- =================================
Monday, November 21, 2011
వ్యాయామం తర్వాత ఎంతసేపటికి తినాలి, ఏం తినాలి?
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
వ్యాయామం తర్వాత ఎంతసేపటికి తినాలి, ఏం తినాలి... ఇది చాలామందిని తొలిచేప్రశ్న. బ్రిస్క్‌వాక్ లాంటి వ్యాయామాలు ఆకలిని తగ్గిస్తే, ఈత ఆకలిని పెంచుతుంది. ఆకలివేసినా వేయకపోయినా వ్యాయామం చేసిన పావుగంటకు ఏదైనా తినడం అవసరమని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వ్యాయామంతో కండరాల్లోని ఇంధనం(గ్త్లెకోజెన్) ఖర్చయిపోతుంది. ఆ నిల్వల్ని పూర్తిచేయడానికి వ్యాయామం చేసిన 15 నిమిషాలకే శరీరం సిద్ధమవుతుంది. ఆ సమయానికి మనం ఏమీ తినకపోతే కాసేపటికి అలసట అనిపిస్తుంది. అందుకనీ ఆ సమయంలో కమలారసం, శాండ్‌విచ్, వేరుశెనగ చక్కీ, ఉడకబెట్టిన గుడ్డు, రెండు మూడు చికెన్ ముక్కలు ఏదో ఒకటి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇవేమీ దొరక్కుంటే, కనీసం మంచినీళ్లయినా తీసుకోవాలట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment