Wednesday, March 23, 2011

మారేడు లేదా బిల్వము ,Bael (Fruit)

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....

మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే. మారేడు లేదా బిల్వము (Bael) హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. వీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి యుంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసన గా యుంటుంది.

యిందులో గల పదార్థాలు :

మినరల్స్, విటమిన్స్, చాలా యుంటాయి. కాల్షియం , పాస్పరస్ , ఇనుము , కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిన్ ముఖ్యమైనవి.మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలున్నాయి.


. ఉపయోగాలు:
 మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.
 • అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు.
 • ఆయుర్వేదములో వాడు దశమూలములలో దీని వేరు ఒకటి.
 • మొలలకు ఇది మంచి ఔషధము.
 • దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
 • బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల క్షాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది .
 • కడుపు లోను , పేగుల్లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు , ఫలాలకు ఉన్నది ,
 • మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు , ఫలాలకు ఉన్నది ,
 • బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితె రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది .
 • బిల్వ వేరు , బెరడు , ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి.
 • క్రిమి , కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది . 

Bael leaves reduce obesity,వూబకాయానికి మారేడు మందు

మారేడు ఆకులకు వూబకాయాన్ని తగ్గించే గుణముందని మీకు తెలుసా? మొహాలీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌) పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయమే వెల్లడైంది. కమలేశ్‌ కె. భుటానీ నేతృత్వంలోని పరిశోధకులు మారేడు ఆకుల్లోని అంబెలీఫెరోన్‌, ఎస్క్యూలెటిన్‌ అనే రసాయనాలు వూబకాయాన్ని సమర్థవంతంగా తగ్గిస్తున్నట్టు గుర్తించారు. అధిక కొవ్వుతో కూడిన ఆహారం తినిపించి పెంచిన ఎలుకలకు ఈ రసాయనాలను ఇవ్వగా.. వాటిల్లో ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్‌, గ్లూకోజు స్థాయులతో పాటు బరువు కూడా గణనీయంగా తగ్గినట్టు తేలింది. కడుపు చుట్టూ పేరుకునే కొవ్వును తగ్గించటం ద్వారా ఈ రసాయనాలు పనిచేస్తున్నట్టు వెల్లడైంది. మారేడు ఆకుల్లోనే కాదు మారేడు పండ్లలోనూ ఈ రసాయనాలు ఉండటం విశేషం.
 • ====================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment