Thursday, December 1, 2011

Tri Colored food good for health, త్రివర్ణ పదార్ధాలు ఆరోగ్యానికి మంచిది

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • మూడురంగుల జెండా చూసినప్పుడల్ల ముచ్చటగా ఉంటుంది . అలాగే ఆ మూడు రంగుల పదార్ధాలు తినడము వల్ల మంకెంతో లాభము ఒనగూడుతుంది . ఏమిటా లింక్ అని నవ్వుకున్నా .... నారింజ , తెలుపు , ఆకుపచ్చ రంగుల పదార్ధాలు మన ఆరోగ్యానికి మంచిది .  
  • నారింజ రంగు : ఈ రంగులో ఉండే పండ్లు , కూరగాయల్లో బీటా-కెరటిన్‌ , విటమిన్‌ "సి" అత్యధికంగా లభిస్తాయి. వయసు రీత్యా లోపించే దృష్టి మెరుగవడానికి సహకరించే పోషకాలు వీటిలో ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోగలవు , కొలెస్టరాల్ , రక్తపోటు లను తగ్గించి కొలాజెన్‌ ఏర్పడడాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యవంతమైన జాయింట్స్ కు దోహదపడతాయి.  

  • బొప్పాయి : ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది . ఇతర ప్రోటీన్లు , జీర్ణసంబంధిత ఎంజైములు, విటమిన్‌ " ఎ" , " ఇ " , లు పొటాషియం లభిస్తాయి. సహజసిద్ధమైన లాక్జేటివ్స్ కలిగి ఉంటాయి. 
  • కమలా, బత్తాయి :  వీటిలో విట్మిన్‌ " సి " సాంద్రత ఎక్కువ . యాంటి ఆక్షిడెంట్స ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ ను బలోపేతము చేస్తాయి. పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది .
  • క్యారెట్లు : కంటి దృష్టికి మంచివి . విటమిన్‌ " ఎ, కె , సి , లు .. పొటాషియం , ఫైబర్ , మెగ్నీషియం , ఫాస్పరస్ , ఇతర పోషకాలు మెందుగా ఉంటాయి . 

  • తెలుపు రంగు : 
రోగనిరోధక వ్యవస్థను ఆందించే పోషకాలు తెల్లని పదార్ధాలలో ఉంటాయి . కొలెస్టరాల్ , రక్తపోతుస్థాయి సరిగా ఉంచుకునేందుకు సహకరిస్తాయి.తెలుపు రంగు గల కొన్ని పదార్ధాలు :
  • ఉల్లి , వెల్లుల్లి : సల్ఫైడ్ , ఎల్లిసిన్‌ అనే ఫైటోకెమికల్స్  అధికము గా ఉంటాయి. ట్యూమర్లకు వ్యతిరేకముగ్గా ఇవి పోరాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి , రక్తములో కొవ్వు , కొలెస్టరాల్ లను , బ్లడ్ సుగర్ ను తగ్గిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ , యాంటి ఫంగల్ , యాంటి వైరల్ లక్షణాలు కలిగిఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని సమర్ధవంతం గా పెంచుతాయి. జలుబు పై పోరాడే మంచి ఆహారము . 
  • ముల్లంగి : ఎక్కువగా పీచు పదార్ధము , తేమ , సహజమైన లాక్జేటివ్స్ ఉన్నాయి . దీనిలోని అధిక తేమ చర్మానికి , కళ్ళకు ఎంతో మేలుచేస్తుంది . 
ఆకుపచ్చ :  ఈ రంగు పండ్లు , కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి . క్లోరొఫిల్ , పీచుపదార్ధము , ఫోలిక్ యాసిడ్ , కాల్సియం , విటమిన్‌ " సి " , బీటాకెరటిన్స్ లభిస్తాయి . ఈ రంగు పదార్ధాలలోని పోషకాలు క్యాన్సర్ రిస్కుల్ని తగ్గిస్తాయి . రక్తపోటు , క్లెస్టరల్ స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణక్రియకు దోహదపడి , కంటి ఆరోగ్యానికి , దృష్టికి సహకరిస్తాయి . ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి రోగనిరోధ వ్యవస్థను మెరుగుపరుస్తాయి .
  • పాలకూర : ఐరన్‌ , ఫొలిక్ యాసిడ్ ,అధికం గా ఉంటాయి . పుట్టుకతో వచ్చిన లోపాల్ని  సరిచేయడానికి సహరిస్తుంది . దీనిలో అత్యధికంగా లభించే క్యాల్సియం , పీచు  జీర్ణక్రియకు , చర్మానికి మేలు కలిగిస్తాయి. 
  • బ్రకోలి : క్యాన్సర్ వ్యతిరేకగుణాలు  ఎక్కువ . యాంటీ ఆక్షిడెంట్స్ , ఖనిజాలు , ఏ, సి, విటమిన్లు  లభిస్తాయి. 
  • కివి : విటమిన్‌ "సి " ఎక్కువగా ఉంటుంది . పొటాషియం లభిస్తుంది . ఇది కంటి దృష్టి బ్లహీనతలనుండి కాపాడుతుంది . క్యాలరీలు తక్కువగా ఉంటాయి . మాయిశ్చర్ అధికముగా ఉంటుంది . చర్మానికి ఎటువంటి హాని జరుగుకుండా కాపాడుతుంది .










  • ====================================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment