Monday, August 10, 2009

పచ్చి మిరప , Green chillies

పండ్లు , కాయగూరలు ,గింజలు , పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. మిరపకాయ (చిల్లీ పెప్పర్) అనేది సొలనేసి కుటుంబం, సొలనేసి లోని మిరప కాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాచే ఒక పండు. మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి. కొలంబియన్ ఎక్ఛేంజ్ తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది.
 • మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి , ఘాటు గుర్తుకు వస్తుంది .. కాని మిరప లేకుండా వంట సాగదు , పచ్చి , పండు , ఎండు మిరప లను మనము వాడుతాం . మిరప భారతీయ మొక్క కాదు . మన వారు కారం కోసం మిరియం వాడేవారు .
వైద్యపరంగా : తగు మోతాదు లో మిరప కాయలను గాని మిరప గుండను గాని వాడితే :
 • ఆర్థరైటీస్ నొప్పి,
 • హెర్పెస్ జోస్టర్ సంబంధిత నొప్పి,
 • డయాబెటిక్ న్యూరోపతి,
 • పోస్ట్‌మ్యాస్టెక్టోమీ నొప్పి, మరియు
 • తలనొప్పల ........ నుంచి ఉపశమనం పొందే విషయంలో క్యాప్‌సైసిన్ అనేది ఒక సురక్షితమైన మరియు ప్రభావవంతమైన స్థానిక(Local) నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
 • దీనిలో ఉండే "కాప్సాసిన్(Capsaicin)" కీళ్ళ నొప్పులు , తలనొప్పి , మున్నగు నొప్పులను తగ్గిస్తుంది .
 • కాన్సర్ కణాలను నాశనం చేస్తుంది .
 • స్థూల కాయం ఉన్నా వాళ్లు కి బరువు తగ్గెండుకు ఉపయోగపడుతుంది .
 • పాంక్రియాస్ లోని నరాలు పై పనిచేసి ఆ కణాలు insulin తాయారు చేసేందుకు దోహదపడుతుంది .
 • కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది ,
 • అన్నం తో కనిపి తింటే ఆకలి తగ్గి
 • మధుమేహ ఉన్నా వారికి , ఉబకాయం గల వారికి మేలుచేస్తుంది .
మిరపకాయలు, పచ్చిమిర్చి- - డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
 • భారతీయత, భారతీయ వంటకాలు వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరికైనా గుర్తుకు వచ్చేది మిరప, పచ్చిమిర్చి, పండు మిర్చి ఇవి రెండూ భారతీయ వంటకాల్లో కీలక స్థానం పోషిస్తాయి. నాలుగు వందల ఏళ్ల క్రితం భారతీయులకి మిరప తెలియదు. ఆ రోజుల్లో కారం రుచి కోసం మిరియాల మీదనే ఆధారపడేవాళ్లు. పొడవుగా, మెలికలు తిరిగి వాడిగా కనిపించే మిరపను చూసి, తేలులాగా కుడుతుందని భావించేవారు. పోర్చుగీసు వారు భారతదేశానికి మిరపను పరిచయం చేశారు. తరువాత కాలంలో ఇది భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది.
మిరపలోని గుణాలను బట్టి ఆయుర్వేదం దీనిని కటువీర, రక్తమిర్చి, పిత్తకారిణి, లంక తదితర పేర్లతో వ్యవహరిస్తుంది. మిరప చెట్టులో అనేక రకాలున్నాయి. ముఖ్యంగా తెల్లపువ్వులు కలిగిన మొక్క మొదటిరకం. దీనిలో తీక్షణత ఎక్కువ. ఆకుపచ్చని పువ్వులు కలిగినది రెండవ రకం. దీనిలో తీక్షణత తక్కువ. మిరప పండ్లు, కాయల్లో చాలా తేడాలున్నాయి. ఆకారాన్నిబట్టి, ఆకృతిని బట్టి, రంగును బట్టి, రుచిలో తీక్షణతను బట్టి మిరపకాయలు, పండ్లు రకరకాలుగా లభిస్తున్నాయి. అవసరాన్నిబట్టి వీటిని వాడుతుంటారు. మిరపలో ‘క్యాప్పైసిన్’ అనే పదార్థం తాలూకు మొత్తాన్నిబట్టి దీని తీక్షణత ఆధారపడి ఉంటుంది. మిరపలోని ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. లాలాజలంలో పిండి పదార్థాలను పచనం చెందిందే సెలైవరీ ఎమైలేజ్ ఉంటుంది. ఈ కారణంగానే భక్ష్యాలను వండేటప్పుడు మిరపను తగలనిస్తే, అవి చక్కగా జీర్ణమవుతాయి. మిరపలో విటమిన్-ఎ, విటమిన్-సి తదితర పదార్థాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి హితం చేస్తాయి. మిరప శరీరంలో పేరుకుపోయిన విష తత్వాలను నిర్వీర్యపరుస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగులో సంచితమైన హానికర విష రసాయనాలను శుభ్రం చేస్తుంది. అలాగే మిరప రక్తశోధకంగా కూడా పని చేస్తుంది. మద్రాస్‌కి చెందిన కేన్సర్ రీసెర్చ ఇన్‌స్టిట్యూట్ పచ్చిమిర్చిలో కేన్సర్‌ను నిరోధించే అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ధృవీకరించింది.
 • గృహ చికిత్సలు
 • గొంతు బొంగురు (స్వర భంగం)--ఒక టీ స్పూన్ పంచదారను, ఒకటి రెండు బాదం గింజలను, ఒక పండు మిరపకాయను కలిపి దంచండి. దీనిని చిన్నచిన్న ఉండలుగా తయారుచేసి తీసుకుంటే గాయకులకు, ఉపన్యాసకులకు, టీచర్లకు, లెక్చరర్లకి గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది.
 • కడుపు నొప్పి--100 గ్రాముల బెల్లంలో ఒక గ్రాము ఎర్ర మిరప పొడిని కలిపి చిన్నచిన్న మాత్రలుగా తయారుచేసి నీళ్లతో తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. అర గ్రాము ఎండు మిరప పొడిని 2 గ్రాముల శొంఠి చూర్ణంతో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి.
 • అరుచి--125 గ్రాముల మిరపగింజలను అర కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకూ వేడి చేయండి. తరువాత వడపోసి సీసాలో నిల్వ చేసుకోండి. మిరప గింజల తైలం సిద్ధమవుతుంది. శరీరంలో వేడి పెరిగిపోవటం, పైత్యం పెరగటం వంటి సమస్యల వల్ల ఆహార పదార్థాల రుచి తెలియకపోతుంటే, ఆకలి తగ్గితే, ఈ మిరప గింజల తైలాన్ని 5 నుంచి 30 చుక్కలు ఒక టీస్పూన్ పంచదారతో కలిపి తీసుకోండి. దీంతో ఆకలి పెరుగుతుంది.
 • కలరా (వాంతులు, విరేచనాలు)--మిరప గింజలను చెరిగి శుభ్రం చేసి, మెత్తగా పొడిచేసి గుడ్డతో వస్తగ్రాళితం చేయండి. దీనిని ఒక చిటికెడు తీసుకొని చిటికెడు కర్పూరం, చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని కలిపి, తగినంత తేనె కలిపి తీసుకోండి. లేదా వీటి మిశ్రమాన్ని 125 మిల్లీగ్రాముల మాత్రలుగా చేసి నిల్వ చేసుకొని ప్రతి రెండు గంటలకూ ఒక్కోటి చొప్పున నీళ్లతో వేసుకుంటే కలరా వ్యాధిలో నాడి తగ్గిన సందర్భాల్లో నాడి వేగం పెరుగుతుంది.
నల్ల మందు, పొంగించిన ఇంగువ వీటిని సమంగా కలిపి 125 మి.గ్రా. మాత్రలుగా చేయండి. దీనిని మిరప కషాయంతో తీసుకుంటే కలరా వ్యాధి తగ్గుతుంది. 125 గ్రాముల మిరపకాయలను అర కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకూ వేడి చేయండి. తరువాత దించి వడపోసి నిల్వ చేసుకోండి. మిరప తైలం సిద్ధం. కలరాలో విరేచనాలు, వాంతుల తరువాత ఈ తైలాన్ని పూటకు అర టీస్పూన్ మోతాదుగా రెండు మూడు పూటలు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎండు మిరపకాయల పొడిని తేనెతో కలిపి రేగు గింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకోండి. కలరా వ్యాధిగ్రస్థునికి గంటకో మాత్ర చొప్పున చన్నీళ్లతో ఇస్తే ప్రమాదం నుంచి బయటపడతాడు.
 • మధుమేహం --మిరియం తైలాన్ని రెండు మూడు చుక్కలు లస్సీతోకలిపి తీసుకుంటే మూత్రంలో మంట, మూత్రంలో సుద్ద పోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
 • మూత్రంలో మంట--3 గ్రాముల ఈసబ్‌గోల్ గింజల పొడిని మూడు నాలుగు చుక్కలు మిరప తైలంతో కలపండి. దీనిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే పైత్యం కారణంగా వచ్చిన మూత్రంలో మంట తగ్గుతుంది.
 • ఎగ్జిమా, దురద, కీళ్లనొప్పి, కుక్కకాటు, కందిరీగ కాటు వంటి సమస్యల్లో మిరప పండ్ల తైలాన్ని పై పూతగా వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

 • మేలు చేసే మిర్చి
పచ్చి మిర్చి అనగానే నషాళాన్నంటే కారమే గుర్తుకొస్తుంది. కానీ పచ్చిమిర్చి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకీ, ప్రొటీన్లకీ పెట్టింది పేరు. మిర్చిలో విటమిన్‌ 'ఎ', 'సి'లతో పాటూ రక్తహీనత రాకుండా చేసే ఇనుమూ, గుండె జబ్బులు రాకుండా చేసే పొటాషియం, క్యాన్సర్‌ కారకాలతో పోరాడే బీటా కెరొటిన్‌ వంటి పోషకాలుంటాయి. పచ్చి మిరపలో ఉండే పోషకాలు అజీర్తి సమస్య ఏర్పడకుండా కాపాడతాయి. కెలొరీలని కరిగించి జీవ క్రియలు వేగంగా జరిగేట్టు చూస్తాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తగిన మోతాదులో పచ్చి మిరపకాయలు ఆహారంలో తీసుకుంటే ఉపశమనం పొందుతారు. వీటిల్లో పుష్కలంగా ఉండే 'ఎ' విటమిన్‌మెరుగైన కంటిచూపూ... ఎముకలూ, పళ్ల బలానికి సాయపడుతుంది.
 • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com

No comments:

Post a Comment