Thursday, June 2, 2011

వరి ఆరోగ్యలాభాలు , Paddy health benifits

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....

 • వరి (Paddy/rice)---భారతదేశం లో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి. వరి గింజలనుండి బియ్యం వేరుచేస్తారు. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం.ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే. భారతదేశంలో పంటలకు ''ఒరైజా సటైవా ఇండికా'' రకపు వరి మొక్కలనే ఉపయోగిస్తారు. ఆకుమడి తయారుచేసి వరి విత్తనాలు జల్లుతారు. నారు అయిన తరువాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. వరి మొక్క ఏకవార్షికం. వరి నుండి వచ్చే బియ్యంతో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు. ఎండుగడ్డి, ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. ధాన్యంపై పొట్టు తీయకుండా వాటిని వేడినీటిలో ఉడికించిన తరువాత వాటికి ఆవిరి పట్టిస్తే ఉప్పుడు బియ్యంగా తయారవుతాయి. ఇడ్లీ, దోశ మొదలైన వంటలు వీటితో తయారు చేస్తారు. బియ్యపు పిండిని, బట్టల ఇస్త్రీలకు, కాలికో ముద్రణలోనూ ఉపయోగిస్తారు. కాల్చిన ఊకను ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. తవుడు నుండి తీసిన నూనె వంటలలో ఉపయోగపడుతుంది.

హంస, ఫల్గున, జయ, మసూరి, రవి, బాసుమతి మొదలైనవి స్థానికంగా పండించే కొన్ని వరి రకాలు. ప్రపంచంలో సగానికి పైగా జనాభాకి ముఖ్య ఆహారం వరి ఇది ప్రపంచంలో రెండవ పెద్ద ధాన్యపు పంట. సుమారు 154 మి.హె.లో ప్రపంచవ్యాప్తంగా పండించబడుతోంది. సంవత్సరానికి సరాసరి 620 మి.ట ఉత్పత్తి జరుగుతోంది. అన్నంలో పిండిపదార్థాలు అధికం కాబట్టి ఎక్కువగా తింటే లావయిపోతామని చాలా మంది అనుకుంటారు. కానీ బరువు పెరిగేది కార్బోహైడ్రేట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పేరుకుపోయే క్యాలరీల వల్ల. శరీరానికి శక్తినిచ్చేది పిండిపదార్థాలే. మెదడు, కండరాలు, కణాల ఆరోగ్యం బాగుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. ఇంకా చెప్పాలంటే... చైనా, జపాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాల ప్రజల ప్రధాన ఆహారం అన్నమే. కానీ ప్రపంచ ఆరోగ్యసూచి ప్రకారం వాళ్లల్లో వూబకాయం శాతం చాలా తక్కువ. అన్నంలో గంజి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఒక పొరలాగా పనిచేసి పెద్దప్రేగు క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది. పాలిష్‌ పట్టని బియ్యంలో పీచుపదార్థం అధికంగా ఉండి మలబద్ధకాన్ని నివారిస్తుంది.  100గ్రాముల అన్నంలో ఏమేం ఉంటాయంటే...  
 • ఆహార పదార్ధాలు
  Rice, raw పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
 • శక్తి 360 kcal 1510 kJ
 • పిండిపదార్థాలు 79 g 
 • కొవ్వు పదార్థాలు 0.6 g  
 • మాంసకృత్తులు 7 g 
 • విటమిన్ బి6 0.15 mg 12% 
 • Water 13 g 
 • కొలెస్టిరాల్ -----------------00 గ్రా. 
 • విటమిన్‌ ' ఎ ' --------------0%, 
 • విటమిన్‌ ' సి ' --------------0% ,
 •  కాల్సియం ------------------0% , 
 • ఐరన్‌ ----------------------1% , 
 • సోడియం -------------------9 మి.గ్రా. , 
 • పీచుపదార్ధం ----------------7% , 
పండిన ధాన్యాన్ని మొదట మిల్లులో ఆడించి ఊకను గింజ నుండి వేరుచేస్తారు. తరువాత వరి గింజల నుండి తవుడు ను వేరుచేసి తెల్లని బియ్యాన్ని తయారుచేస్తారు. దీనిని పాలిషింగ్ అంటారు. ఇలా చేయడం వలన వరి యొక్క పోషక విలువలు కోల్పోతున్నాము. విటమిన్ బి ఎక్కువగా ఈ పై పొరలలో ఉంటుంది. దీనిలోపం మూలంగా బెరి బెరి అనే వ్యాధి సోకుతుంది. తవుడు నుండి ఈ మధ్య కాలంలో నూవె (Rice bran oil) తీస్తున్నారు. బియ్యాన్ని దంచి లేదా మిల్లులో ఆడించి బియ్యపు పిండి తయారుచేస్తారు. దీనితో దోసెలు, అట్లు, ఇడ్లీలు మొదలైనవి తయారుచేస్తారు. బియ్యాన్ని నీరు లేదా ఆవిరిలో ఉడికించి వివిధ ఆహారపదార్ధాలతో కలిపి మనం తింటాము. దీనిని తిరిగి నూనెలో గాని నెయ్యిలో గాని వేయించి బిర్యానీ, పులావు మొదలైనవి తయారుచేస్తారు.
 •  లాభాలు 
వరి, బియ్యం - బలాన్ని కలిగిస్తాయి.. జ్వరం తగ్గాక శక్తిని కలిగిస్తాయి. వాంతులు నోటిపూత, వ్యాధులను నివారిస్తాయి. పాలిష్‌ పెట్టడంవల్ల మిల మిల మెరుపువస్తుంది ఇంత తెల్లటి బియ్యం తినడంవల్ల శరీరానికి ఏమాత్రం ఉపయోగం లేదు. పైగా పిండి పదార్థం ప్రేగులలో పేరుకుపోయి జీర్ణక్రియను మందం చేస్తుంది. పనికివచ్చే ప్రొటీన్‌లు, విటమిన్లు, ఖనిజ లవణాలు నూనెలు అన్ని తౌడుగా, చిట్టుగా, వ్యర్ధంగా వేరు చేయబడుతున్నాయి ఆ తౌడు, చిట్టు పశువులు తిని అవి ఆరోగ్యంగా వుంటాయి. తెలివైన మనిషి చేస్తున్న తెలివితక్కువ తనం అన్నది తెలుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టేది ఆహారమేనన్నది అందరికీ తెలిసిందే మరి ఆరోగ్య ఆహారంపై ఎంతవరకూ ఆధారపడి వుంటున్నారు అంటే చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఆరోగ్య ఆహారాలను అంటిపెట్టుకుని ఉన్నారు. ఆహార అలవాట్లు మారాయి, జీవన గమనం మారింది దీంతో కొత్త కొత్త వ్యాధులు శరీరాలపై దాడిచేస్తున్నాయి. వీటన్నింటిని ఎదుర్కోడానికి శరీరంలో రోగనిరోధక శక్తి సమృద్ధిగా లేదు ఆ శక్తిని ఇచ్చే ఆహారాలు తీసుకోనందుకే శరీరం బలహీనమౌతోంది ముఖ్యంగా పాలిష్‌ పట్టిన బియ్యం వల్ల చేకూరే ఆరోగ్యం శూన్యమే.

 • ముడి బియ్యంలో పోషక విలువలు సమృద్ధిగా వుంటాయి. పూర్వీకులు ముడిబియ్యం తిని ఎంతదూరమైనా కాలినడకనే వెళ్లివచ్చేవారు శరీరానికి శక్తినిచ్చే 'బి' విటమిన్‌ ప్రభావం అది. ముడిబియ్యం తినడంవల్ల అన్నీ లాభాలే వృద్ధాప్యం దూరం అవుతుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్‌లు దాపురించవు. చెడ్డ కొలెస్ట్రాల్‌ సమస్య లేదు. నడివయసు స్త్రీలకు మంచిది ముడిబియ్యం. ఒక కప్పు ముడిబియ్యంలో 88 శాతం మాంగనీసు లభిస్తుంది. ఈ ఖనిజ లవణం మాంసకృత్తులు, కార్పొహైడ్రేట్లు నుండి శక్తిని విడుదల చేసేందుకు దోహదపడుతుంది. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు, సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తికీ ఉపయోగపడే కొలెస్ట్రాల్‌ ఉత్పత్తికి మాంగనీస్‌ అవసరం. మాగనీస్‌ బాగుంటే వృద్ధాప్యం వాయిదా పడుతుంటుంది. -ముడిబియ్యం లో పీచుపదార్థం .. సెలీనియం ఖనిజ లవణం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలకు శత్రువులా పనిచేస్తుంది సెలీనియం. ఒక కప్పు ముడిబియ్యంలో రోజంతటికి కావలసిన పీచుపదార్ధం అందుతుంది. సెలీనియం వల్ల రోగనిరోధక వ్యవస్థ సజావుగా ఉంటుంది. చెడిపోయిన కణాలు తిరిగి పుంజుకుంటాయి. ముడిబియ్యం ఆస్తమా, గుండెజబ్బులు క్యాన్సర్‌, కీళ్ళనొప్పుల నివారణకు దోహదకారి అవుతుంది. ఈ బియ్యంలో వుండే నూనె మనకు చేటుచేసే (ఎల్‌డిఎల్‌) కొలెస్ట్రాల్‌ను అడ్డుకుంటుంది. ముడిబియ్యంలో నూనె అంటే తౌడుతో వుంటుంది. దానివల్ల తౌడు నుండి నూనెతీసి వాడమంటున్నారు వైద్యనిపుణులు. నడివయస్సు వారికి బహిష్టులు ఆగిపోయిన స్త్రీలకు వరంగా వున్నాయి ముడిబియ్యం. అధికరక్తపోటు కొలెస్ట్రాల్‌ సమస్యలు వున్నవారికి నివారణాపరంగా ముడిబియ్యం ఎక్కువ ఉపయోగపడుతుంది. పండ్లలోవుండే పోషకాలు ఏ మేరన ఉన్నాయో ముడిబియ్యంలో అలాంటి పోషకాలు అధికంగా వున్నాయి. అనేక రకాల పండ్లకు, పోషక కూరలకు సమాన ఫలితం ఇస్తాయి ముడిబియ్యం. ముడిబియ్యంలో వుండే మెగ్నీషియం ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి కారణమయ్యే ఎంజైమ్‌లతో సహా 300 కు పైగా ఎంజైముల తయారీకి దోహదపడుతుంది. అందువల్ల ప్రతిరోజూ ముడి బియ్యం తినేవారికి మధుమేహం రావడం చాలా చాలా తక్కువ. ముడిబియ్యం ఆహారం ఆస్తమా తీవ్రతను, మైగ్రేన్‌ తలనొప్పులను, రక్తపోటును తగ్గిస్తుంది. కాల్షియం పనితీరు క్రమబద్ధీకరణ జరిగి ఆరోగ్యం సజావుగా వుంటుంది. ముడిబియ్యంలోని పీచుపదార్థాలు పిత్తాశయం (గాల్‌బ్లాడర్‌) లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి, పీచుపదార్థాల వల్ల ప్రేవులలో ఆహార కదలికను వేగిరపరచి, జీర్ణరసాల విడుదలను క్రమబద్ధీకరణ జరుగుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గే దుస్థితి నుండి ముడిబియ్యం రక్షణాగా కూడా ఉంటుంది. ముడిబియ్యం తినేవారు బరువు పెరగకుండా, నాజూగ్గా, చురుగ్గా ఉంటారు, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ బియ్యం తినేవారి కన్నా పాలిష్‌ బియ్యం తినేవారిలో 52 శాతం ఎక్కువగా రొమ్ము క్యాన్సర్‌ బాధితులున్నారని పరిశోధనలు చెపుతున్నాయి. పాలిష్‌, చేయని గింజలు పిల్లల ఆహారంగా పెడితే, పిల్లల్లో వచ్చే జబ్బులు 50 శాతం అరికట్టవచ్చునట. పండ్లు, కూరలు, పాలఉత్పత్తులలో వుండి విలువల కన్నా ముడిగింజల ద్వారా చేకూరే ఫలితం ఎక్కువ. ముడిబియ్యంలో ప్రధానంగా, మాంగనీసు, సెలీనియం, మెగ్నీషియం సమృద్ధిగా వున్నాయి. పాలిష్‌ బియ్యంతో విలువన్నీ పోయి వట్టి పండి పదార్థం మిగులుతుంది. పిండ్లు, రవ్వలు, నూనెలు, వంటివి ఆరోగ్యానికి హేతువులుగా గుర్తించారు.
 • ==========================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment