Monday, June 6, 2011

Vinegar , వెనిగర్

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... వెనిగర్ అనేది ఒక ఆమ్ల ద్రావకం ,ఇథనాల్ (ethanol) ని ఫెర్మెంటేషన్‌(fermentation) చేయడం ద్వారా తయారవుతుంది . దీనిలో ముఖ్యము గా ఎసిటిక్ యాసిడ్ (acetic acid) or ethanoic acid అనే ఆమ్లము ఉంటుంది . వెనిగర్ ఫి.హె.చ్ 2.4 నుండి 3.4 వరకూ ఉంటుంది . టేబుల్ వెనిగర్ లో 4% - 8 % గాను , పికిల్ (పచ్చళ్ళు) వెనిగర్ లో 18% వరకు ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది . వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ తో పాటు టార్టారిక్ యాసిడ్ , సిట్రిక్ యాసిడ్ , మరికొన్ని ఆమ్లాలు ఉంటాయి . 100 గ్రాముల 5% ఎసిటిక్ యాసిలో సుమారు 18 కిలోకేలరీల శక్తి నిచ్చే సామర్ధ్యము ఉన్నది . చరిత్ర /తయారీ : వెనిగర్ ని వేల సంవత్సరాల నుండే ప్రాచీలు వాడే చరిత్ర ఉన్నది . ఈజిప్ట్ లొ 3000 బి.సి లోనే దీని వాడేవారట . చైనాలో సుమారు 2000 బి.సి దీని వాడకం ఉండేదంటారు . సారా తయారు చేసినట్లే వెనిగర్ ని పిండిపదార్ధాలు , చెక్కెరలు ఫెర్మెంటేషన్‌ చేసినందున ఇథనాల్ మొదటి ప్రొడక్ట్ గా వస్తుంది . ఇథనాల్ ని ''ఎసిటిక్ యాసిడ్ బాక్టీరియా'' వల్ల ఆక్షిడేషన్‌ చేయడం ద్వారా ఎసిటిక్ యాసిడ్ వస్తుంది . ఇథనాల్ ని వైన్‌, సిడర్ , బీర్ , పండ్ల రసాలు మరియు నేచురల్ గ్యాస్ , పెట్రోలియం డెరివేటివ్ ల నుండి పొందవచ్చును . వ్యాపార అవసరాలకోసం వెనిగర్ ను 'స్లో మెదడ్ ఫెర్మంటేషన్‌ ' ద్వారా వారాలు ,నెలలు ఫెర్మెంటేషన్‌ చేసి తయారు చేస్తారు . దీనితో ''ఎసిటిక్ యాసిడ్ బాక్టీరియా + కరిగే సెల్యులోజ్ '' వస్తుంది .. దాన్నే " మదర్ ఆఫ్ వెనిగర్(mother of venigar) అంటారు . వెనిగర్ లో రకాలు (varieties of vinegar ):
 • మాల్ట్ వినెగర్ : బార్లీ ని నుంది తయారు చేస్తారు .. బ్రౌన్‌ రంగులొ ఉంటుంది .
 • వైన్‌ వినెగర్ : రెడ్ వైన్‌ నుంది తయారు చేస్తారు . సాదారణము గా వాడే వెనిగర్ ఇదే .
 • యాపిల్ సిడెర్ వెనిగర్ : దీన్ని cider , apple must నుండి తయారు చేస్తారు .
 • ఫ్రూట్ వెనిగర్ : రకరకాల్ పండ్ల రసాలు నుండి తయారవుతుంది . అనేక ఆహారపదార్ధాలలో వాడుతారు .
 • బాల్సామిక్ వెనిగర్ : ఒకరకపు అరోమా వెనిగర్ ఇది . ద్రాక్ష ని మూలపదార్ధము వాడి అరోమా ఆయిల్స్ కలుపుతారు .
 • రైస్ వెనిగర్ : బియ్యము మూలపదార్ధము గా వాడుతారు . బీరుని పోలిఉంటుంది .
 • కోకోనట్ వెనిగర్ : కొబ్బరి నీరు నుండి తయారవుతుంది . క్లౌడీవైట్ (మసకబారినితెలుపు ) రంగులో ఉంటుంది .
 • పామ్‌ వినెగర్ , కేన్‌ వెనిగర్ , రైసిన్‌ వెనిగర్ , హానీవెనిగర్ , ఇలా అనేకము ఉన్నాయి.
