Monday, August 10, 2009

తేనె , Honey

 • పండ్లు , కాయగూరలు ,గింజలు , పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.  
 •  
తేనే ప్రక్రుతి సిద్దం గా దొరికే అపురాపమైన ఔషధము . తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపము లో మనకి (వాటికోసమే అనుకోండి) అందిస్తున్నాయి .
 • తేనే లో ఉన్నా విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును,
 • నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును ,
 • యాన్తి బ్యాక్తెరియాల్ , యాన్తి సెప్టిక్ గునాలున్నందున చర్మము పై పూసిన ,.. గాయాలు మానును .
 • తేనే ... వెనిగర్ తో కలిపి 'vermifuge ' గా వాడుదురు .
 • రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది .
 • రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తూన్ది .
 • నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది .
 • తేనే లో కొచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది .
 • రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచం శనగపిండి కలుపుకొని ముఖంనికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది .
 • తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి .
 • రోజు పావు గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితేఒళ్లు తగ్గుతుంది.
 • తేనె చరిత్ర : history of honey
ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనెపట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే కాడు తేనె సంగతి సరేసరి. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోననే భయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. స్పెయిన్‌లోని వలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవి తేనె వేటకు సంబంధించిన చిత్రాలున్నాయి. ఇవి 8 వేల సంవత్సరాల నాటివని చారిత్రకులు నిర్ధారించారు కూడా.నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది. రెండు వందల సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడయినప్పటికీ భార్య, సహాయకురాలి సాయంతో రాణిఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? తేనెపట్టుపై ఉన్న రంధ్రాల సైజును చూసి కూలి మగ ఈగలను, వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో హ్యూబర్ వివరంగా తెలియజేసారు. సహజంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో సాధారణంగా కనిపించే అడవి తేనెటీగల రకాల్లో అపిస్ దోర్సలా, అపిస్ సెరెనా ఇండికా, అపిస్ ఫ్లోరియా, డ్యామెస్ బీ లేదా స్ప్రింగ్‌లెస్ బీ అనేవి ముఖ్యమైనవి. వీటికి తోడు ఐరోపానుంచి దిగుమతి చేసుకున్న అపిస్ మెల్లిఫేరా విదేశీ జాతి. ప్రపంచవ్యాప్తంగా కనిపించే తేనెటీగ రకాలు ఇవి. వీటిలో మొదటి రకం తేనెను సేకరించే వారు చాలా ఎత్తయిన చెట్లకు నిచ్చెనలు కడతారు. పక్కచెట్టునుంచి ఇంకో చెట్టుకు పొడవాటి తాడు వేసి దాటుతూ పోతూ రాత్రిపూట తేనెపట్టులను కొడుతూ ఉంటారు. గతంలో ఇలాంటి పెద్ద తేనెటీగల తేనెపట్టునుంచి 70 కిలోల దాకా తేనె లభించిన సందర్భాలు కూడా ఉన్నాయని దాదాపుగా 45 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉండిన శ్రీపతి భట్ అంటారు. అప్పట్లో సగటున ఒక్కో తేనెపట్టునుంచి 15నుంచి 20 కిలోల దాకా తేనె లభించేది. అది ఇప్పుడు 5నుంచి 10 కిలోలకు తగ్గిపోయిందంటారాయన. మిగతా రకాల తేనెలదీ అదే పరిస్థితి. పాతికేళ్ల క్రితం తేనెకు గిరాకీదారులే ఉండేవారు కాదు. చాలా దూరంనుంచి ఒకరిద్దరు దళారీలు వచ్చే వారు. ఒక్క ఉత్తర కన్నడ జిల్లాలోనే ఏడాదికి 400 టన్నుల తేనె లభిస్తూ ఉండేదని చాలా ఏళ్లుగా అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేసే నాసిర్ ఖాన్ గతాన్ని గుర్తు చేసుకుంటూ అంటారు.
 • చెడు గుణాలు :
తేనే సుద్దిచేయకుండా వాడకూడదు  . దీనిలో అనేక సుక్ష్మ జీవులు ఉంటాయి . తేనే లోగల 'బొటులినియం ఎన్దోసపొర్స్" చిన్నపిల్లలకు హానిచేయును .. ఒక సం. లోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్(tutin) అనేది  విషపదార్దము - - శరీరమునకు మంచిదికాదు .

ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ద ఔషధం "తేనె"(హనీ). తేనెలో ఉన్న ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. మరి అలాంటి ఔషధం నేడు విషంగా మారిందా..?! అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. "అన్ని రోజులు ఒకలా ఉండవు" అన్న సామెత మాదిరిగా "అన్ని కంపెనీల తేనెలు ఒకలా ఉండవు" అని చెబుతున్నారు పరిశోధకులు. ప్రముఖ దేశీయ, విదేశీయ బ్రాండ్లు "ప్యూర్ హనీ" అంటూ విక్రయిస్తున్న తేనెలో అధికశాతంలో యాంటీబయొటిక్స్ ఉంటున్నాయని, వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) హెచ్చరిస్తోంది. కొన్ని భారతదేశపు బ్రాండ్‌లలో ఉండాల్సిన దానికన్నా అధికంగా రెండు నుంచి నాలుగు వరకూ యాంటీబయొటిక్స్ ఉన్నాయని సీఎస్ఈ కాలుష్య పర్యవేక్షణ ల్యాబొరేటరీ కనుగొంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ బ్రాండ్లు కూడా తేనెలో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడుతున్నారని సీఎస్ఈ తెలిపింది. ఇప్పటి వరకూ 12 కంపెనీలకు చెందిన తేనెలను పరిశీలించిన సీఎస్ఈ వాటిల్లో ఆరు రకాల యాంటీబయోటిక్స్ వాడినట్లు గుర్తించింది. "అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయోటిక్స్‌ను వీలైనంత వరకూ నియంత్రిస్తున్నాయి. కానీ మన దేశంలో ఉపయోగించే వాటిలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేదు. ఇందుకు నిర్లక్ష్యం ఒక్కటే కారణం." యూరప్, అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన, నిర్ధిష్టమైన నిబంధనలు ఉంటాయి. కానీ మన దేశంలో ఇవేమి ఉండవు. అందుకే చాలా వరకూ విదేశాల్లో భారతీయ తేనె ఉత్పత్తులను నిషేధిస్తున్నారని సీఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ అన్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణే.. భారత ఎగుమతుల తనిఖీ కౌన్సిల్(ఈఐసీ) విదేశీ మార్కెట్‌లో విడుదల చేసే తేనె ఉత్పత్తులలో నిర్ణీత యాంటీబయోటిక్స్ మాత్రమే వాడాలని షరతులు పెట్టింది. కానీ దేశీయ మార్కెట్‌లో విక్రయించే తేనె ఉత్పత్తులకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు.
 • అసలు అధిక యాంటీబయోటిక్స్ ఉంటే సమస్యలేంటి..?
తేనెను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు గానూ యాంటీబయోటిక్స్‌ను వాడుతుంటారు. మోతాదుకు మించిన యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీబయోటిక్స్ పేరుకు పోయి మొత్తం అవయవ వ్యవస్థనే అస్తవ్యస్తం చేస్తుంది. ఇది ముఖ్యంగా ఐదు వత్సరాలలోపు పిల్లలో అధికంగా ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద ఆయుర్వేద కంపెనీలలో ఒకటైన ఓ కంపెనీ ఉత్పత్తిలో మూడు రకాల యాంటీబయోటిక్స్‌ను గుర్తించారు. ఈ ఉత్పత్తుల్లో ఈఐసీ ప్రతిపాదించిన దాని కన్నా 9 రెట్లు అధికంగా యాంటీబయోటిక్స్‌ ఉన్నట్లు వారు తెలిపారు. ఇందులో "ఆక్సీటెట్రాసైక్లిన్" అనే యాంటీబయోటిక్ ఉంటుంది. ఈ యాంటీబయోటిక్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సంబంధమైన వ్యాధుల్ని కలిగిస్తుందని వారు చెబుతున్నారు. అంతే కాకుండా లివర్‌కు కూడా హాని తలపెడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మన తేనె ఉత్పత్తుల స్టాండర్డ్ ఏంటో యూరప్ వాళ్లకు బాగా తెలుసు కాబోలు.. అందుకే 27 దేశాలలో వాళ్లు మన భారతీయ తేనె ఉత్పత్తులపై నిషేధం విదించారు. ఇది చూసైనా మన ప్రభుత్వం చలించలేదు కదా..! కాబట్టి హనీ హాని కలిగించగలదు. సో.. "ప్యూర్ హనీతో బి కేర్‌ఫుల్".

తేనె - ఆయుర్వేదము : మూలము ->డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
 • తెగిన గాయాలకు తేనె:
తేనెకు పిచ్ఛిలత్వం, స్నిగ్ధత్వం, అధిక సాంద్రత, శోధహరం తదితర లక్షణాలవల్ల గాయాలను త్వరితగతిన మానేలా చేస్తుంది. తేనెకు ఉండే పిచ్ఛిలత్వం అనే గుణంవల్ల వ్రణం మీద విస్కస్ పొరగా పరుచుకొని రక్షణనిస్తుంది. శోధహరంగా కూడా తేనె పనిచేసి గాయాలను త్వరితగతిన మానేలా చేస్తుంది. తేనె సాంధ్రత ఎక్కువ కాబట్టి అస్మాసిస్ ప్రక్రియ కారణంగా కణజాలాల్లోని అదనపు జలీయాంసం వెలుపలకు వచ్చేసి శోధ తగ్గుతుంది. తేనెలో ప్రోటీన్ ఉండదు కాబట్టి దానిని ఆశ్రయించి పెరిగే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వృద్ధిచెందవు. తేనెతో యాంటీ బయాటిక్స్‌తో మాదిరిగా అవాంఛిత లక్షణాలు కూడా కనిపించవు.
తేనెను డ్రస్సింగ్‌కోసం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాడాలి. సుమారు 10 సెంటీమీటర్లు ఉండే వ్రణానికి 20మిల్లీలీటర్ల తేనె అవసరం అవుతుంది. ముందుగా డ్రస్సింగ్ ప్యాడ్‌ని వ్రణం మీద పరిచి తేనెను ప్రయోగించాలి. ప్యాడ్ మీద తేనె దుస్తులకు అంటుకోకుండా ఉండటంకోసం అవసరమైతే దానిమీద మరో ప్యాడ్‌ని ఉంచి ప్లాస్టిక్ పొరను పరవాలి. ప్రతిరోజూ డ్రస్సింగ్ ఇదే పద్ధతిలో మార్చుతుండాలి.
 • మొటిమలు: తేనె (15 భాగాలు), దాల్చిన చెక్క పొడి (1 భాగం)... ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పూట 2వారాలపాటు ప్రయోగిస్తే మొటిమలు తగ్గుతాయి.
 • కీళ్ల నొప్పి: 2 చెంచాలు తేనెను కప్పు దాల్చిన చెక్క కషాయానికి కలిపి పుచ్చుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది.
 • కాలిన గాయాలు: తేనెకు పసుపును చేర్చి బాగా కలిపి పై పూతగా ప్రయోగిస్తే అగ్నిదగ్ధ వ్రణాలు మచ్చపడకుండా ఇనె్ఫక్షన్‌కి గురికాకుండా త్వరగా తగ్గుతాయి.
 • జలుబు, దగ్గు, గొంతునొప్పి: తేనె (4్భగాలు), పిప్పళ్ల పొడి (1 భాగం), మిరియం పొడి, లవంగాల పొడి, జీలకర్ర పొడి కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • పెదవుల పగుళ్లు: 2 భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి.
 • పిల్లల్లో విరేచనాలు: తేనెకు జాజికాయ పొడిని కలిపి ఇస్తే అతిసారం తగ్గుతుంది.
వ్యాయామ సమయంలో నీరసం రాకుండా ఉండటంకోసం: 2 చెంచాల తేనెను గ్లాసు నీళ్లకు చేర్చి వ్యాయామం ముందు తీసుకుంటే వ్యాయమ సమయంలో నిస్త్రాణ, నిస్సత్తువలు రాకుండా ఉంటాయి.
 • జుట్టు ప్యాచ్‌లాగా ఊడిపోతే: తేనె(3 భాగాలు), దాల్చిన పొడి (1 భాగం), ఆలివ్ నూనె (తగినంత)... ఈ నిష్పత్తిలో కలిపి తలమీద ప్రయోగించి పావుగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే ఎలోపీషియా (ఇంద్రలుప్తం)లో చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.
 • వ్యాధి నిరోధకశక్తి పెరగడానికి: 3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి పుచ్చుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
 • పంటి నొప్పి లేదా దంతశూల: 3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి చిగుళ్ల పైన ప్రయోగిస్తే వాపు తగ్గి దంతశూల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • స్థూలకాయం: చెంచాడు దాల్చిన చెక్క పొడిని 2 గ్లాసుల నీళ్లకు చేర్చి అరగ్లాసు కషాయం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మూడు టీస్పూన్లు తేనెను కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా పుచ్చుకుంటూ ఉంటే స్థూలకాయంలో మంచి ఫలితం కనిపిస్తుంది.
 • ముఖంమీద మంగు మచ్చలు: తేనెకు తగినంత పాల పొడి కలిపి ఫేస్‌మాస్క్ మాదిరిగా పెట్టుకుంటుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 • ముఖంమీద మృతకణాలను తొలగించడానికి: తేనెను బాదం పప్పు పొడికి కలిపి పేస్టుగాచేసి ముఖం మీద ప్రయోగించి రుద్దుకోవాలి. ఇది చక్కని స్క్రబ్‌గా పనిచేస్తుంది. చర్మంమీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 • ముఖ చర్మం స్నిగ్ధంగా తయారుకావడానికి: తేనె (3 భాగాలు), కోడిగుడ్డు తెల్లసొన (1 భాగం), గ్లిజరిన్ (1 భాగం), మసూర్‌దాల్ (ఎర్ర కందిపప్పు) తగినంత... ఈ నిష్పత్తిలో కలిపి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగించాలి.
 • వృద్ధాప్యం: వృద్ధాప్య సమస్యల్లో తేనె చక్కగా ఉపయోగపడుతుంది. తేనె జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని సేద తీరేలా చేస్తుంది. మెదడును నిశ్శబ్దపరుస్తుంది. చర్మాన్ని బిగువుగా చేస్తుంది. చిన్నపాటి నొప్పులను దూరంచేస్తుంది. ఒక జగ్గులో 3 కప్పుల తేనెను, 2 కప్పుల సిడర్ వెనిగార్‌ని, 1 కప్పు నీళ్లను కలపాలి. దీనిని ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు చొప్పున తాగుతుంటే వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటుంది.
 • రక్తహీనత: ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు తేనెను వాడి ప్రయోజనం పొందవచ్చు. తాజా ఆకుకూరల మీద తేనెను పరిచి తీసుకుంటుంటే హితకరంగా ఉంటుంది. రక్తహీనత క్రమంగా దూరమవుతుంది.
 • కీళ్లనొప్పి: 1 లీటరు వేడి నీళ్లకు 1 కప్పు తేనెను, అరకప్పు నిమ్మ రసాన్ని చేర్చి నూలు గుడ్డను ముంచి నొప్పి, వాపు ఉన్నచోట కీలుమీద పరిస్తే ఉపశమనం లభిస్తుంది.
 • నోటి దుర్వాసన: ఒక బాటిల్‌లో మూడువంతులు సిడర్ వెనిగార్‌ని నింపి, కప్పు తేనెను కలపాలి. బాగా గిలకొట్టాలి. దీనిని ఆహారం తర్వాత వౌత్‌వాష్‌గా పుక్కిట పట్టాలి. చివరగా నీళ్లతో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.
 • శయ్యావ్రణాలు (బెడ్ సోర్స్): ఒక సీసాలో 2చెంచాల తేనెను, ఒక చెంచాడు బీట్‌రూట్ రసాన్ని కలిపి కొద్దిగా మొక్కజొన్న పిండిని కూడా కలిపి శయ్యావ్రణాల మీద ప్రయోగించాలి. తరువాత బ్యాండేజితో కప్పి ప్రతి రోజూ మారుస్తుండాలి.
 • శయ్యామూత్రం (బెడ్ వెట్టింగ్): చిన్నపిల్లలు పక్క తడుపుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల తేనెను పిల్లలకు రెండుపూటలా ఇస్తుండాలి. సాయంత్రం అదనపు నీళ్లను నియంత్రించాలి.
 • సెగ గడ్డలు: రెండు చెంచాలు తేనెను, కోడిగుడ్డు తెల్లసొనను, గోధుమ పిండిని కలిపి పేస్టుమాదిరిగా చేసి సెగ్గడ్డమీద పూసి పైన గుడ్డతో కట్టుకట్టాలి. రాత్రి పగలూ సెగ గడ్డ పగిలి చీము స్రవించేవరకూ దీనిని మార్చుతుండాలి.
 • బ్రాంకైటిస్, దగ్గు: తేనెను వేడి పాలకు గాని, కాఫీకి గాని లేదా టీకి గాని కలిపి పుచ్చుకుంటే గొంతులో అసౌకర్యంలో ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లు ఉండటం తగ్గుతుంది.
 • పొడి దగ్గు: చెంచాడు అల్లం రసానికి చెంచాడు తేనెను కలిపి మూడు పూటలా పుచ్చుకుంటూ వుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.
 • కాలిన గాయాలు: స్టౌవద్ద కాలిన గాయాలకు, వేడి నీళ్లుపడటంవల్ల కాలిన గాయాలకు తేనెను నేరుగా ప్రయోగించవచ్చు. గాటుపడకుండా గాయం మానుతుంది.
 • చర్మం పగుళ్లు: మోచేతులు, పాదాల వంటి భాగాల్లో చర్మం పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటే తేనె, నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి ప్రయోగించాలి.
తేనె వాడకూడని సందర్భాలు
 • * మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.
 • * తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. (తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి. .)
 • * మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.
 • * తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.
 • * తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.
 • * తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు (సంయోగ విరుద్ధం).
తేనె లో రకాలు :
తేనె సంపూర్ణ పోషక పదార్ధమని , తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలుసుకున్నాక దానిని సేకరించిన తీరు , నిలువచేసేందుకు వాడిన విధానాలబట్టి పలు రకాలుగా విభజించారు .
 • అడవి తేనె : ఇది అత్యంత సహజమైనది . అడవిలో లభించే అన్నిరకాల పూలనుండి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి గకుక చాలా మంచిది .
 • ఒకే పూవు తేనె : ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది . ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచి లో ఉంటుంది . తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూలమొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు .
 • మిశ్రమ తేనె : మార్కెట్ లొ అధికంగా అమ్మే తేనె ఇదే. నాలుగయిదు రకాల తేనెలను భిన్నరుచులు , రంగులు కలిగినవి కలిపేస్తారు ఈ మిశ్రం తేనెలో . రంగు , రుచి ని బట్టి రకరకాల పేర్లు పెడతారు .
 • పుట్ట తేనె : ఇది తేనె పట్టులను అలానే తీసుకువచ్చి అందులోని తేనెను సేకరించి వెనువెంటనె అందించేది . దీనిని తాజా తేనె గా భావించాలి .
 • నిలువతేనె : తేనెను నిలువ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. పాలను పాశ్చరైజ్ చేసిన తీరునే తేనెను పాశ్చరైజ్ చేస్తారు . దానిలోని సూచ్మజీవులను తొలగించి , దానిలోని ఎంజైమ్‌ ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనె ఎక్కువకాలము నిలువ ఉంచేలా చే్స్తారు . ఈ ప్రక్రియలో తేనెను వేడిచేయడం జరుగుతుంది . వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి . దానిని అధిగ మించేందుకు నేడు ఆల్ట్రాసొనిక్ తేనెను తయారుచేస్తున్నారు . దీనివలన తేనె పులియకుండా ఉంటుంది .
 • ఎండు తేనె : ఇది మరో ప్రత్యేకమైనది . తేనెను ఘన రూపమ్లో తయారుచేస్తారు . ఇది చిన్నచిన్న ముక్కలుగా వస్తాది . చేతికి అంటుకోదు .
తేనెటీగలు :
ఇక మానవుని సేవలో మధుర్యాన్ని నింపు తున్నవి తేనెటీగలని చెప్పవచ్చు. తేనె దాని వినియోగం అందరికీ తెలిసి ఉన్నప్పటికీ, ప్రకృతిలో మానవునికి ఉపయోగపడే క్రిమి కీటకాల్లో ఇవి కూడా తమవంతు ఉపయో గాన్ని అందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వీటిలో ఇప్పటి వరకూ 7 జాతుల్ని కనుగొన్నారు. అవికాక ఈ తేనెటీగల ఉపజా తులు 44 రకాల వరకూ ఉన్నాయి. కానీ చారిత్రకంగా ఎక్కడివైనా 6 నుంచి 11 జాతుల్ని గుర్తించడం జరిగింది. ఇవి సేకరిం చిన తేనె ఉత్పత్తులు దేశదేశాల్లో వాడుకలో ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తేనె ఎంతో ప్రాధాన్యతని సంతరించుకున్న విష యం అందరికీ విదితమే. వీటి ఆధారిత పరి శ్రమలు ఎన్నో వెలిసాయి. నిత్యం కొన్ని వేల టన్నుల తేనె ప్రపంచం నలుమూలలకీ ఎగు మతి అవుతోందంటే నమ్మసక్యంగా ఉండదు. కానీ, చాక్లెట్లు, కేకులు, ఇతర ఆహార పదార్థాల తయారీ కంపెనీలు తేనెని విస్త్రు తంగా వినియోగిస్తున్నాయి. తేనెటీగల పెంపకం కూడా చాలా మంది చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు. అయితే పెంపకంలో ఉపయోగపడే తేనెటీగలు రెండు రకాలు. అవి ఒకటి మెల్లిఫిరా జాతి, రెండవది సిరానా జాతి. ఒక క్రమ పద్దతిలో వీటిని పెంచి తేనె సేకరించి ఎగుమతి చేస్తు న్నారు. అంతేకాకుండా ఈ తేనె పట్టునుంచి లభ్యమయ్యే మరో ఉప ఉత్పత్తి  మైనం. దీని వినియోగం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిని శుద్ధిచేసి, అనేక అవసరాలకి వినియోగిస్తున్నారు. ఫర్నిచర్‌కి వేసే పాలిష్‌లో దీనిని వాడతారు. గృహనిర్మాణాల్లో చిన్న చిన్న బీటలు పూడ్చడానికి మైనం జిగురు వాడతారు. తేనెటీగలు పట్టు నిర్మించే సమయంలో చెట్టు కొమ్మన ఆ పట్టు గట్టిగా పట్టి ఉండడానికి, ఇతర కీటకాలు ఇందులో చొరబడకుండా ఉండడానికీ అను వుగా ఈ ఈగలు ఒక రకమైన జిగురు పదార్థాన్ని విడు దలచేస్తాయి. ఏ ఇతర కీటకం అందులో ప్రవేసిం చినా అతుక్కుపోయి ప్రాణాలు కోల్పోతుంది. అలాగే చెట్టు నుంచి ఎంతటి గాలి దుమారం వచ్చినా జారిపోకుండా గట్టిగా ఉంటుంది. ఈ రసాయనాన్ని కూడా గృహనిర్మాణంలో బీటలు పూడ్చడానికి వినియోగిస్తున్నారు.

తేనెతో అజీర్తి దూరం:

    తేనెను చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు. సహజంగా లభించే తేనె రుచికే కాదు ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది. దానికి కొన్ని పదార్థాలను జోడించి తరచూ తాగడం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

పాలతో: ఒక కప్పు వేడి పాలలో, చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారవుతారు. కడుపులో క్రిములను, పుండ్లను తగ్గించడానికి, రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషధం. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.

నోటి పొక్కులకు: రెండు చెంచాల తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం, చిటికెడు ఉప్పు బాగా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోట్లో పొక్కులు, దుర్వాసన తగ్గుతాయి.

తేనె టీ: పొద్దున్నే కాఫీ, టీలకు బదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పరగడుపున కప్పు వేణ్నీళ్లలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి. అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం. రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసంతో:
కప్పు వేణ్నీళ్లలో కొంచెం నిమ్మరసం, చెంచా తేనెను బాగా కలపాలి. కాలేయ సమస్యలున్న వాళ్లు దీన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. శరీరం మీద మచ్చలు చాలా తేలిగ్గా తగ్గుతాయి. పడుకునే ముందు తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

మూలాలు : వివిధ వార్తా పత్రికల నుండి విషయ సేకరణ్ . (డా. వందన శేషగిరిరావు ...శ్రీకాకుళం)
 • =====================
 visit my website : Dr.Seshagiriao.com

No comments:

Post a Comment