Tuesday, December 21, 2010

చలిని తగ్గించే ఆహారం,Food which is good in winter

చలికాలంలో పొగలుకక్కే సూపు.. వేడివేడి కమ్మని కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. అయితే మరీ వేడి పదార్థాలు స్వీకరించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అసలే ఈ కాలంలో రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటివేం ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇదిగో ఈ ఆహారానికి ప్రాధాన్యమివ్వండి. దానిమ్మ:
పోషకాల నిధి దానిమ్మ-- రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు, ఫాస్పరస్‌ సమృద్ధిగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని మరింత వృద్ధి చేస్తుంది. అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది. హృద్రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. చిలకడ దుంపలు:
ఇది చక్కటి పోషకాహారం. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. ఈ దుంపలో పీచు, కార్బోహైడ్రేట్లు, విటమిన్‌ 'ఎ', 'సి' ఖనిజలవణాలు, మాంగనీసు, రాగి అధికంగా లభిస్తాయి. వీటిని ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తరచూ తీసుకుంటే ఈ కాలంలో ఎదురయ్యే అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు. పాలకూర:
ఆకుపచ్చని కాయగూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.. ఈ కూరలో ఇంకా ఇనుము, క్యాల్షియం, సమృద్ధిగా దొరుకుతాయి. ప్రతిరోజూ పాలకూరను ఉడికించి గానీ, సూపు, రసం రూపంలో తీసుకొనే అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నువ్వులు:
నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే ఈ కాలంలో శరీరానికి అవసరమయ్యే వేడిని అందిస్తాయి. వీటిలో క్యాల్షియం, ఖనిజలవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం, రాగి సమృద్ధిగా లభిస్తాయి. నువ్వులతో తయారు చేసిన పదార్థాలను భోజనం తరవాత తీసుకుంటే అరుగుదల బాగుంటుంది. ఇవి చర్మానికి తేమను అందించడానికి తోడ్పడతాయి.Add Image వేరుసెనగలు:
ఈ గింజల్లో విటమిన్‌ 'ఇ', 'బి3' లభిస్తుంది. అలానే గుండెకు మేలు చేసే మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మంచిది. వేరుసెనగ గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అవి చర్మంలో తేమ శాతాన్ని పెంచుతాయి. జొన్నలు:
జొన్నలను కనీసం వారంలో ఒక్కరోజైనా తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల కండరాల కదలిక చక్కగా ఉంటుంది. నొప్పులు కూడా దూరంగా ఉంటాయి. జొన్నతో చేసే పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధులు దూరంగా ఉంటాయి.
  • ============================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment