Thursday, April 15, 2010

సొరకాయ ,Bottle gourd


సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ. ఆంగ్లములో Bottle gourd - (Lagenaria vulgaris N.O. Cucurbitaceae) అంటాము . అనప వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న జాతి కూరగాయ!.  

విటమిన్ - సి, బి.కాంప్లెక్క్ష్ , సొరకాయలో లబిస్తాయి . సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది , సులువుగా జీర్ణమవుతుంది .డయూరెటిక్ గా పనిజేస్తుంది . ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది . పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది , అలసటను తగ్గిస్తుంది .  

భౌతిక స్వరూపము సొర కాయ అనుకూల పరిస్తితులలో మిక్కిలి విరివిరిగా ప్రాకు మోటుజాతి . మలితీగలు రెండుగా చీలియుండును. పూవులు బీర పూవులకంటే కొంచెం పెద్దవి. మగ పూవులయందు పుష్పకోశము పొడవుగా ఉండును. ఆకర్షక పత్రములు క్రిందివరకు విడియుండును. తెలుపు, కింజల్కములు అన్నియూ జేరి యుండును. ఆడు పూవున దళవలయమును, పుష్పకోశమును నిడివియైన యండాశయముపై అమరియుండును.  

సాగు చేయుపద్దతి ఇవి అన్ని నేలలయందు పెరుగును. మంచిగా దున్నిన తరువాత సిద్దము చేసిన నేలలో2.5 - 3.5 మీటర్ల గోతులు తీసి వీటిని పెంచవలెను. ఆ గోతులలో పసువుల ఎరువును వేయవలెను.  ఎండిన సొర కాయపై తొడుగును, సొర కాయ బుర్ర అని పిలుస్తారు, దీనిలో నీరు పోసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళు అలవాటు కలదు. అందులో నీరు చల్లగా ఉంటాయి. దీనిని మనము నాచురల్‌ వాటర్‌ బాటిల్‌, నాచురల్‌ మినీ కూలర్‌గా ఉపయోగించవచ్చు! గుండ్రని సొర బుర్రలను వీణలుగా కూడా చేయుదురు.  

పుట్తుక .. చరిత్ర : మానవజాతికి ఏనాడో పరిచయం అయిన అతి ప్రాచీన కూరగాయ సొరకాయ. ఇది పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ ,,, క్రీస్తుపూర్వము 11,000 - 13000 సంవత్సరాల మధ్య పెరూ లో తొలిసారి సొరకాయ సాగు జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు .

 పోషకాలు : 100 గ్రాముల పచ్చి సొరకాయ లో ...
  • శక్తి : 12 కిలో కాలరీలు ,
  • ప్రోటీన్లు : 0.2 గ్రాములు ,
  • కార్బోహైడ్రేట్స్ : 2.5 గ్రాములు ,
  • ఫాట్స్ : 0.1 గ్రాములు ,
  • విటమిన్‌ ఎ : పుస్కలముగా ,
  • విటమిన్‌ సి : పుష్కలముగా .
  • ఖనిజలవణాలు : పుష్కలముగా ,
వంటలు 1. సొరకాయ వడియాలు 2. సొరకాయ పులుసు 3. సొరయాక టమాటో కూర 4. సొరకాయ సాంబారు
  • ================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment