Thursday, October 28, 2010

నల్లబియ్యం , Black Rice

తెల్లగానే కాదు... నల్లగానూ ఉంటాయని మీకు తెలుసా..? చైనాలో ఎప్పట్నుంచో వినియోగిస్తున్న ఈ నల్ల బియ్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు "సూపర్ ఫుడ్"గా అభివర్ణిస్తున్నారు. వీటిలో చక్కెర తక్కువగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయని లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయం చేసిన అధ్యాయనంలో వెల్లడైంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లతో పోరాడటంలో దోహదం చేస్తాయని పరిశోధక్లు చెబుతున్నారు. "చెంచాడు నల్లబియ్యం తవుడులో బ్లాక్‍బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్ ఆక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర మోతాదు తక్కువగానూ పీచు, "విటమిన్ ఈ" ఎక్కువగానూ ఉన్నాయని అధ్యయానానికి నేతృత్వం వహించిన డాక్టర్ జిమిన్ జు పేర్కొన్నారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవటాన్ని ప్రోత్సాహించటానికి నల్లబియ్యం తవుడు ప్రత్యేకమైన, చవకైన మార్గమని ఆయన సూచించారు.
బ్లూబెర్రీలు, ఎండు మిరప వంటి పండ్లు, కూరగాయలకు ఈ యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఇవి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. డీఎన్‍ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వివరించారు. పూర్వకాలంలో ఈ నల్లబియ్యాన్ని "నిషిద్ద బియ్యం" అని పిలుచుకునేవారు. పురాతన చైనాలో కేవలం గొప్పవారికే వీటిని తినటానికి అనుమతి ఉండేది!
  • ================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment