Monday, July 18, 2011

గుగ్గులు , guggul

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. గుగ్గులు ఒక రకమైన పూలు పూసే ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం కొమ్మిఫోరా వైటై (Kommiphora wightii). ఇది బర్సెరసి కుటుంబానికి చెందినది. దీని నుండి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గిలం గా ఉపయోగిస్తారు. బర్సెరేసియే కుటుంబము లో ఎన్నోజాతులు ఉన్నాయి . * Commiphora africana (A. Rich.) Engl. (syn. Heudelotia africana), sometimes identified with ancient bdellium. Used indirectly by the San bushmen to poison their arrow tips for hunting . * Commiphora angolensis, also known as "sand commiphora", growing mainly in Angola and Namibia * Commiphora boranensis Vollesen. * Commiphora caudata (Wight & Arn.) Engl.. * Commiphora corrugata J. B. Gillett & Vollesen. * Commiphora gileadensis (L.) C. Chr.. (syn. Commiphora opobalsamum),producing balsam of Mecca. * Commiphora guidottii (syn. Commiphora sessiliflora), producing scented Myrrh or habak hadi in Somali. * Commiphora guillaminii * Commiphora habessinica * Commiphora humbertii * Commiphora kataf (syn. Commiphora erythraea), producing bisabol. * Commiphora madagascariensis * Commiphora mossambicensis * Commiphora myrrha (syn. Commiphora molmol), producing myrrh. * Commiphora schimperi * Commiphora simplicifolia H. Perrier. * Commiphora stocksiana, known in Pakistan as bayisa gugal * Commiphora wightii (syn. Commiphora mukul), producing గుగ్గిలం. ఒక్క కొమ్మిఫొరా వైటై (గుగ్గిలం) తప్ప మిగతా జాతులు విషపదార్ధములు కలిగిఉన్నందున బహు కొద్దివాటినే వాడుకలో ఉన్నవి . సుమారు 3,000 సంవత్సరాలనుండి ఆయుర్వేద మందులలో ఈ గుగ్గుల్ వాడబడుతూ ఉన్నది . ఇందులో మందుగా వాడబడేది " గుగుల్-స్టెరోన్‌(గుగులిపిడ్ ) అనే రసాయన పదార్ధము . శరీరము లొ కొలెస్టిరాల్ ను తగ్గించే గుణము , కాలేయము కొలెస్టిరాల్ ను తయారీని ఆపుచేసే గుణము దీనికి ఉన్నదని శాస్త్రీయముగా కనుగొనబడినది . ఇది శరీరము లో ఫర్నెసోయిడ్ X రెసెప్టార్లను మూసివేయడము వలన (the extract said to block the Farnesoid x receptor(FXR)కొలెస్టిరాల్ తగ్గుతుందని అంటారు . ఎఫ్.ఎక్ష్.ఆర్ ... కాలేయములో బైల్ సాల్ట్స్ ను అదుపుచేయడం ద్వారా తన పని చేస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు . ఏదిఏమైనా టోటల్ కొలెస్టిరాల్ తగ్గుదల అంతగా ఉన్నట్లు తేలలేదు . . . మరియు ఎల్.డి.ఎల్. (చెడ్డ ) కొలెస్తిరాల్ ను ఎక్కువ చేసే గుణము ఉన్నట్లు ఆయుర్వేదము లో చెప్పబడి ఉన్నది . శరీర బరువును తగ్గిస్తుందనే నిదర్శనాలు లేదు . డేవిడ్ మూరె .. బేలర్ మెడికల్ కాలేజీ లో పరిశోధనలు జరిపి కలెస్టిరాల్ ను తగ్గిస్తుందని క్లినికల్ రిపోర్ట్స్ ఉన్నట్లు తెలియజేయడం జరిగినది . Lately it has been touted as a safe alternative to statins and other cholesterol-lowering drugs. But a new study in the Journal of the American Medical Association reports the herb is no better at lowering cholesterol than a sugar pill. --By David Bjerkli. గుగ్గుల్ వ్యాపార రీత్యా పండిస్తారు . మంచి వాసనగల ఈ బంకను ఎండిన తరువాత ధూపము గాను , అగరుబత్తీలు తయారీలోనూ వాడుదురు. లక్షణాలు * గుగ్గులు మొక్క ఒక గుల్మం లేదా చిన్న చెట్టుగా సుమారు 3-4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. * పత్రాలు ఏకాంతరంగా 1-3 చొప్పున ఉంటాయి. * ద్విరూప మొక్కలు.మగ , ఆడ వేరువేరుగా ఉంటాయి. * పుష్పాలు చిన్న సమూహాలుగా ఉంటాయి. * పండ్లు అండాకారంగా ఉంటాయి. వైద్య పరంగా ఉపయోగాలు : తిప్పతీగను, త్రిఫలాలను సమాన భాగాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. అర కప్పు కషాయానికి అర టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలంనుంచీ బాధించే మెడనొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. యోగారాజా గుగ్గులు ఈ మందు పక్షవాతానికి పని చేస్తుంది. కాంచనార గుగ్గులు ఈ మందులు చర్మవ్యాధులు, అంటు వ్యాధులకు, గడ్డలకు పని చేస్తుంది. కీళ్ళ నొప్పులకు బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము ,ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు, మెడిమల నొప్పులు తగ్గిపోతాయి. గుగ్గుల్ ని అశ్వగంద తో కలిపి వాడితే మదుమేహ వ్యాధి కి మంచిదని ఆయుర్వేద వైద్యులు ఆంటారు . ఆయుర్వేదిక్ వైద్యులు గుగ్గిలము అనే పేరుతో ఈ కింద నుధహరించిన రీతిలో వాడుతున్నారు : గుగ్గిలము:- Balsamodendron Pubescens-resin of. Eng Bdellium. సం. గుగ్గులు, దేవధూప, హిం. గుగుల్‌. ఇది గుగ్గిలపు చెట్టు జిగురు. గుగ్గిలములు నాలుగు విధములు. 1 రత్నపురి గుగ్గిలము, 2 తెల్ల గుగ్గిలము, 3 పుట్టగుగ్గిలము, 4 మహిసాక్షి గుగ్గిలము అని. ఇందు రత్నపురి గుగ్గిలము, తెల్లగుగ్గిలము, మహిసాక్షి గుగ్గిలము ఔషధోపయోగములు. పుట్టగుగ్గిలము ధూపములకు, రంగులకు వుపయోగింతురు. మహిసాక్షి గుగ్గిలము యొక్క గుణములు వేరుగ వ్రాయుబడినవి. మృదువుగ, జిగటగ, సువాసనగ, చేదుగ నుండును. వేడి జేసి ఆర్చును. లోపలికిచ్చిన రక్తము శుభ్రపరచును. చెమట పుట్టించును. మూత్రమును జారిజేయును. పొట్టకు బలము జేయును. మృదువు పరచును. శరీరమునకు కాంతిదెచ్చును. రక్త పైత్యము, కఫము, మేధోరోగము, శ్లేష్మము, క్రిమి, ఉన్మాదము, మూలవ్యాధి, దుష్టవ్రణములు, గ్రంధులు, గండమాలలు, వాతము, దుష్ట రక్తము, ప్రాతనొప్పులు, విషము--- వీనిని హరించును. గడ్డలను, కంతులను--- కరగించును. నరములరోగములు, గొంతుకనొప్పి, గుండెలలోని దోషములు, అమిత నడక వలన గలిగిన కాళ్ళవాపు వీనిని పోగొట్టును. బుద్ధికి బలమిచ్చును. కడుపులోను, గుండెలోను కూడియున్న చెడురక్తమును శుభ్రపరచును, శీఘ్రప్రసవము గావించును. స్త్రీల ఋతుబద్ధమును విప్పును. నడుము నొప్పి, కాళ్ళనొప్పి, కీళ్ళనొప్పి వీనిని హరించును; స్త్రీలకు పాలు పడజేయును. మూత్రపు సంచిలో పుట్టు రాళ్ళను. నరముల మార్గములలో పుట్టు గట్టి పదార్థములను తీసి వేయును. విరేచనములు కట్టును. వేడి జేసెడు విరేచఔషధములలో గలిపిన వాని వేడిని తగ్గించును. ఎర్రగుగ్గిలము తేనెలో గలిపి గొంతుక వాపుకు పట్టువేసిన నయమగును. ఆవుపాలలో గుగ్గిలము గలుపుకొని పుచ్చుకొనిన పుంసత్వమునకు బలము జేయును. ఇతర రుగ్మతలకు దీని చూర్ణము వేడినీళ్ళలో గలిపి పుచ్చుకొనవచ్చును. దీని సత్తువ 20 సంవత్సరములవరకు దేహమందు నిలిచియుండును. ఉదయమున నోటవచ్చు ఉమ్మితో దీనిని అరగదీసి పైనపూసిన లేక పట్టువేసిన గడ్డలు హరించును. బుడ్డకు పూసిన అది కరిగిపోవును. దీనిని సురంజాను అను దుంప (its latin name is Hermodactylus)తో పుచ్చుకొనిన మూలవ్యాధి మెలుకలు ఊడిపడును. దీనిని మూలవ్యాధికి పట్టు వేసినను మేలు జేయును. దీని పొగ పుచ్చుకొనినను , దీని పొగ బట్టినను మూలవ్యాధి నయమగును. దీని పొగ దుర్గంధపుగాలికి, అంటు విషపు గాలియొక్క దోషమును పోగొట్టును . తేలు కుట్టిన చోట దీనిని పూసిన విషము హరించును. దెబ్బ తగిలిన చోట పూసిన వాపు హరించును. పట్టు వేసిన గాయములో కూడియుండు దుష్టరక్తమును శుభ్రపరచును. గండమాలలకు, కంఠముపైన నయ్యెడు గడ్డలు మానును. దీనిని నూనెవేసి నూరుచు నీళ్ళతో 4-5 పర్యాయములు కడుగుచుండిన జిగురు వచ్చును. దానిని దళసరిగుడ్డకు వేసి పట్టువేయ వలెను. దీనిని తినిన కడుపులోని వాపుల తీసివేయును. నల్లదబ్బ (spleen)కు జబ్బుచేయును. దీనికి విరుగుడు జాపత్రి, మోతాదు పూటకు 3 మొదలు 10 చిన్నముల యెత్తు వరకు. suddha guggul caps హిమాలయా కంపెనీ వారు తయారుచేసి అమ్ముతున్నారు . వీటిని కొలెస్టిరాల్ మరియు శరీర బరువును తగ్గడానికి వాడవచ్చును .
source : Text book for students of BAMS.
  • ===========================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment