Friday, November 11, 2011

దవనం,మాచీ పత్రం,Artemisia indica

  • image : courtesy with Andhraprabha sunday paper
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • ప్రకృతి మనకిచ్చిన అనేక దివ్య ఔషధాలలో ఆకు కూరలు, పళ్లు, గింజలు ఇలా అనేకం ఉన్నాయి. వీటి సరసన సుగంధ పరిమళాలు కలిగిన వృక్ష సంతతి తన ప్రత్యేకతల్ని నిలుపుకుంటూనే వస్తు న్నాయి. వీటిలో నిత్య జీవితంలో ఎక్కువగా కనిపించే 'దవనం' ...వృక్ష శాస్త్ర ప్రకారం - ఆర్టిమిసికా ఇండికా వృక్ష జాతికి చెందిని. ఆస్టరేసియా కుటుంబానికి చెందిన సంతతి మొక్కలు మన నిత్య జీవనంలో మాచీ పత్రంగా పిలుస్తున్నాం. తెలుగులో దవనంగా పిలిచే ఈ మొక్కలు హిందూ సాంప్రదాయ పండగలలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయనే చెప్పాలి. ఇక పూల అలంక రణలో గుభాళింపుల కోసం దవనం వాడుతుంటారు.
దీని ఆకులు, లేత గింజలు పచ్చివిగానీ, వంటకాల్లో గానీ విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాక వీటిని ఉడికించి సలాడ్‌ల్లోను, సూప్‌లోను వేసుకుని కూడా తీసు కుంటారు. వీటి లేత ఆకులు ఉడికించి మెత్తగా ఉడుకుతున్న అన్నంలో కలిపితే మంచి రుచిగాను, సువాసనతోను అన్నం బాగుంటుంది. ఇతర దేశాల్లో ముఖ్యంగా చైనాలో ఈ రకమైన వినియోగానికి ప్రతి షాపులోను అందుబాటులో ఉంటుంది. జీర్ణశక్తిని పెంపొందించడంలో దీనికి ఇదే సాటి.
  • చైనా, జపాన్‌, కొరియా, వియత్నాం, టిబెట్‌, మంగోలియా దేశాల్లో సాంప్ర దాయ వైద్యవిధానాల్లో వీటిని వినియోగిస్తు అనేక పరిశోధనలు చేస్తున్నారు. దీనిని సాంబ్రాణి మాదిరిగా పొగ వేయటం వల్ల, దీని ఆకులతో తయారు చేసిన కషాయం వల్ల రొమ్ము కాన్సర్‌ నిర్ధిష్ట పరిమాణంలో ఉన్నప్పటికీ ఇంక పెరగకుండా ఉంటుం దని, ఈ మొక్కకి అంతటి సామర్ధ్యం ఉందని పరిశోధకులు అంచనా వేస్తూ మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.
  • అలాగే ఒత్తిడికి సంబంధించి నరాలకి తగిన పోషణనిచ్చి ఉపశమనం ఇచ్చింది.
  • పూర్తిగా దక్షణ భారత దేశంలోనే విస్తారంగా పండే ఈ మొక్కలకు ఆయు ర్వద వైద్యంలోనూ సౌందర్య సాధనాల తయారీలోనూ ప్రత్యేక స్ధానం ఉంది.
  • వివిధ రకాల సెంటెడ్‌ స్ప్రేల తయారీ లోనూ, పొగాకు ఉత్పత్తులకు గుభాళింపులు అద్దే క్రమంలోనూ దవళంని వినియోగిస్తుంటారు. ఇక దవళంతో తయారు చేసిన తైలం ఆయుర్వేద వైద్యంలో ఓ ప్రత్యేక సువాసన లతో గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.
  • దవళం నూనెని శరీపై వచ్చే చిన్న చిన్న దద్దుర్లు, పుళ్లపై రాస్తే త్వరగా తగ్గి పోతాయి.
  • కొందరి స్త్రీలలో కాన్పుల తరువాత పొట్టపై వచ్చే గీతలను తొలగించేందుకు దవళం నూనెను వాడితే ఫలితం ఉంటుంది. స్త్రీలలో ఋతుక్రమం సరిగా రాక పోయినా.. తిన్న పదార్ధం సరిగా జీర్ణం కాక పోయినా దవనం నూనె పొట్టపై మర్ధన చేసే మెరుగైన ఫలితాలు పొందుతారు.
  • కండరాల నొప్పితో బాధ పడేవారు ఈ నూనెతో మర్ధన చేయించుకుంటే మంచిది.
  • మానసిక ఆందోళనలకు, వత్తిళ్లకు లోనవు తున్న వారు ఈ తైలంతో మర్ధన చేసుకుంటే ప్రశాంతత నెలకొని ఆందోళన తగ్గు తుంది.
  • వేడి నీళ్లలో కొద్దిగా దవనం నూనె వేసి ఆవిరి పడితే ఊపరి తిత్తులకున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • ఇందులో సుగర్‌ వ్యాధుల్ని తగ్గించే అనేక ఔషధ గుణాలుండటంతో దవనంని సుగర్‌ నివారణ మందులలో వాడుతున్నారు.
  • ఎప్పటికపðడు శరీరానికి నూతన ఉత్సా హాన్ని అందించే ఈ దవనం చెవినొప్పి, జీర్ణ కోశ వ్యాధులను నివా రించడమే కాకుండా ధాతువర్ధకంగా, శక్తివర్ధకంగా ఉపయోగపడుతూ మానవాళికి సాయం అందిస్తోంది.
  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...MBBS

No comments:

Post a Comment