Monday, November 9, 2009

ఉల్లి , Onion

ఉల్లిపాయ (Onion) కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతి కి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలొ వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడ ఇదే ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్‌ అని, ఇంగ్లీషులో ఆనియన్‌ అని అంటారు. తెలుగులో దీనిని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీనిని నీరుల్లిపాయ అనడం సరైనది. నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ, వర్ష రుతువులోనూ దీనిని సాగు చేస్తారు. దీనికి విత్తనాలుగా దుంపలను, గింజలను కూడా వాడవచ్చు. దీని ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్యలో ఒక కాండం ఉండి, దాని చివర పూలగుత్తి ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడుతాయి. ప్రతి మొక్కకు భూమిలో ఒకటినుంచి మూడు వరకూ దుంపలు ఏర్పడుతాయి. ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది . ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది . దీనిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి . ఇది ఆసియా లో పుట్టిందని కొందరంటే ... పాకిస్తాన్ లో పుట్టిందని కొందరంటారు . ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది . పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్(Aphrodisiac) గా పనిచేయును . ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. టేస్తోస్తేరాన్(testosteron) , ఇన్సులిన్ (insulin) , గ్రౌత్ హార్మోన్(GrowthHormone),ఆక్షితోసిక్ (Oxytocic) వంటి లక్షణాలు ఉన్నాయి ., పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట (Acidity) వస్తుంది . దీనిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటుంది కావున కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి . ఉల్లి లో కేలరీలు శక్తి ఎక్కువ .. వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది . ఉల్లి ని అన్ని కూరలలో లో వాడుతారు . విందు భోజనాల్లో ఉల్లి పెరుగు చట్ని తప్పని సరిగా ఉంటుంది . వైద్య పరం గా ఉపయోగాలు : ఈ క్రింద జబ్బుల నివారణలో ఉల్లి ఉపయోగ పదును .
  • రక్తపోటు ,
  • గుండె జబ్బులు ,
  • ఆస్తమా ,
  • అల్లెర్జి ,
  • ఇన్ఫెక్షన్ ,
  • దగ్గు ,
  • జలుబు ,
  • నిద్రలేమి ,
  • ఉబకాయము ,
రకాలు 1. తెల్లనివి 2. ఎర్రనివి 3. చిన్నవి 4. పెద్దవి 5. ఎక్కువ వాసన కలవి 6. తక్కువ వాసన కలవి 7. తియ్యటివి ఉపయోగాలు
  • భారతీయ వంటలలో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. వివిధ రకాలైన కూరలు తయారుచేయడంలో దీనిని అనుబంధ పదార్ధంగా వాడతారు.
  • ఉల్లికాడలు కొన్ని రకాలైన ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు.
  • ఉల్లిపాయలనుంచి రసం తీసి అవసరాన్నిబట్టి 2 నుంచి 3 తులాలు తాగించి, అదే ఉల్లిపాయల ముద్దను పాము కాటుపై ఉంచి పట్టిస్తే పాము విషం, తేలు విషం, పిచ్చి కుక్క విషం హరిస్తాయి. ఇతర కీటకాలు ఏవైనా కుట్టినా దీని రసాన్ని పైన లేపనంగా రాస్తే మంట తగ్గుతుంది.
  • చెవిలో పోటు, మంట, నొప్పి వంటివి ఉంటే ఉడికించిన ఉల్లి పాయలనుంచి తీసిన రసాన్ని చుక్కలుగా వేస్తే బాధ తగ్గుతుంది. దీనిని క్రమం తప్ప కుండా వాడితే ఇతర చెవి బాధలు కూడా నయమవుతాయి.
  • మూర్ఛ వచ్చిన ప్పుడు ఉల్లిపాయ రసాన్ని రెండు మూడు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే తెలివి వస్తుంది.
  • వేసవికాలంలో ఉల్లిపాయలను మాలగా గుచ్చి చిన్న పిల్లలకు మెడలో వేస్తే వడదెబ్బ తగలదు. పెద్దవారు కూడా ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు ఒకటి రెండు ఉల్లిపాయలను తలమీద ఉంచుకుని, టోపీ పెట్టుకుని తిరిగితే వడదెబ్బ తగలదు.
  • ఉల్లిపాయ రసం, ఆవనూనె సమంగా కలిపి వేడి చేసి మర్దన చేస్తే అన్ని రకాలైన నొప్పులు తగ్గుతాయి.
  • మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజూ ఉదయంపూట తింటే రాళ్లు కరిగిపోతాయి.
  • దంతాలు నొప్పిగా ఉండి, దంతాలనుంచి రక్త కారుతుంటే, ఉల్లిపాయలను పేస్టులాగా నూరి దంతాలపై రాస్తే వెంటనే నయమవుతుంది.
  • ఉల్లిపాయల రసం, తేనె సమంగా కలిపి వేడి చేసి ప్రతి ఉదయం తీసుకుంటే వీర్యపుష్టి కలుగుతుంది.
  • జ్వరం, దగ్గు, అజీర్ణం, కడుపు నొప్పి, అతిసార, ఆర్శమొలలు మొదలైన వ్యాధుల్లో ఉల్లిపాయలను ఇతర అనుపానాలతో కలిపి తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి.
--Dr.Vandana Seshagirirao-MBBS,DOHM,DAc,MAMS.
  • ==========================================
Visit my web site --> Dr.seshagirirao.com/

No comments:

Post a Comment