Monday, June 16, 2014

Similarity in Fruits,పండ్లను పోలిన పండ్లు , డూప్లికేట్‌ పండ్లు ,









పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


భిన్న జాతులకు చెందిన పండ్లు రూపంలో ఒకేలా ఉండటం విశేషం - రూపం అదే... రుచే వేరు. మామిడిపండులానే ఉంటుంది. కానీ మామిడి కాదు. కొబ్బరిబోండాన్నే తలపించినా మరుగుజ్జు రూపం. సీతాఫలంలా కనువిందు చేసినా ఆ రుచి దానికెక్కడ? ఆయా పండ్ల రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న ఈ డూప్లికేట్‌ పండ్ల కథేంటో చూద్దాం! పండుని పోలిన పండ్లూ ఉన్నాయి. రూపం అచ్చు అలాగే ఉన్నా రుచిలోనో సైజులోనో తేడా

మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆయా పండ్ల జాతులు వేరు కావడమే ఇందుకు కారణం.

కాక్విటో నట్స్‌-బుల్లి కొబ్బరి.
ఓ రకం పామ్‌ చెట్టుకి కాసే ఈ కాయల్నే కాక్విటో నట్స్‌ అంటారు. వీటినే మరుగుజ్జు కొబ్బరికాయలనీ మంకీస్‌ కోకోనట్స్‌ అనీ పిలుస్తారు. చిలీ వీటి స్వస్థలం. ఈ చెట్ల నుంచి కారే పాలలాంటి ద్రవాన్ని తేనె, వైన్‌ తయారీలో

వాడతారు. అందంకోసం ఎక్కువగా పెంచే ఈ చెట్ల కాయలు అచ్చం మినీ కొబ్బరికాయల్నే తలపిస్తాయి. రుచి కూడా దాదాపు కొబ్బరిదే. వీటిని పచ్చిగా గానీ ఉడికించి కానీ తింటుంటారు. కొబ్బరి మాదిరిగానే దీని గుజ్జుని

కూడా అన్నిరకాల వంటల్లోనూ వాడతారు.

ప్లమ్‌ మ్యాంగో-చిన్ని మామిడి పండ్లు ,
మాప్రాంగ్‌, ప్లమ్‌ మ్యాంగో అని పిలిచే ఈ పండ్లు చూడ్డానికి చిన్నసైజు మామిడిలానే ఉంటాయి. ఆకులు కూడా అలాగే కనిపిస్తాయి. కానీ, తీపీ పులుపూ కలగలిసిన ఒకలాంటి రుచితో ఉంటాయివి. కాస్తో కూస్తో మామిడినే

తలపించే ఈ చెట్లు ఎక్కువగా ఇండొనేషియా, మలేషియాల్లో పెరుగుతాయి.

పెర్సిమన్‌ పండ్లు -తియ్యని టొమాటో.
చూడ్డానికి అచ్చం టొమాటో పండ్లలా కనిపించినా ఈ పెర్సిమన్‌ పండ్ల రుచి మాత్రం సూపర్‌. వీటిల్లో గ్లూకోజ్‌ శాతం చాలా ఎక్కువ. ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ పండుని నేచురల్‌ స్వీట్‌ అని పిలుస్తారు.

విటమిన్‌-సి, కాల్షియం, ఐరన్‌, పొటాషియంలతోపాటు మరెన్నో విటమిన్లూ ఖనిజాలూ సమృద్ధిగా ఉండే ఈ పండులో ప్రాంతాన్ని బట్టి చాలా రకాలే ఉన్నాయి.

మౌస్‌ మెలన్-పుచ్చదోస.
దీన్ని మెక్సికన్‌ సోర్‌ జెర్కిన్‌ లేదా మౌస్‌ మెలన్‌, సందీతా(స్పానిష్‌లో బుల్లి పుచ్చకాయ అని అర్థం) అనీ పిలుస్తారు. ఒకటిన్నర అంగుళాలు మాత్రమే ఉండి చూడ్డానికి మినీ పుచ్చకాయల్ని తలపించే ఈ కాయలు కొరికి

తింటే మాత్రం అచ్చం కీరా దోసలా కాస్త పులుపుతో కూడిన వగరుతో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు వీటిని ఎక్కువగా తింటారు. తీగకు కాసే ఈ కాయల్ని సలాడ్లలో కూడా వాడతారు. వీటితో పెట్టిన నిల్వపచ్చడి

చాలా రుచిగా ఉంటుందట.

మాతా కుచింగ్‌-రుచిలో ద్రాక్ష... రూపంలో సీతాఫలం.
లేత పసుపురంగులో ఉండే చిన్న సైజు సీతాఫలంలా కనిపిస్తుంది. కానీ అస్సలు కాదు. మాతా కుచింగ్‌గా పిలిచే ఈ పండు వాసన డ్రాగన్‌ ఐ ఫ్రూట్‌ని తలపిస్తే, రుచి మాత్రం ద్రాక్షపండుని పోలి ఉంటుంది. తెరిచి చూస్తే ఒకే

ఒక కన్ను ఉంటుంది. అందుకేనేమో దీన్ని క్యాట్స్‌ ఐ ఫ్రూట్‌ అంటారు. మాతా కుచింగ్‌ అంటే పిల్లి కన్ను అని అర్థమట.

మలక్కా ఆపిల్-జీడిలేని జీడిపండు.
మలక్కా ఆపిల్‌, వాటర్‌ ఆపిల్‌, రోజ్‌ ఆపిల్‌, లిలీపిలీ అనీ పిలిచే ఈ పండ్లు అచ్చం మనదగ్గర కాసే జీడిమామిడి పండ్లను తలపిస్తాయి. దక్షిణాసియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. జామ్‌లూ

జెల్లీలతోబాటు తాజాగానూ వీటిని ఎక్కువగా తింటుంటారు.

ఇవి మాత్రమేనా... టొమాటోలా కనిపించే పేషన్‌పండ్లూ అకాకర లాంటి గాక్‌ పండ్లూ పనస లాంటి డురియన్‌లూ అరటిపండులాంటి ట్యాక్సోలూ... ఇలా మనకు తెలిసినవీ తెలియనవీ ఇంకెన్నో... అయినా భిన్న జాతులకు

చెందిన పండ్లు రూపంలో ఒకేలా ఉండటం విశేషమే.

  • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment