Thursday, May 17, 2012

కష్టంగా జీర్ణం అయ్యే కొన్ని ఆహారాలు,Some foods are hard to digest.

  • food & food items
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యేవిగా వుంటే అవి మీలో గుండె మంటలను కలిగిస్తాయి. అలాగని అన్ని ఆహారాలు మంటను కలిగించవు, బరువుగాను వుండవు. అయితే, చిన్నపాటి చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ వంటివి కూడా అజీర్ణం కలిగించవచ్చు. చాలాసార్లు, మనం అసలు అజీర్ణం ఎలా కలుగుతోందో చెప్పలేము. కొన్నిసార్లు ఆహారాలు తినవలసిన విధంగా తినకపోయినా అజీర్ణం ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు కష్టంగా జీర్ణం అవటం, గుండె మంటను కలిగించటం చేస్తాయి. వాటిని పరిశీలిద్దాం.
1. బాగా వేయించిన ఆహారాలు :
  • - బాగా వేయించిన వేపుడు పదార్ధాలు అజీర్ణం కలిగిస్తాయి. నూనెలో వేయించిన ఆహారాలు చాలా కష్టంగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే వాటిలో అధిక నూనె వుంటుంది. అంతేకాక బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు అనారోగ్య నూనె లేదా బాగా మరిగిన నూనె అనేక మార్లు ఉపయోగించటం చేస్తారు. అది మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది.
2. మసాలా ఆహారాలు :
- పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి.
  • 3. పాలలోని షుగర్ పడకపోవటం :
  • - లాక్టోస్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. ఇది పాల ఉత్పత్తి. సాధారణంగా 70 శాతం పెద్ద వారికి ఎంతో కొంత లాక్టోస్ సరిపడకపోవటం వుంటుంది లేదా లాక్టోస్ కల ఆహారాలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది.
4. ఆకు కూరలు -
కేబేజి, బ్రక్కోలి, ముల్లంగి వంటివి బరువైన ఆహారాలు. ఎందుకంటే, అవి త్వరగా జీర్నం కావు. వీటిలో ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలు జీర్ణం చేయటానికి అవసరమైన లాక్టేస్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో బాక్టీరియా బలపడుతుంది.
  • 5. గింజ ధాన్యాలు
  • - పప్పులు, రాజ్మా, కిడ్నీ బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది.
6. సిట్రస్ పండ్ల రసాలు -
సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బందిపెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. ప్రత్యేకించి వీటిని సరైన సమయంలోనే తీసుకోవాలి. ఉదాహరణకు ఖాళీ పొట్టతో సిట్రస్ పండ్లు లేదా రసాలు తీసుకోరాదు.
  • 7. విత్తన ఆహారాలు -
  • విత్తనాల ఆహారాలు ఏవైనప్పటికి పొట్టకు బరువే. విత్తనాలకంటే కూడా ముందుగానే ఆహారం జీర్నం అయిపోతుంది. టమాటా, వంకాయ, పచ్చిమిరప వంటివాటి గింజలు లోపల జీర్ణం కాకుండానే పేగుల ద్వారా ప్రయాణించి మలంలో బయటకు విసర్జించబడటం చూస్తూనే వుంటాము.
8.రాగి అంబలి / రాగి రొట్టెలు
- ఇందులో కాల్సియం , ఐరన్‌ .. ఎక్కువగా ఉండడము చేత కడుపులో బరువుగా అనిపిస్తుంది . ఆలస్యముగా జీర్ణమవుతుంది . ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది .
  • ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. కాని అవి తినటం మానరాదు. ఎందుకంటే మీ ఆరోగ్యానికి అవికూడా అవసరమే. అయితే, గుండెకు మంట కలుగకనుండా వాటిని తక్కువ మొత్తాలలో తినండి
  • ==============================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment