Tuesday, December 18, 2012

Pure water and Water purifiers-శుద్ధజలం మరియు నీటి శుద్ధి పరికరాలు

  •  
  •  image : courtesy with Eenadu news paper
  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 
నీరు :
రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది, శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. అవి మంచి నీళ్లయితే అంతా మంచిదే! కానప్పుడు! కాలుష్య కారకాలతో నిండినవైనప్పుడు? అనారోగ్యాలు కమ్ముకొంటాయి. ప్రాణాంతక వ్యాధుల్లో అధిక శాతం అపరిశుభ్రమైన జలాల కారణంగానే వ్యాపిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. మరి ఈ సమస్యని నియంత్రణలో ఉంచడానికి మార్గమేదీ అంటే.. అత్యధిక మందికి అందుబాటులో ఉన్నవి నీటి శుద్ధి పరికరాలు (వాటర్‌ ప్యూరిఫైయర్లు). వీటి పనితీరుపై చక్కటి అవగాహన కలిగి, ఎంపికలో తగు జాగ్రత్తలు పాటిస్తే వందశాతం స్వచ్ఛమైన జలాన్ని స్వీకరించడం ఈ రోజుల్లో సాధ్యమనే చెప్పొచ్చు. ఆ దిశలో మార్గనిర్దేశం అందించే కథనమే ఇది.

బావి నీరు, కుళాయి నీరు.. స్వచ్ఛమైన తాగునీరు అని అన్ని సందర్భాల్లో అనుకోవడానికి లేదు. వివిధ కారణాల వల్ల వాటిల్లో జీవ సంబంధిత, రసాయనిక వ్యర్థాలు వచ్చి చేరతాయి. బావుల్లో చుట్టుపక్కల ఇంకిన మురుగు నీరు వచ్చి కలుస్తుంది. పొలాల్లో చల్లే పురుగు మందుల దుష్ప్రభావం ఉంటుంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీటిలో కలిసే అవకాశాలూ అధికమే. కార్పొరేషన్‌, మున్సిపాలిటీ నీళ్లు శుద్ధి అయి వస్తాయి కాబట్టి వీటిల్లో సాధారణంగా ఆర్సెనిక్‌ వంటి భారలోహాలు ఉండవు. కానీ పైపుల ద్వారా రావడం వల్ల గొట్టాల్లో ఉండే పాచి, తుప్పు వల్ల నీరు కలుషితం అవుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు..ఈ రకమైన కలుషిత జలాలను నిత్యం ఎక్కువ కాలం స్వీకరించడం, ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకప్పటితో పోలిస్తే ఈ వాస్తవాన్ని ప్రజలూ గ్రహిస్తున్నారు. అందుకే మెట్రోల్లోనే కాదు పట్టణాల్లోనూ వాటర్‌ ప్యూరిఫైయర్ల కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.

వాటితో ఏయే ఉపయోగాలు...

తాగే నీటికి చక్కటి రుచిని ఇవ్వడంతో పాటు నీటిలోని హానికారక వైరస్‌, ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలను నీటి శుద్ధి పరికరాలు సమర్థంగా నియంత్రిస్తాయి. ఈ ఒక్క చర్య కారణంగానే డయేరియా, కలరా, కామెర్లు వంటి వ్యాధులని అడ్డుకోవచ్చు. నీటిలో కరిగి ఉండే రసాయనాలని తొలగించి దీర్ఘకాలిక ఇబ్బందులు రాకుండా చూడటంలో వీటిది కీలక పాత్ర. బావి నీటిలో హానికారక క్యాడ్మియమ్‌, సీసం, మెగ్నీషియమ్‌, సిలికా, క్రోమియమ్‌ వంటి లోహాలు ఉంటే అవి శరీరానికి చేరకుండా నిరోధిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ.. మలబద్దకానికి కారణం అయ్యే ఇనుము, ఫ్లోరిన్‌లను తొలగిస్తాయి. నీటియొక్క పీహెచ్‌ సమతుల్యాన్ని ఇవి కాపాడతాయి. విలువైన ఖనిజాలని తాజాగా శరీరానికి అందిస్తాయి.

శుద్ధి విధానాలపై శ్రద్ధ...

నీటిని మరగకాచి చల్చార్చడం, క్యాండిళ్లున్న వాటర్‌ ఫిల్టర్లను వాడటం వంటి శుద్ధి విధానాలను ఇప్పటికీ పల్లెల్లో చాలాచోట్ల వాడుతున్నారు. అయితే వీటితో పోలిస్తే ఆధునిక తరహావి పలు విధాల మేలైనవి, అతి సూక్ష్మ క్రిములను సైతం నియంత్రించగలవన్న విశ్వసనీయతను సంపాదించాయి. ఇవి ప్రధానంగా యూవీ ప్యూరిఫికేషన్‌, రివర్స్‌ ఆస్మోసిస్‌ విధానం, యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టరింగ్‌, డిస్టిలేషన్‌, ఐయాన్‌ ఎక్స్‌ఛేంజ్‌, ఎలక్ట్రో డీఐయనైజేషన్‌ వంటి విధానాలతో లభ్యమవుతున్నాయి. ఇవి కలుషితాలను పరిహరించి, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులని అరికడతాయి.

ఎటువంటి పరికరాలు కొనాలి..

ఒకసారి పరికరాన్ని కొనాలని నిర్ణయించుకొన్న తర్వాత ఎటువంటి వడపోత విధానం సరిపడుతుందనే దానిపై అవగాహన తెచ్చుకోవాలి. పైన చెప్పుకొన్నట్టు.. యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టరేషన్‌, యూవీ ప్యూరిఫికేషన్‌, రివర్స్‌ ఆస్మోసిస్‌... లేదా వీటి మేళవింపు పరిజ్ఞానంతో ప్రస్తుతం పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది మంచిది అని నిర్ణయించుకోవాలంటే ముందు తాగే నీటిలో టీడీఎస్‌ (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) స్థాయులు ఎంత ఉంటున్నాయో చూసుకోవాలి. నీటిని దగ్గర్లోని ల్యాబులో పరీక్ష చేయించుకోవచ్చు. కేవలం మురికి, స్వల్ప కలుషితాలు మాత్రమే ఉంటే ఖరీదయిన పరికరాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అందుకు సాధారణ యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టర్‌ క్యాట్రిడ్జ్‌ను ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు. కేవలం క్లోరిన్‌, అతినీలలోహిత కిరణాలతోనే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. అలాగే మున్సిపాలిటీ వాళ్లందించే నీటిని శుద్ధి చేసుకోవడం కోసం 'యూఎఫ్‌ అల్ట్రా ఫిల్టరేషన్‌' పరిజ్ఞానం సరిపోతుంది. అయితే ఇవి నీటిని వడకట్టినా అందులో క్రిముల అవశేషాలు జీర్ణాశయంలో చేరి అలర్జీలు రావొచ్చు. గమనించుకొని సందర్భానుసారంగా ఎంచుకోవాలి.

వివిధ వడపోత దశలివి...

బిందెకి ఒక వస్త్రం చుట్టి నీళ్లు పట్టడం తెలిసిందేగా! వాటర్‌ ప్యూరిఫైయర్‌లోనూ ఈ తీరును మనం ఊహించవచ్చు. ఇరవై మైక్రాన్లు, ఐదు మైక్రాన్లుండే అతి సూక్ష్మమైన రంధ్రాల ద్వారా నీరు పంపుతారు. ఫలితంగా మట్టి, మురికి, సూక్ష్మ క్రిములు అక్కడ నిలువరించబడతాయి. తరవాత మరిగించే ప్రక్రియ సాగుతుంది. అయితే నిర్ణీత కాలం తరవాత పరికరం తయారీదారు నిర్దేశించినట్టుగా వడపోత కాగితాలని మార్చాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. పరికరంలో యూవీ వాటర్‌ స్టెరిలైజింగ్‌ విధానం ఉంటే కనుక అది హానికారక బ్యాక్టీరియాతో పాటు వాటి క్రిముల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా 99 శాతం నీరు శుభ్రం అవుతుంది. మెంబ్రేన్‌ ఆధారిత వాటర్‌ ఫిల్టర్లు, యూఎఫ్‌ మెంబ్రేన్‌ ఆధారిత రకాలు కూడా ఈ ప్రక్రియని సమర్థంగా నిర్వహిస్తాయి. నీటిని శుభ్రపరచడంలో కీలక దశ రసాయనాలని తొలగించడం. బావినీటిలో, బోరునీటితో ఉండే భారలోహాలని తొలగించడానికి 'రివర్స్‌ ఆస్మోసిస్‌ విధానం' ఉన్న వాటర్‌ ప్యూరిఫైయర్లు బాగా ఉపయోగపడతాయి.

ఈ అంశాలనూ పరిగణనలోకి...

భారతీయ ప్రమాణాల బ్యూరో మార్గనిర్దేశాల ప్రకారం ప్రముఖ బ్రాండ్లలో, రివర్స్‌ ఆస్మోసిస్‌ పరికరాలకు ఆదరణ అధికమని చెప్పొచ్చు. వీటి తరవాత యూవీ వాటర్‌ ప్యూరిఫైయర్ల గురించి చెప్పుకోవాలి. నీటి శుద్ధి పరికరం కొనేప్పుడు జాతీయ పారిశుద్ధ్య ఫౌండేషన్‌, నీటినాణ్యత సంఘం నిర్ధారించినదై ఉండాలి. కాట్రిట్జ్‌ లేబుల్‌పైన వివరాలను పరిశీలించాలి. సామర్థ్యం, తయారైన ప్రదేశం, ఖరీదు గమనించాలి. వినియోగ సూచనల పుస్తకంలో కేర్‌ నంబర్‌తో పాటు ఉపయోగించే విధానం తెలుసుకొంటే సమస్య ఎదురయినప్పుడు తక్షణం సంప్రదించే వీలుంటుంది.

  • -Concert
(ఎ సెంటర్‌ ఫర్‌ కన్జూమర్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ టీచింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ టెస్టింగ్‌) నివేదిక ఆధారంగా @Eenadu vasundara
  • =======================
 Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment