Monday, May 27, 2013

Roselle , గోంగూర



  •  

  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


Roselle , గోంగూర---దీని Botanical name -- Hibiscus sabdariffa(Roselle=Gongura)
వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గొంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి
గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు వండొచ్చు.
ఇది బెండ కుటుంబమునకు చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలియకున్ననూ ఇది భారతదేశమునకు వెలుపలి నుండి వచ్చినట్లుగా తెలియుచున్నది. దీనిని ఆంధ్రదేశమున విరివిగా వాడతారు. దీనిని ఆంధ్ర మాత అని అంటారు. దీనిని సాధారణంగా నార పంట గా వాడుదురు.

రకములు

    దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవునందలి రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు.
    పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.
    
వంటలు
ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన గోంగూర పచ్చడి మాత్రమే కాకుండా దీనితో గోంగూర పప్పు, గోంగూర పులుసులు కూడా చేస్తారు.

వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది
ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు.

ఉపయోగాలు :
  • ఆహార పదార్థంగా గోంగూర ఉపయోగం మనకు తెలుసు. సంవత్సరం పొడుగునా నిలవ ఉండి, ఉప్పులో ఊర వేసిన గోంగూర అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండే (ఇన్‌స్టాంట్‌) కూర .
  • గోంగూర కాడల్ని చితకకొట్టి, పలుపులు, నులక పేనడం ఆంధ్రదేశంలో అనాదిగా రైతులు చేసేపని. వాణిజ్యపరం గా, పెద్ద ఎత్తున పలుపులు, నులక పేనడం జరగక పోయినా, రైతు తన ఇంటి ఉపయోగానికి కావలసినంత మటుకు అయినా తయారు చేసుకోవడం ఒక అలవాటు. గోంగూరతో సంచులు చేస్తారు. జనపనార సంచులంత గట్టివి కాకపోయినా పనిగడుపుతాయి.
  • మెట్ట, మాగాణీ భూముల్లో గూడ గోగులు వేస్తారు. ఇందులో కొండగోంగూర, మంచి గోంగూర రెండు రకాలు. కొండ గోంగూర కాడ కొంచెం ఎరుపుదాళుగా ఉంటుంది. ఆకు కొద్దిగా వగరు.
  • నిలవపచ్చళ్ళకు వాడరు. మంచి గోంగూర పుల్లగా ఉంటుంది. పండు మిరప పండ్లను గోంగూర తో పాటు తగినంత ఉప్పువేసి తొక్కి నిలవ పచ్చడి తయారు చేస్తారు. 
  • మన గోంగూర విదేశాలకు పచ్చడి రూపాన ఎగుమతి అవు తున్నది. గణాంక వివరాలు ఇవ్వగలిగినంత గణనీయమైన ఎగుమతి వ్యాపారం కానప్పటికీ, మన గోంగూర ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి, పరోక్షంగా దేశసేవ చేస్తున్నది.
  •  ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలగి ఉంటూనే ఉన్నది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే
  • తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో తుప్పల్లో బీళ్ళలో పుడ్తున్నాయి, చస్తున్నాయి. గోగుపూలుఅందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా.
  • గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకు న్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో కుమ్మి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి.
  • వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులు తాయి. స్వస్థత చిక్కుతుంది.
  • రేచీకటికి రాత్రిపూట సరీగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషం తో బాధపడేవారు భోజనంలో ఆకుకూర గానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అంతటితో చాలదు రేచీకటి తగ్గడానికి చిన్న చిట్కా వైద్యం లేదా గృహవైద్యం ఇది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి,దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం తక్షణం చేయవలసిన పని. తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది .
  • బోదకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి.
  • విరోచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి త్రాగితే ముందు అవి కట్టుకుం టాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి.
  • దగ్గు, ఆయాసం తుమ్ము లతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా అంటే ఆహారంగానో లేక ఔషధం గానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికీ చాలామేలు చేస్తుంది .
  • శరీరం లో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది .
  • గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది.
  • ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు. 
  • ===================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment