Saturday, May 28, 2011

కస్తూరి ,Musk

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... కస్తూరి, మగ కస్తూరి జింక యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళ పదార్ధము . ప్రాచీన కాలము నుండి దీనిని ప్రసిద్ధ సుగంధ పరిమళముగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి ఒకటి. కస్తూరికి ఆంగ్ల నామమైన మస్క్ సంస్కృత పదమైన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది ప్రస్తుతం ఇతర సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాలనుండి ఉత్పనమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే ఒకే గాటిన కట్టడం పరిపాటైనది . 19వ శతాబ్దము చివరివరకు కస్తూరి కేవలం సహజ వనరులనుండే లభ్యమయ్యేది. అయితే ప్రస్తుతం చాలామటుకు కృత్తిమంగా తయారుచేసిన పదార్ధాలనే వాడుతున్నారు. కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్. జలుబుకి, దగ్గుకి ఆయర్వేదంలో చాలా రకాల చిట్కాలు, మందులు ఉన్నాయి. అందులో భాగంగా కస్తూరి మాత్రలని పూర్వకాలం నుంచీ అనేక వ్యాధులకు ఆయుర్వేద నిపుణులు ఔషధంగా సూచిస్తున్నారు. కస్తూరి మృగం నాభి నుంచి వెలువడే ఘాటైన ద్రవ్యం ఉపయోగించి వీటిని తయారు చేస్తారు కాబట్టే కస్తూరి మాత్రలు అని పిలుస్తారు. ఇవి నాలుగు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో వేటిని వాడినా మీ సమస్యకు గుణం కనిపిస్తుంది. ఈ మాత్రల్లోని ముఖ్య ద్రవ్యాలు కస్తూరి, మిరియాలు, గోరోచనం, రస సింధూరం, పిప్పళ్లు, అక్కలకర్ర, ఇంగలీకం ముఖ్యమైనవి. తమలపాకు రసంలో నూరి, తేనెతో కలిపి ఇస్తే చక్కని ఫలితం ఉంటుంది. అజీర్ణ సమస్యలు ఎదురైనప్పుడు, వాత వ్యాధులకి, కఫం పెరిగినప్పుడు, అతిసారానికి, అధికంగా చెమటలు కారడం వంటి సమస్యలకి ఇది పెట్టింది పేరు. ఒకటి రెండు మాత్రల చొప్పున బాలింతలకి తొలిమూడు మాసాల వరకు ఇవ్వవచ్చు. దీని వల్ల వారికి ఒళ్లునొప్పులు, వాతం తగ్గుతాయి. జ్వర భారం తగ్గాలంటే ఒకటి రెండు మాత్రలు చొప్పున ఇవ్వవచ్చు. చంటి పిల్లలకు కలిగే దగ్గు, అజీర్ణ విరేచనాలు, జ్వరం, జలుబు, వాంతులు మొదలగు వాటికి ఒకటి రెండు మాత్రలు చొప్పున అవి తగ్గేవరకు ఇవ్వవచ్చు. ఆరునెల్ల నుంచి ఎవరైనా, ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. ఉదయాన్నే తేనెతో పాటు లేదా అల్లరసంతో ఇస్తే మేలు. -- డా. ధన్వంత్రి ఈస్వరసత్యనారాయణ - శ్రీకాకుళం
  • =========================================
Visit my Website - Dr.Seshagirirao

1 comment:

  1. తెలుగులో అందించడం చాలా బాగుంది.ధన్యవాదములు.

    ReplyDelete