 • ఈస్ట్ ఏసియన్‌ బ్లాక్ వెనిగర్ : దీనిని rice , wheat,millet , sorghum ల మిశ్రమము తో తయారు జేస్తారు . నల్లరంగులో ఉంటుంది . మంచి గిరాకీ ఉన్నది ఇదే.
 • ఇంకా ఫ్లేవర్డ్ వెనిగర్ , జాబ్స్ టియర్స్ వెనిగర్ , కొంబూచ వెనిగర్ , కివి ఫ్రూట్ వినెగర్ , సినమాక్ వెనిగర్ , డిస్టిల్ద్ వెనిగర్ , స్పిరిట్ వెనిగర్ .
ఉపయోగాలు : ఆహారపదార్ధాలు తయారీ లో ముఖ్యము పచ్చళ్ళు (pickling) , vinaigrettes , salads , కొన్ని రకాల చెట్నీలు లలో కలుపుతారు . examples -> condiment for beetroot , condiment for fish and chips , flavoring potato chips , pickle foods , salads , soups and soup preparations , వైద్యపరం గా ఉపయోగాలు :
 • సన్‌ బరన్స్ లో చల్లదనం కోసం స్ప్రే పోడర్ గా వాడుతారు ,
 • కాలిన గాయాలకు చల్లదనము కోసం వాడుతారు (cooling effect as spray powder),
 • కొలెస్టిరాల్ , ట్రైగ్లిజరైడ్స్ తగ్గించే గుణము ఉంది .
 • రక్తపోటును తగ్గించడానికి ,
 • రోజూ ఆహారముతో కొద్దిగా వెనిగర్ తీసుకుటే మదుమేహ బాదితులలో మంచిదంటారు వైద్యనిపుణులు,
 • వెనిగర్ ను రోజూ కొద్దిగా ఆహారము లో వాడితే ఆకలిని తగ్గిస్తుంది . తొందరిగా కడుపునిండినట్లు చేస్తుంది.
 • వెనిగర్ సూక్ష్మ క్రిములు నాసనం చేయడానికి వాడేవారు . పైపూతగా వాడేవారు .
 • cervical screening tool గా క్యాన్సర్ కణాలను రంగు మార్చే పద్దతి తో గుర్తించవచ్చును .
 • గ్యాస్ట్రిక్ సమస్యలు నయము చేయడానికి వనిగర్ ను వాడేవారు .
 • ఎసిటిక్ యాసిడ్ ఉన్నందున క్లీనిగ్ ఏజెంటుగా వాడుతారు .
సలాడ్లు, పచ్చళ్లు, వివిధ రకాల ఆహార పదార్థాల అలంకరణకు, కొన్ని రకాల వంటకాలకు వినియోగించే వెనిగర్‌కు కొవ్వును కరిగించే సుగుణం ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో వెల్లడైంది. వెనిగర్‌లో ఉండే ఎసిటిక్ ఆమ్లానికి రక్తపోటు, రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించే శక్తి ఉన్నట్లు ఈ పరిశోధనలో కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టోమోకాండో మాట్లాడుతూ... ప్రాచీన కాలంలో వెనిగర్‌ను కొన్ని రకాల వ్యాధులకు సంప్రదాయక ఔషధంగా ఉపయోగించినట్లుగా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ప్రస్తుతం తాము జరిపిన పరిశోధనల్లో వెనిగర్‌కు కొవ్వును తగ్గించే లక్షణం ఉన్నట్లు కనుగొన్నామని చెప్పారు. కాగా... ఈ పరిశోధనా ఫలితాలు "అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ" అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. కొన్ని వంటకాలకు వెనిగర్ తప్పనిసరిగా వాడాలని చెబుతుంటారు గానీ... అయితే అది మన వంటింట్లో లేని సమయాల్లో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... దానికి బదులుగా నిమ్మరసం వాడితే సరిపోతుంది. అయితే నేరుగా కాకుండా, రెండు చుక్కల నీరు చేర్చి నిమ్మరసాన్ని కొద్దిగా పలుచన చేసి, ఆపైన వాడాల్సి ఉంటుంది. అలా చేస్తేనే వంటకానికి పూర్తిగా అదే రుచి వస్తుంది
 • ===================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment