Tuesday, November 12, 2013

Butter , వెన్న , నవనీతము

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


వెన్న - ఒక మంచి ఆహార పదార్ధము. వెన్నను క్షిరదాల పాలనుండి తయారుచేయుదురు.ముఖ్యంగా ఆవు,గేదె,మేక పాలనుండి తయారుచేయుదురు.మేక,గొర్రె,ఒంటెల పాలనుండి వెన్నను తీయడం అరుదు. వాటి పాలను దేశియ వైద్యంలో మాత్రమే వినియోగిస్తారు. భారతదేశంలో ఆనాదిగా వేదకాలం నాటికే ముందుకాలం నుండే పాలనుండి వెన్నను(butter), వెన్ననుండి నెయ్యి(ghee),మీగడ(cream)తయారు చేయటం మొదలైనది. వెన్నను పాలనుండి రెండు విధాలుగా తయారుచేయుదురు. ఒకటి సంప్రదాయ పద్థతిలో ఇంటిలోఉత్పత్తిచేయడం, రెండు పారిశ్రామికంగా పెద్దమొత్తంలో యంత్రాలద్వారా తయారుచేయుదురు. తయారైన వెన్న తెల్లగా,మెత్తగా వుండును.20-25% వరకు నీటిని కలిగివుండును. వెన్ననుండి నెయ్యిని తయారుచేయుదురుకావున వెన్న బౌతిక,రసాయనిక లక్షణాలునెయ్యిలక్షణాలు ఒక్కటే.

స్వాభావికంగా లభించే ఏ ఆహార పదార్థం కూడా పరిమితులకు లోబడి తీసుకుంటే హానికరం కాదు. ఏదైనా పరిమితికి మించి తినడం అన్నది అనర్థదాయకం అవుతుంది. అపరిమితంగా వెన్న తినడం వల్ల జరిగే అనర్థాల గురించి మీరు వినే ఉంటారు కాబట్టి మీ భయాందోళనలు తొలగించడానికి మీరు మీ ఆహారంలో పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల కలిగే లాభాలు .ఆహార పదార్థంగా వెన్న వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి పెద్దగా తెలియదు. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి.

బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల (మెంటల్ ఇల్‌నెస్) నుంచి రక్షణ కల్పిస్తుంది. దాంతోపాటు మనకు శక్తి వనరుగా ఉపయోగపడుతూ అవసరమైన శక్తిని ఇస్తుంది. మనం తిన్న ఆహారం చిన్న పేగుల నుంచి ఒంటికి పడుతుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా జరిగే క్రమంలో తిన్న ఆహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది బ్యుటిరేట్. అంటే ఒంటికి పట్టకుండా వృథా అయిపోయే ఆహారాన్ని వీలైనంతగా తగ్గిస్తుందన్నమాట. పైగా చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుంది.

కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) విషయానికి వస్తే - మనకు అవసరమైన పోషకాలలో దానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. గుండె ఆరోగ్యానికి అదెంతో మంచిది. నిజానికి చాలామంది వెన్న తినడం వల్ల కొవ్వు పెరిగి, గుండె ఆరోగ్యానికి అదంత మంచిది కాదని అనుకుంటారు. కానీ పరిమితమైన వెన్న వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది. తద్వారా కొంతవరకు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

వెన్నలో యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు వెన్నను మానేయాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని పరిమితంగా తీసుకుంటూ ఉండండి. నెయ్యి కంటే వెన్న చాలా శ్రేష్టమైనది.  నిశ్చితంగా పరిమితమైన మోతాదులో వెన్నను తినవచ్చు. అన్ని వయసుల వారు కూడా వెన్న తినవచ్చు.
100 గ్రాముల వెన్నలో ఏకంగా 750 కేలరీలు ఉంటాయి. వెన్న తింటే కడుపు నిండినట్లు ఉండి.. అన్నం తక్కువగా తింటారు. నెయ్యి రోజూ తినే వాళ్లలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. దీంతో బరువు తగ్గాలనుకునే వారు వెన్న, నెయ్యి ఎక్కువగా తినాలంటున్నారు. ఇందులో ఉండే కేలరీలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు.. వెన్నలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్లు మన దరికి చేరవు. రోజూ వెన్న తినే వారికి జలుబు, ఫ్లూ జ్వరం అంటే ఏంటో తెలియదు. జ్వరంతో బాధపడే వాళ్లు వెన్నతో కూడిన పదార్హములు  తింటే త్వరగా కోలుకుంటారు .

వెన్నలో కాల్షియం, పాస్ఫరస్‌, విటమిన్‌ - A, D..ల శాతం ఎక్కువగా ఉంటాయి. దీంతో.. మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెన్న ఎక్కువగా తినే వాళ్ల చర్మంపై మృతకణాలు తొలగిపోయి.. శరీరం నిగనిగలాడుతుంది. అందుకే ముఖం, కాళ్లు, చేతులను వెన్నతో రుద్దుకుంటే ఆరోగ్యంతో పాటు శరీర ఛాయ కూడా మెరుగవుతుంది . వెన్నలో గల అరాచిడోనిక్‌ యాసిడ్‌ మెదడులోని చెత్తను బయటికి పంపి శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదగాలంటే వెన్న ఎక్కువగా తినాలి. వెన్న, నెయ్యి ఎక్కువగా తినే పిల్లలు, పెద్దలు చురుకుగా ఉంటారు.

వృద్దులకు ఔషధం ...
 వెన్నలో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. చెవికి సంబంధించిన సమస్యలు, నిద్రలేమి, పక్క తడిపే అలవాటు, లైంగిక సమస్యలు, మానసిక సమస్యలు ఉన్న వాళ్లకు ఆయుర్వేద వైద్యులు వెన్న తినాలని సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా గర్భవతులు 4వ నెల నుంచి వెన్న, నెయ్యి ఎక్కువగా తింటే కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులకు వెన్న మంచి ఔషధంగా పనిచేస్తుంది. నెయ్యి తినే వారి కీళ్లలో జిగురు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్నలోని విటమిన్‌ - డి నరాల బలహీనతను తగ్గిస్తుంది. అందుకే పిల్లలకు వెన్న, నెయ్యితో కూడిన భోజనాన్ని ఎక్కువగా పెట్టాలి.

గుండెకు వెన్న మంచిదే!
లండన్, అక్టోబర్ 24-2013: "వెన్న, చీజ్, గుడ్లు, గడ్డపెరుగు తింటే హృద్రోగాలు వచ్చే ముప్పు ఎక్కువ'' ...సంప్రదాయ ఆంగ్ల వైద్య విధానం చెప్పే మాట ఇది! కానీ, అది ఒట్టి అపోహేనని హృద్రోగాలకూ వెన్న, చీజ్, గుడ్లు, పెరుగుకు ఎలాంటి సంబంధమూ లేదని.. నిజానికి అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని లండన్‌లో భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా సంచలన ప్రకటన చేశారు. హృద్రోగాల ముప్పును తగ్గించుకోవడానికి శాచురేటెడ్ (సంతృప్త) కొవ్వులు అధికంగా ఉండే ఈ తరహా పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోమని చెప్పడం తప్పంటూ ఆయన రాసిన వ్యాసాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఆధునిక వైద్య విధానం నమ్ముతున్నదానికి విరుద్ధంగా.. సంతృప్త కొవ్వుల వాడకాన్ని తగ్గించడమే హృద్రోగాల ముప్పును పెంచుతోందని మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల్లో మందుల వాడకాన్ని.. ప్రత్యేకించి స్టాటిన్ల వాడకాన్ని పెంచుతోందని, అదే సమయంలో మరింత ప్రమాదకరమైన ఎథెరోజెనిక్ డైస్లిపిడెమియా (రక్తంలో కొవ్వుల నిష్పత్తి సరిగా లేకపోవడం) ముప్పు పెరిగిపోతోందని ఆయన వివరించారు.
 
చర్మ సౌందర్యానికి వెన్న :

పెదవులు నల్లగా ఉన్నాయని ఆందోళన పడుతున్నారా... అయితే మీరేం చేయాలంటే.. వెన్న, ఆరెంజ్ రసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేస్తూ వచ్చారంటే లిప్‌స్టిక్ వెయ్యకుంటానా మీ పెదవులు అందంగా, మృదువుగా మారిపోతాయి.
పసిపిల్లలకు స్నానం చేయించటానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేయిస్తే పాపాయి చర్మం కాంతిగా, మృదువుగా ఉంటుంది. వంటిపై సన్నని నూగులాంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి.
వెన్నను ముఖానికి పట్టించి మెత్తటి సున్నిపిండిలో పసుపు కలిపి ముఖం రుద్దుకుంటే చర్మపు వర్చస్సు పెరుగుతుంది.
నలుపు ఛాయలో ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి పేస్టులా తయారుచేసి, నిత్యం ముఖానికి పట్టిస్తే నలుపు తగ్గి, ముఖ చర్మం ప్రకాశవంతమవుతుంది. వెన్నలో గులాబి రెక్కల పేస్టును కలిపి పెదాలకు రాస్తే పెదాలు గులాబీ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
వెన్న, కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి కళ్లక్రింద ఏర్పడిన నల్లని చారలకు, ముడతలకు రాస్తూంటే మచ్చలు తొలగిపోతాయి.
వెన్నలో పసుపు కలిపి మడమలకు, పాదాల పగుళ్లకు రాస్తే దురదమంట తగి, చర్మం మెత్తపడి పగుళ్ళు తగ్గిపోతాయి.
ప్రతిరోజూ వెన్నలో నల్ల నువ్వులు కలిపి, చిన్న మాత్రలా చేసి తింటే వెంట్రుకలు నెరవకుండా నల్లగా ఉంటాయి.
ప్రతిరోజూ ఆహారంలో మొదటి ముద్దలో వెన్న కలిపి తింటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా ఏర్పడవు.
వెన్నలో పసుపు, సున్నం కలిపి కట్టుకడితే గోరుచుట్టు తగ్గుతుంది.
కాలిన బొబ్బల మీద ఆరారగా వెన్న రాస్తే మంట ఉపశమనం.
వెన్నను కనురెప్పలమీద రాస్తే, వెంట్రుకలు రాలిపోకుండా దృఢంగా, అందంగా ఉంటాయి.
బొప్పాయి గుజ్జులో వెన్నను కలిపి ముఖ చర్మంమీద సున్నితంగా మసాజ్ చేస్తే ముఖ చర్మం మృదువుగా మారి, తేమతో కాంతిగా, అందంగా కనిపిస్తుంది.---కె.నిర్మల

  • =======================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment