పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
ఎవో డైట్,Evo Diet ‘‘ఎవో డైట్...’’ అంటే- ఎవల్యూషనరీ డైట్ అన్నమాట.‘ఎవోడైట్’ అంటే అన్నీ పచ్చివే సుమా! ఆది మానవుడు ఏమి తినేవాడో , ఎలా ఆరోగ్యము గా ఉండే వాడో నేడు చాలా మంది నిపుణులు ఆలోచించారు . మానవులు కోతులు నుండి పుట్టేరని .. అవి ఏమితింటున్నయో పరిశీలించి ... ఆచరించడము వలన ఎన్నోరకాల వ్యాధులనుండి మానవుడు దూరముగా ఉండడము గమనించి దానికొక పేరు పెట్ట్టారు ఇంగ్లండ్ నిపుణులు . అదే ఎవో డైట్ .. ఎవో అంటే ఆంగ్లములో ప్రిమిటివ్ (పురాతన,ఆది , ఆరంభము )అని అర్ధము . ఎవో డైట్ లో అరటి, అప్రికాట్, చెర్రీ, మామిడి, ద్రాక్ష, ఖర్జూరం, స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ, పుచ్చ... వంటి పండ్లు--బ్రాకోలి, క్యాబేజీ, క్యారెట్లు, ముల్లంగి, బఠాణీ, ఉల్లిపాయ, టమాటో... తదితర కూరగాయలూ- -వేరుశెనగపప్పు, ఆలివ్ గింజలు, అక్రోట్లు, జీడిపప్పు... మొదలైన నట్స్, ప్రత్యేకంగా తేనె..ఉంటాయి. ఇవన్నీ ఎవోడైట్‌కిందే లెక్క. దాదాపు పాతిక రకాల పండ్లూ, కూరగాయల్ని ఎవోడైట్ కింద చేర్చారు ఆహారనిపుణులు. ఇలాంటి పండ్లూ, కూరగాయలను రోజూ దఫదఫాలుగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. సుమారు అరవై లక్షల సంవత్సరాల నాటి మనిషి అంటే అప్పుడే కోతులనుంచి పరిణామం చెందిన ఆదిమ మానవుడు ఏం తిన్నాడో.. అదే ఇపుడు తింటే... ‘‘బరువు పెరగరు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తవు’’ అంటున్నారు. అధిక బరువు తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి బరువును కోతులు తినే ఆహారాన్ని తింటే చాలు, దానంతట అదే బరువు తగ్గడం ఖాయం అంటున్నారు. కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుందట. బీపీ సాధారణ స్థితిలో ఉంటుంది. మధుమేహ బాధితుల్లో ఇన్సులిన్ సమస్యలు సర్దుకుంటాయి. మొత్తంమీద ‘ఎవోడైట్’ తీసుకుంటే ఆరోగ్యంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
- =====================================
No comments:
Post a Comment