Thursday, October 28, 2010

మాంసాహారము , శాకాహారము , Non-Vegeterian Food , Vegeterian food

మాంసాహారము , శాకాహారము అనేవి ఆ ఆహారమునకు ఉన్న రుచి వాసన బట్టి నిర్ణయించడం జరుగుతుంది . జీవులలో ఉన్న రక్తము లోని హీమోగ్లోబిన్‌(Hemoglobin) ఉనికిని బట్టి మాంస ఆహారము , శాక ఆహారము అని విడదీయడం జరిగినది . రక్తమాంసములతో కూడుకున్న జీవులనుండి వచ్చే ఆహారము = మాంసాహారము . శాఖలు ,కొమ్మలు ,ఆకులు గల జీవులనుంది వచ్చే ఆహారము = శాకాహారము . కొన్ని మొక్కలు కీటకాలను వేటాడి తింటాయని శాస్త్రము చెబుతోంది . కొన్ని జంతువు ఒక్క గడ్డి , ఆకులు , మొక్కలను మాత్త్రమే తింటూ బ్రతుకుతాయి . జీవుల జీవనవిధానము విచిత్రమైనది ... ప్రకృతి అధీనమయినది . ఈ ప్రకృతిలో ప్రతి జీవి పంచభూతాలు .... భూమి (మట్టి ), గాలి , నీరు , అగ్ని , ఆకాశము(space) నుండి పుట్టినవే .. చనిపోయి మళ్ళీ అందులోనే కలిసిపోతాయి . పంచావసరాలు జీవుల జీవన విధానానికి అవసరము . గాలి , నీరు , ఆహారము , నిద్ర , మైధునము(పునరుత్పత్తి) అనేవే పంచావసరాలు . భోజనము మితముగా తినాలి. కేవలం సత్విక్ ఆహారము మాత్రమే తినాలి.అంటే మాంసాహారము(కోడిగుడ్లు,చాపలు, మాంసము, మద్యసారము, పొగాకు,అదిక వుల్లిగడ్డలు,అదిక వెల్లుల్లి, అదిక ఉప్పు పదార్దాలు....) పూర్తిగా వదిలి పెట్టాలి. ఆహారంలో నియమాలు పాటించాలి.ఆహార నియమాలు పాటించడం వలన మనస్సుని అదుపులోకి తీసుకోవచ్చు. మాంసాహారము అంటే ప్రాణం తియ్యటమే కదా. బలవంతుడిదే రాజ్యము అన్న సూత్రాన్నిబట్టి, బలవంతుడైన మనిషికి బలహీనమైన ఇతర జీవాలు ఆహారమవడం ప్రకృతియొక్క నియమం. ఈ సృష్టిలో ఆహారచక్రంలో ఎవరి కార్యము వాళ్ళు చేస్తేనే, అంటే జింక గడ్డి మేయాలి, పులి జింకను తినాలి, పులి చచ్చి, కుళ్ళి గడ్డికి ఎరువుగా ఆహారం కావాలి. ఇందులో ఎవరు వాళ్ళ పని చేయకపోయినా ప్రకృతి పని భారమవుతుంది.
  • ====================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment