Saturday, July 30, 2011

బేకింగ్ సోడా లేక వంట సోడా , Baking Soda , cooking soda

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. బేకింగ్ సోడా లేక వంట సోడాను మనం కేకులు, బజ్జీలు వంటివాటిలో అవి మృదువుగా రావడానికి ఉపయోగిస్తాము. కానీ బేకింగ్ సోడా వల్ల అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి.ఇతతర పేర్లు -- బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బేకింగ్పౌడర్, సోడా, తినే సోడా. బేకింగ్ సోడాను ... బైకార్బనేట్ ఆఫ్ సోడా(Bicarbonate of soda) లేదా సోడియం బైకార్బనేట్ (sodium bicarbonate) అంటారు . దీని కెమికల్ ఫార్ములా = NaHCO3.. ఇది తెల్లని చిన్న గింజలు లా ఉండే గుండ(powder). దీనిని లేబొరిటరీ లో తయారుచేయగలినా ప్రకృతిపరముగా దొరికె బేకింగ్ సోడాను " నాకొలైట్ (nahcolite) అంటాము . ఇది క్షారగుణము కలిగి ఉంటుంది . ప్రొటీన్స్ ను ముక్కలు చేస్తుంది . బేకింగ్ సోడా , బేకింగ్ పౌడరూ ఒకటి కావు . బేకింగ్ సోడా.. ప్యూర్ సోడియం బైకార్బొనేట్ , బేకింగ్ పౌడర్ ... సోడియం బైకార్బొనేట్ +పొటాసియం బైకార్బొనేట్ (cream of tartar) కలిపి ఉన్న మిశ్రమము . పొటాసియం బైకార్బొనేట్ ద్రాక్ష నుండి వైన్‌ తయారీ సమయములో తయారవుతుంది . బేకింగ్ పౌడర్ కూడా వంటకాలలో వాడుతారు . ఉపయోగాలు : * ఫరuచర్ మీద పెన్సిల్ గీతలు, క్రేయాన్ లేక ఇంకు మరకలు ఉన్నాయా? అయితే తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఆ మరకల మీద రుద్దండి. * ఒక లీటర్ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేస్తే దానిలోని వాసనలన్నీ మాయమవుతాయి. * కూరగాయలు లేక పళ్ళ మీద ఉన్న పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే సరి. * మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి. తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన, రుచికరమైన మాంసం తయార్. * తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. ఒక చిన్నబాక్స్ లో కొంచెం బేకింగ్ సోడాను ఉంచి దాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దుర్వాసనలన్ని పోయి చక్కగా ఉంటుంది. * చెమటతో శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడాను చెల్లితే శరీర దుర్వాసన మాయం. * టొమాటో వంటి పుల్లటి సూప్ కు మంచి రుచి రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా కలిపితే సరి. * పొట్టలో మంట లేక అనిజీగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడన్నా మాత్రమే వాడాలి. తరుచుగా వాడకూడదు. * కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే శుభ్రపడుతుంది. * కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్ లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి పోతుంది . సోడాను వాడవద్దు : కొంతమంది బీన్స్ మెత్తగా ఉడికేందుకు బేకింగ్ సోడా వాడుతుంటారు. అయితే ఇది సరైంది కాదు. సోడా బీన్స్‌లోని తేమని పీల్చివేస్తుంది, అంతేగాకుండా వాటిలోని పోషక విలువలను నశింపజేస్తుంది. కాబట్టి... సోడాను వాడకపోవటం మంచిది.
  • =====================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment