Monday, August 10, 2009

wallnuts , వాల్ నట్స్

walnut ని తెలుగు లో అక్రూట్ కాయ గింజలు అంటాము . వాల్ నట్ శాస్త్రీయ నామము " జుగ్లాన్స్ రెజియా (jugulans Regia) అంటారు . ఇందులో ఎన్నో రకాల జాతులు (species) ఉన్నాయి. వయసు తో పాటు కొన్నీ శారీరక రుగ్మతలు ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి . వాటిని ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదపులో ఉండి జీవితతం సాఫీగా సాగిపోతుంది. పౌష్టికాహారపదార్ధములలో వాల్ నట్స్ (అక్రోట్ కాయల గింజలు) వలన ఎన్నో ప్రయోజనాలు కలవని వెల్లడైనది . వైద్యపరముగా ఉపయోగాలు :
  • పెద్ద వయసు లో అవసరమయ్యే న్యూరో న్యూట్రిషన్స్ బాగా సరఫరా చేస్తాయి.
  • అల్లిబిల్లి గా ఉండే న్యూరోట్రాన్సు మీటర్లు , గ్రాహకప్రోటీన్లు ,సూచనలు అందించే పరమాణువులు , ఎంజైంస్ , హార్మొన్లు , జన్యుసంబంధ పదార్ధాలన్నీక్రమబద్దమవుతాయి.
  • ఇందులో ఉన్న ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్స్ , ఫోలిక యాసిడ్ , విటమిన్‌ -ఇ , పాలిఫినాల్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి .
  • గుండెకు మేలు --- వాల్ నట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . ఎల్.డి.ఎల్ .కొలెస్టిరాల్ బాగా తగ్గిపోతుంది . ఇది గుండె కు మేలు . చేపలు తింటే ట్రిగ్లిసరైడ్స్ పరిమాణము తగ్గి హెచ్ .డి.ఎల్ కొలెస్తిరాల్ పెరుగుతుంది . అదే వాల్నట్స్ తీసుకుంటే మొత్తం కొలెస్తిరాల్ పైన తీవ్రప్రభావము చూపుతుంది ... ఎల్.డి.ఎల్. ప్రమాణము బాగా తగ్గుతుంది .
  • రకరకాల ఒత్తిడి వల్ల శరీరములోకి మంటపుట్టించే సమ్మేళనాలు ఎక్కువగా ఏర్పడతాయి . అలాగే వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది . దీనివల్ల వయసు ప్రభావానికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. చేపలు , వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 ఫ్యాట్స్ పలురకాల మంటలను కలిగించే జీవరసాయనాల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
  • రొమ్ముకాన్సర్ నిరోధిని : వాల్ నట్స్ లో ఉన్న ఫిటోస్టరాల్ వల్ల కాన్సర్ కణితిని తగ్గించే గుణము కలదు .
  • ఎక్కువ మోతాదులో ఉన్న యాంటీఆక్షిడెంట్స్ వలన వాల్ నట్స్ శరీరం లోని ఫ్రీ రాడికిల్స్ ని , మృతకణాలను తొలగించి జీవణ ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది .
  • అక్రూట్ కాయలు (వాల్ నట్స్): అక్రూట్ కాయలలోని ఒమేగా-3 - ఫ్యాటీ ఆమ్లాలు వత్తిడిని తగ్గించి మనలోని నెగటివ్ భావనలను తొలగిస్తాయి.
వాల్ నట్ చెట్లు ప్రపంచములో అన్నిచోట్లా పెరుగుతాయి . మొదట వీనిటి అమెరికాలో గుర్తించారు . వీటిలో సుమారు 20 రకాల జాతులు ఉన్నాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగులు పొడవు వరకూ పెరుగును . ఈ చెట్లు "Allelo chemical " అనే విషపదార్ధము వెదజల్లడము వలన ఇతర మొక్కలు , చెట్లు వీటి చుట్టుప్రక్కల బ్రతకలేవు . ఆ విధముగావీటి వ్యాప్తిని అధికము చేసుకుంటాయి.

1 comment: