Saturday, July 26, 2014

Non-Nutritive sweeteners,పోషకాలులేని తీపి చేసే పదార్ధాలు

  •  


  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

Non-Nutritive sweeteners,పోషకాలులేని  తీపి చేసే పదార్ధాలు : వీటిని ముఖ్యము గా స్థూలకాయులు-శరీరం బరువు పెరగకుండా , మధుమేహము ఉన్నవారు రక్తము సుగరు పెరగకుండా  , రక్తపోటు ఉన్నవారు కొవ్వు పరిమాణము పెరగకుండా ఉండేందుకు వాడుతారు. వీటిని ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ అని , లో కేలరీ స్వీట్నర్స్ అని , పోషక విలువలు లేని తీపిపదార్ధాలని అంటారు.ఆహారము లో యాడెడ్ సుగర్స్ తీపిదనము కోసము వేస్తారు. ఈ యాడెడ్ సుగరు వలన శరీరము బరువు పెరిగి మదుమేహము , రక్తపోటు , గుండె జబ్బులు వచ్చే అవకాశము అదికమవుతుంది. పంచధారకు బదులు గా స్వీట్నర్స్ వాడవచ్చును ... తీపికి , రుచికి డోకా లేకుండా అన్ని పదార్ధాలలో వీటిని వాడవచ్చును . సైడ్ ఎఫక్ట్స్ ఉండవు.

వీటిలో ముఖ్యము గా:
  •    యాస్పర్ టేమ్‌--Aspartame (NutraSweet® and Equal®)
  •    ఎసిసల్ఫేమ్‌-- Acesulfame-K (Sweet One®)
  •     నియోటేమ్‌--Neotame
  •     సాక్కరిన్‌--Saccharin (Sweet’N Low®)
  •     సూక్రలోజ్ --Sucralose (Splenda®)
  •     స్టెవియా--Stevia (Truvia® and PureVia®)
సార్బిటాల్ (Sorbitol) కూడా స్వీట్నర్ లా పనిచేస్తుంది కాని దీనికి కెలోరిఫిక్ వ్యాల్యు ఉంటుంది. మధుమేహం ఉన్నవారు దీనిని వాడుకోవచ్చును .

  • ============================ 
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment