Wednesday, March 9, 2011

సోంపు ఔషధోపయోగాలు,Fennel seeds medicinal uses.

-మనలో చాలామందికి తెలిసిన సుగంధ ద్రవ్యం సోంప్‌. హొటళ్లలో అల్పాహారం, భోజనం, కాఫీ, టీ మొదలైనవి సేవించిన తరువాత మన దృష్టి మరలేది సోంప్‌ మీదకే. కొంతమంది ఇళ్లలోనూ భోజనానం తరం సోంప్‌ను ఉపయోగిస్తుంటారు. సోంప్‌ ఔషధ గుణాలు చాలామందికి తెలియవు. ఇవి పరిమాణంలో జీలకర్ర కంటే కొంచెం పెద్దగా ఉండటం వలన స్థూలజీరకమనే పేరుతోపాటు, గింజలు తీపిదనాన్ని కలిగి ఉన్నందున మధురిక అనే పేరు కూడా వీటికి ఉంది. సౌమ్యంగా, సమర్థవంతంగా పని చేసే సోంప్‌తో అనేక ఆరోగ్య సమస్యలను మనం సులభమార్గాల ద్వారా ఎదుర్కొనవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.


  • సోంప్‌ గింజల చూర్ణం ఒక భాగం, అతి మధురం చూర్ణం రెండు భాగాలు, పటికబెల్లం పొడి మూడు భాగాల వంతున కలిపి ఉంచుకుని ప్రతిరోజూ రెండు పూటలా ఒక స్పూన్‌ చొప్పున నీటితో దగ్గు, ఆయాసం, జలుబు తగ్గుతాయి. వేసవి కాలంలో ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ప్రయోజనకారి. ఈ ఔషధ సమ్మేళనం ధూమపానం చేసే వారిలో వచ్చే దగ్గుకు సత్వర ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా సోంప్‌ వాడటం వలన ఉబ్బస వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా నియంత్రణలో ఉంటుంది.
  • నేతితో వేయించిన సోంప్‌ను చూర్ణం చేసి, సమభాగం పంచదార కలిపి ఉంచుకుని రోజూ ఉదయం, సాయంత్రం ఒక స్పూను ప్రమాణంలో నీరు అనుపానంగా తీసుకుంటే అతి వేడి వలన కలిగే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా వెలువడుతుంది.
  • సిద్ధ వైద్య విధానంలో ప్రాచుర్యం పొందిన కణాత్‌తైలం అనే ఔషధ తయారీలో ఆముదం, కలబంద, అక్కలకర్ర, కుంకుమపువ్వు వంటి ఔషధాలతోపాటు సోంప్‌ను కూడా ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు. ఈ తైలాన్ని అతి వేడి వలన చర్మం ఎండిపోయినట్లు ఉండటం, వాంతులు, చిన్న పిల్లల ఊపిరితిత్తుల వ్యాధుల్లో అభ్యంతర సేవనకు ఉపయోగిస్తారు.
  • యునాని వైద్య విధానంలో కూడా జీర్ణాశయ రుగ్మతలకు వాడే ఔషధాలైన అర్క-యి- బడియాన్‌, ఇత్రి ఫల్‌-యి- ములాయిన్‌ తయారీలో సోంప్‌ను ఉపయోగిస్తారు. శొంఠి, సోంప్‌, సునాముఖి, సైంధవల వణం, చిన్న కరక్కాయల చూర్ణాలను సమాన భాగాలలో కలిపి అరస్పూను నుంచి స్పూను వరకూ రెండుపూటలా మంచినీటితో వాడుతుంటే సాఫీగా విరేచనమవుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, పులిత్రేన్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
  • పోతపాలు, డబ్బా పాలు తాగే పిల్లలకు సోంప్‌, ఎండించిన పుదీనా ఆకు చూర్ణాలను సమానభాగాలుగా తీసుకుని తేనెతో కలిపి రెండుపూటలా వాడితే అజీర్ణ సమస్యలు దరి చేరవు.
  • సోంప్‌ను ఎక్కువ ప్రమాణంలో సమ్మిళితం చేసి తయారు చేసే యునాని ఔషధం 'ఇత్రిఫల్‌-యి-రజియానాజ్‌ మాగ్‌ బాదం వల మెదడు వ్యాధులు, తలనొప్పి, ఇతర నరాల బలహీనతలలో వాడుతారు.
  • అంతేకాక, వివిధ రకాల చర్మవ్యాధులు, కీళ్ళ నొప్పులు, సెక్స్‌ బలహీనతలు, మొలల వ్యాధులతోపాటు, రక్తశుద్ధి కోసం సుగంధిపాల, ఫిరంగి చెక్క, సునాముఖి, చందనం, దాల్చిన చెక్క మొదలైన ద్రవ్యాలతోపాటు సోంప్‌ను కూడా వేసి తయారు చేసిన మజూన్‌-యి-ఉష్బ అనే యునాని ఔషధం కూడా చాలా సమర్థవంతమైనది. సోంప్‌, స్వచ్ఛమైన పసుపు చూర్ణాల్ని సమానంగా కలిపి రెండు గ్లాసుల నీటిలో రెండు స్పూన్ల చూర్ణం వేసి ఒక గ్లాసు నీరు మిగిలేలా మరి గించి చల్లార్చి వడ గట్టుకుని తాగు తుంటే కీటకాలు, జంతువులు కర వడం వలన శరీ రంలో ప్రవేశించిన విషం నిర్వీర్యం అవుతుంది.
  • సోంప్‌, నల్ల ఉప్పు చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని రెండు పూటలా అరచెంచా చొప్పున వాడితే కడుపు నొప్పి తగ్గుతుంది. సోంప్‌, గసగసాలు, ఏలకులను పదేసి గ్రాముల చొప్పున తీసుకుని నీటితో మెత్తగా నూరి దానిని 60 గ్రాముల ఆవునెయ్యిలో కలిపి చిన్న మంటతో నీరు ఇగిరే వరకూ కాచి, వడబోసి నిలువ ఉంచుకోవాలి. దీనిని రాత్రి వేళ మాడుకు సున్నితంగా మర్దన చేస్తుంటే వివిధ రకాల తలనొప్పులు తగ్గుతాయి.
  • ముఖ్యంగా అత్యుష్ణం వలన, మానసిక ఆందోళన, వత్తిడి, వ్యాకులత వల్ల కలిగే తలనొప్పులు తగ్గడమే కాకుండా, చక్కటి నిద్ర వస్తుంది.
  • సోంప్‌, ధనియాలు, ఏలకులు, సీమ బాదంపప్పు, పటికబెల్లం విడిగా చూర్ణం చేసి, సమానంగా కలిపి ఉంచుకుని, రోజూ రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్‌ పొడిని పాలతో కలిపి తీసుకుంటూ మతిమరుపు తగ్గి, జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. మెద డులో వేడి తగ్గుతుంది. శరీరం వేడిగా ఉండటం, కళ్ల మంటలు మొదలైనవి తగ్గుతాయి.
  • సోంప్‌ చూర్ణం, శొంఠిచూర్ణం, పంచదార, నెయ్యిలను సమానంగా గ్రహించి మొదట నెయ్యిలో పంచదార కలిపి వేడి చేసి తరువాత తక్కిన చూర్ణాలను కలిపి ఉంచుకుని, ఉదయం, సాయంత్రం ఉసిరి కాయ ప్రమాణంలో తింటూ ఉంటే మలంలో జిగురు పడటం, నీళ్ల, జిగురు, రక్త విరేచనాలు, మలం దుర్గంధయుక్తంగా ఉండటం తగ్గుతాయి.
అదుపులో రక్తపోటు
భోజనానంతరం సోంపు గింజలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అవి దుర్వాసనలను దూరం చేయడమే కాదు.. చాలాసేపటికి వరకూ నోటిని తాజాగా ఉంచుతాయి. ఆరోగ్యానికీ సోంపు గింజలు చాలా మంచివి. వీటి నుంచి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. భోజనం తరవాతే కాదు.. ముందూ తీసుకోవచ్చు. సోంపులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు పెంచే కార్బోహైడ్రేట్లను ఇవి దూరం చేస్తాయి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తాయి. వీటిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియల రేటు సక్రమంగా ఉండేలా చూస్తుంది. పీచు వల్ల గుండెకు కూడా మేలే. ఎలాగంటే... పీచు పదార్థాలతో రక్తంలో కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. సోంపును తరచూ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది. అలానే చెడు కొవ్వును సోంపులోని పోషకాలు గ్రహిస్తాయి. వీటిల్లోని కాపర్‌ ఎర్రరక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. జింక్‌ శారీరక ఎదుగుదలకూ, అవయవాలు దృఢంగా ఉండటానికీ తోడ్పడుతుంది. రక్తపోటుతో బాధపడే వారు సోంపు గింజల్ని రోజులో ఒకటి రెండుసార్లు నమిలితే మంచిది. అలా చేయడం వల్ల పొటాషియం శరీరానికి అంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తుంది. కప్పు సోంపులో ఇరవై శాతం పైనే విటమిన్‌ 'సి' ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచడానికీ, చర్మ కణజాలం దృఢపడి గాయాలైనప్పుడు త్వరగా మానిపోవడానికి దోహదం చేస్తుంది. సోంపు గింజల్లోని ఫ్లవనాయిడ్లు ఒత్తిడిని దూరం చేస్తాయి.

  • ================================== 
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment