Saturday, May 19, 2012

వత్సనాభి,Indian Aconite

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
 • ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక వర్గాల్లో ఒకటి ఔషధ మొక్కలు. సంపూర్ణ ఆరోగ్యానికి సహజమైన రీతిలో ఉత్తేజాన్ని అందించే ఔషధమొక్కల పట్ల ప్రతీవారూ కనీస విషయ పరిజ్ఞానాన్ని కలిగిఉండడం ఎంతైనా అవసరం. ఈ ఔషధమొక్కల సేవనం వల్ల శారీరక పుష్టిని, తద్వారా మానసికోల్లాసాన్ని సాధించడం ఎంతో సులువు. సక్రమ జీవనానికి మార్గాలైన శారీరక, మానసిక ఆరోగ్యాలకు మూలం... ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన ఔషధమొక్కలు. ఆ కోవకి చెందిందే వత్సనాభి.
ఇది రానంకులేసీ కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయ నామం అకోనిటమ్‌ ఫెరొక్స వాల్‌. ఇది బహు వార్షిక గుల్మం. దీనిని ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఆంగ్లంలో ఇండియన్‌ అకోనైట్‌, హిందీలో మీటావిష్‌, బచ్నాగ్‌, మళయాళంలో వత్సనాభి, సంస్కృతంలో ప్రాణహర, హాలాహల అని పిలుస్తారు. 2000-3000 మీటర్ల ఎత్తైన ప్రాంతాలలోనూ వత్సనాభి పెరుగుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, జమ్మూకాశ్మీర్‌, సిక్కిం, పంజాబ్‌ రాష్ట్రాలలోని పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్టు పొడవు 90 సెం.మీలు ఉంటుంది. ఆకులు అర్ధవర్తులాకారంలో ఉంటాయి. పువ్వులు నీలి రంగులో ఉంటాయి. వేర్లు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఫిబ్రవరి - మార్చి నెలలు వీటిసాగుకు అనువైన కాలం.
 • ఇందులో వివిధ రకాల ఆల్కాలైడ్స్‌ ఉన్నాయి. కస్మోవాకొనిటైన్‌, బిఖాకొనిటైన్‌, ఇండా కొనిటైన్‌, సూడో కొనిటైన్‌, బిఖా కొనైన్‌ టెట్రాసిటైల్‌ ఆల్కాలైడ్స్‌ ఇందులో మిళితమై ఉన్నాయి. ముఖ్యంగా వత్సనాభిమొక్కలో వేర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
 • దీని వేరు నుంచి తయారుచేసిన ఔషధం అల్సర్ల నివారణకు చక్కగా పనిచేస్తుంది.
 • అంతేకాకుండా ఈ వేరును నీళ్ళల్లో మరిగించి ఆ డికాక్షన్‌ను తాగితే జుట్టు రాలడం, తెల్లబడడం ఉండదు.
 • తెగిన గాయాలకు, దెబ్బలకు దీని వేరుతో తయారుచేసిన ఔషధాన్ని పైపూతగా వాడితే తక్షణ ఉపశమనం ఉంటుంది.
 • వేర్ల నుంచి తయారుచేసిన ఔషధాలు రక్తపోటును, డిస్‌పెప్‌సియా, అమెనోర్హియా, ఆర్ధరైటిస్‌, హెపటైటిస్‌, దగ్గు, అస్తమా లాంటి వ్యాధులకు మంచి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 • అంతేకాక చర్మ సంబంధ వ్యాధులను కూడా తగ్గిస్తుంది.
 • దీని వేర్లతో తయారుచేసిన పొడిని తేనెలో కలిపి తింటే అజీర్తి, కడుపునొప్పి తగ్గుతుంది.
 • దీని ఆకులను నీళ్ళల్లో బాగా మరగనిచ్చి డికాషన్‌లా తయారుచేసుకోవాలి. ఈ డికాషన్‌లో కొన్ని పాలు కలిపి తయారుచేసిన పానీయంతో తలనొప్పి, భుజాలు, పార్శ్శపు నొప్పులకు బాగా పనిచేస్తుంది.
 • దీని తైలం అన్ని అవయవాల నొప్పులకు పనిచేస్తుంది.
 • వత్సనాభితో తయారుచేసిన టానిక కండరాలలో శక్తిని, ఎముకలలో కాల్షియం శాతాన్ని పెంచడానికి, ఉపయోగపడుతుంది.
 • ఇది ఆయుర్వేదంలో బాగా ప్రాచుర్యం పొందిన ఔషధం. గుణ రస వీర్య కణాలను వృద్ధి చేస్తుంది. దీనితో తయారుచేసిన ఔషధాలు కొన్ని హైలాండ్స్‌ టానిక జ్వరానికి, అల్‌షోక జుట్టు రాలకుండా, చుండ్రును తొలగిస్తుంది.
ఎన్‌.సిహెచ్‌. మానస @Andhraprabha News paper.
 • ======================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment