ఆహార పదార్ధాల రుచిలో ఎటువంటి తేడా కనిపించదు. అయొడిన్ అన్నది ప్రతివారికి అవసరమైన పదార్ధంగా గుర్తించబడింది. మానవ శరీర నిర్మాణానికీ, మెదడు పెరుగుదలకూ, చురుకుదనానికీ, శరీరారోగ్యానికీ అయొడిన్ తోడ్పడుతుంది. అయొడిన్ అన్నది ప్రకృతి సహజంగానే శరీరానికి అందుతుంది. అయితే, తరచుగా సంభవించే వరదలు, తుఫానులు, పెనుగాలులకు భూమి పొరలలోని అయొడిన్ కొట్టుకుపోయి, భూమిద్వారా లభించే పదార్థాల్లో అయొడిన్ లోపం ఏర్పడుతుంది.
మన దేశంలో అయొడిన్ లోపానికి గురయ్యేది పిల్లలూ, స్త్రీలేనని అంచనా వేయబడింది. ఒక మిల్లీ గ్రాము అయొడిన్‌ను శరీరానికి అందిస్తేచాలు. అయినప్పటికీ ఆ స్వల్ప అయొడిన్ కూడా శరీరానికి లభించక కొంతమంది అయొడిన్‌లోపం వల్ల ఏర్పడే అనారోగ్యాలకు గురవుతున్నారు. అయొడిన్ లోపం గర్భిణీ స్త్రీల్లో కలిగితే, ఆ ప్రభావం గర్భస్ధ శిశువు మీద కూడా ప్రసరిస్తుంది. శిశువుకు అయొడిన్ లోపం ఏర్పడితే, ఆ శిశువు మెదడు సరిగ్గా ఎదగదు. పాపాయికి మానసిక రుగ్మతలు ఏర్పడి, బుద్ధి వికసించదు. గర్భిణీకి అయొడిన్ లోపం కలిగితే మృతశిశువు జన్మించడం లేదా ప్రసవం జరిగిన కొన్ని గంటలలోనే శిశువు మరణించడం జరుగుతుంది. బుద్ధిమాంద్యం, తెలివితేటలు తక్కువగా ఉండే సంతానం కలగవచ్చు. అంగవైకల్యంతో శిశువు పుట్టవచ్చు. మూగ, చెవుడు లాంటి లోపాలు కూడా ఏర్పడవచ్చు పాపాయికి. అందువల్ల, గర్భవతి అయొడిన్ లోపం కలుగకుండా చూసుకోవాలి. శరీరంలో అయొడిన్ లోపం ఏర్పడితే నీరసం, నిస్సత్తువ, శారీరక బలహీనత ఏర్పడతాయి. చురుకుదనం లోపించి, బద్దకం, సోమరితనం కలుగుతుంది. శారీరక అనారోగ్యాలు, మానసిక రుగ్మతలు ఏర్పడుతాయి. గాయటర్ వ్యాధికి గురవుతారు. బుద్దిహీనత, మతిమరుపు కలుగుతాయి. ప్రతివారూ అయొడిన్ లోపం ఏర్పడకుండా, అయొడిన్ లోపం వల్ల ఏర్పడే అనారోగ్యాలు కలుగకుండా జాగ్రత్తపడటం అవసరం అన్నది తెలుసుకోవాలి.
ఆయోడిన్ లోపం వలన కలిగే లక్షణాలు :
- 1. గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు)
- 2. మానసిక రుగ్మత (బుద్ధిమాంద్యము)
- 3. బధిర (చెవిటి – మూగ)
- 4. మెల్లకన్ను
- 5. కరుచ కాళ్ళు, చేతులు, సరిగా నడవలేకపోవడం
- 6. అబార్షన్ మరియు గర్భస్థ శిశుమరణం
మన రాష్ట్రంలో అయోడిన్ లోపం గల జిల్లాలు :
1) అదిలాబాద్, 2) తూర్పు గోదావరి, 3) ఖమ్మం, 4) మహబూబ్ నగర్, 5) నెల్లూరు, 6) కృష్ణా,
7) శ్రీకాకుళం, 8) విశాఖపట్నం, 9) విజయనగరం, 10) వరంగల్
అయోడిన్ లోపం నివారణకు చేపట్టవలసిన చర్యలు :
అయోడిన్ చేర్చబడిన ఉప్పును మన ఇళ్ళల్లో తప్పనిసరిగా వాడేటట్లు చేయాలి. అయోడిన్ ఉప్పును గర్భిణీ స్త్రీలందరు కూడా నిరభ్యంతరంగా వాడవచ్చును. అయోడిన్ వలన ఎటువంటి దుష్పలితాలు కలగవు. మార్కెట్లో అయోడిన్ కలిగిన ఉప్పు విరివిగా లభిస్తోంది. గిరిజన ప్రాంతాలలో ITDA ద్వారా అయోడైజ్జ్ ఉప్పు చౌకధర వస్తు పంపిణీ డిపోల ద్వారా సరఫరా చేయబడుతుంది.
అయోడిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు :
- గుడ్లు ,
- జున్ను ,
- చేపలు , చేపనూనెలు ,
- పాలు ,
- సముద్రపు ఉప్పు ,
- సీ పుడ్స్ (Sea foods).
- ==============================
Visit my Website -
Dr.Seshagirirao
No comments:
Post a Comment