Saturday, May 15, 2010

నేరేడు పండ్లు , Jamun Fruits


సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం. సిజిజియం క్యుమిన్‌ దీని శాస్త్రీయ నామము .
 • జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
 • కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
 • ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
 • జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
 • మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.
 • పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు.. మధుమేహ రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.
ఒక్క పండే కాదు.. నేరేడు చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఎంతో మేలుచేస్తాయి. ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం.. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టినచోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే.. ఉపశమనం లభిస్తుంది. బెరుడు నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడేవారికి 30ఎమ్‌.ఎల్‌ నీళ్లలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం ఉంటుంది. నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని 25 రోజులపాటు 30ఎమ్‌.ఎల్‌ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. నోట్లో పుండ్లు, చిగుళ్ల సమస్యలకు దీని కషాయం పుక్కిలిస్తే మార్పు ఉంటుంది. జాగ్రత్తలు: నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరవాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది. విరుగుడు: ఉప్పు, వేడినీరు. పోషకాలు (వందగ్రాముల్లో)
 • తేమ: 83.7గ్రా,
 • పిండి పదార్థం: 19 గ్రా,
 • మాంసకృత్తులు: 1.3గ్రా,
 • కొవ్వు: 0.1గ్రా,
 • ఖనిజాలు: 0.4గ్రా,
 • పీచుపదార్థం: 0.9గ్రా,
 • క్యాల్షియం: 15-30మి.గ్రా,
 • ఇనుము: 0.4మి.గ్రా-1మి.గ్రా,
 • సల్ఫర్‌: 13మి.గ్రా,
 • విటమిన్‌ సి: 18మి.గ్రా.
    వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్‌ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది. ఇలాంటప్పుడు నాలుగైదు నేరేడు పళ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడినీ తగ్గిస్తుంది.

* కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలానే ఇవి రక్తక్యాన్సర్‌ కారకాలను నిరోధిస్తాయని కూడా అవి తెలుపుతున్నాయి.

* నేరేడు పండ్లలో అధికమోతాదులో సోడియ, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మంగనీస్‌, జింక్‌, ఇరన్‌, విటమిన్‌, సీ, ఎ రైబోప్లెవిన్‌, నికోటిన్‌ ఆమ్లం, కొలైన్‌, ఫోలిక్‌, మాలిక్‌ యాసిడ్లు తగిన లభిస్తాయి. దానిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది.

* ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. నేరేడు ఆకులు యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కలిగి ఉన్నాయి. అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. నేరేడు రసాన్ని, నిమ్మరసంతో కలిపి తీసుకొంటే మైగ్రేన్‌కు పరిష్కారం లభిస్తుంది. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానిపోతాయి. ఇది మాత్రమే కాదు. దీనికి రక్తాన్ని శుద్ధి చేస్తే శక్తి కూడా ఉంది.

పోషక విలువలు మెండు – నేరేడు పండు -black berries

 ఎండాకాలం చివర్లో, వర్షాలు మొదలయ్యే సమయంలో కనిపించే పండు నేరేడు. దీనికి ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం ఉందని ఎన్నో పరిశోధనలు చేసిన వైద్యలు చెపుతున్నారు.అంతే కాదు ఐస్ క్రీం , వైన్ , జ్యూస్, జెల్లి, జాం వంటివి తయారు చేయడానికి ఈ పండును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పొటాషియం , ఫాస్పరస్, ఐరన్, కాల్షియం కూడా ఉన్నాయి. ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్  కూడా ఈ పండులో వున్నాయి.ఇన్ని మంచి పదార్థాలను కలిగిన ఈ పండు వల్ల మనకు కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం. ఈ చెట్లు మూడు రకాలుగా ఉంటాయి.

1) erect
2) trailing vines
3) semi -erect

ఈ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు.

1) నేరేడులోని ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. గింజల్లో జంబోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధి నివారణకు దోహదపడుతుంది. గింజలను ఎండబెట్టి పొడిచేసి రోజుకు రెండు సార్లు ఒక స్పూన్ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిపై చక్కని ప్రభావం చూపుతుంది అని డాక్టర్లు చెపుతున్నారు.

2) ఈ చెట్టు బెరడును నలగ్గొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి కషాయం చేసుకొని దానిలో తేనే కలుపుకొని తాగితే రక్త స్రావం తగ్గిపోతుంది.

3) చెవుల్లో నుంచి చీము కారడం వల్ల బాధ పడే వారికి ఇది చాలా మంచి మందు. ఆకులూ, పండ్లను దంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి రెండు చెవుల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. తొందరగా ఉపశమనం కలుగుతుంది.

4)  వైట్ డిశ్చార్జ్ తో బాధ పడేవారు ఈ చెట్టు వేర్లను దంచి ముద్ద చేసి బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి తీసుకుంటే రక్త హీనత, వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది.

5) అతి మూత్ర వ్యాధితో బాధ పడేవారు ఈ పండు గింజలను పొడి చేసి ఉదయం ఖాళీ కడుపుతో చన్నీళ్ళతో తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది.

6) కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు ఈ నేరేడు పండ్లను తినడం మంచిది. ఎందుకంటే ఈ పండులో సహజమైన యాసిడ్ లు ఉన్నాయి. అవి కాలేయాన్ని శక్తివంతం చేసి దాని పని తీరును మెరుగుపరుస్తాయి.

7) అర్షమొలలు (ఫైల్స్) తో బాధ పడే వారికి నేరేడు బాగా పని చేస్తుంది. ఈ పండ్లను అవి దొరికే కాలంలో ప్రతి రోజు ఉదయం ఉప్పుతో కలిపి  తింటే మంచి ఫలితం కలినిపిస్తుంది.

అంతే కాదండోయ్ ఇన్ని మంచి గుణాలు కలిగిన ఈ పండ్లను ఎక్కువగా తింటే గొంతు పట్టేసే అవకాశం కూడా ఉంది.
 • =======================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment