Saturday, April 2, 2011

పామ్‌ ఆయిల్,Palm Oil

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... ప్రపంచంలో దాదాపు 80 శాతం ఆయిల్‌ ఫామ్‌ పంట మలేషియా, ఇండోనేషియా దేశాల్లో కేంద్రీకృతమైంది. భారతదేశంలోని ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో వుంది. అదేవిధంగా పామాయిల్‌ దిగుమతి చేసుకునే దేశాల్లో ముఖ్యమైన స్థానం కూడా భారతదేశానిదే. 5000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర వున్న వంటనూనె పామ్‌ఆయిల్‌. పామ్‌ ఆయిల్‌ నూనెను పామ్‌ చెట్ల పండ్ల నుండి తయారు చేస్తారు. పామ్‌ పళ్ళు పెద్ద గెలల రూపంలో వుంటాయి. పామ్‌ విత్తనం నుండి పావ్‌ ఆయిల్‌ తీస్తారు. దీని శాస్త్రీయ నామము " ఇలాయిస్ గినీన్‌సిస్ (Elaeis guineensis). అతి తక్కువ ధర కలిగి అధిక ప్రయోజనాలు ఇచ్చే పామాయిల్‌ వల్ల అనేక ఆరోగ్యపరమైన లాభాలు కూడా వున్నాయి. మరే పంట నూనెలోనూ లేనంత ఎక్కువగా కేరటనాయిడ్స్‌ పామ్‌ ఆయిల్‌లో లభ్యమవుతున్నాయి. అనేక దీర్ఘకాలిక రోగాలు, కేన్సర్‌ నిరోధకంగా కేరటానాయిడ్స్‌ పని చేస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. జనాభా అధిక శాతం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పామాయిల్‌లోని టోకో ట్రైనాల్స్‌(విటమిన్‌---ఇ)కి, క్యాన్సర్‌ ను తగ్గించడానికి లక్షణాలున్నాయని పరిశోధనల్లో తేలింది. రొమ్ము క్యాన్సర్‌ కణాల పెరుగుదల ఆపటంలో టోకో ట్రైనాల్స్‌ సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇది వెజిటబుల్ ఆయిల్ . దీనీ పామ్‌ కెర్నల్ ఆయిల్ అని అంటారు కాని అలా అంటే అది కొబ్బరి నూనె అవుతుంది . పామ్‌ ఆయిల్ లో చాలా తగ్గువగా " సాచ్యురేటేడ్ ఫ్యాట్స్ " ఉంటాయి. ప్రపంచం లో దీన్ని కుకింగ్ ఆయిల్ గా వ్యవహరిస్తారు . ఇది తక్కువ లేదా అసలు హైడ్రోజెనేషన్‌ లేకుండా ఉంటుంది . కాబట్టి పదార్ధాల మన్నిక ఎక్కువకాలము సాగుతుంది ... ఆహార తయారీ దారులు పామ్‌ ఆయిల్ ను ఎంచుకుటారు . Health benifits :
  • మీడియం చైన్‌ ట్రైగ్లిజరైడ్స్ దీనిలో ఉంటాయి కావున జీర్ణము చేసుకోవడం చాలా తేకిక . తల్లి పాలతో సమానము .
  • శాఖాహారము అయినందున కొలెస్టిరాల్ ఉండదు .
  • oleic acid(omega-9)39%, linolic acid(omega-6) 10% ఉంటాయి కావున ఆరోగ్యానికి మంచిది . ఈ ఎసెన్‌సియల్ ఫ్యాటీ యాసిడ్స్ రక్తం లోని కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి.
  • దీనిలో యాంటి ఆక్షిడెంట్స్ (Tocotrienols) ఉన్నందున వ్యాధుల బారిన పడకుండా కాపాడును .
  • పామ్‌ ఆయిల్ లో బీటాకెరోటీన్స్ పుష్క్లము గా లభించును .
Fatty acid content of palm oil
  • Type of fatty acid pct
  • Palmitic saturated C16------ 44.3%
  • Stearic saturated C18--------- 4.6%
  • Myristic saturated C14-------- 1.0%
  • Oleic monounsaturated C18- 38.7%
  • Linoleic polyunsaturated C18 10.5%
  • Other/Unknown------------- 0.9%
  • ===================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment