Sunday, March 20, 2011

Kokam Fruits , కోకమ్‌ పండ్లు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... కొన్ని పండ్ల పేర్లు వింటాం గానీ చూడడం అరుదే. మార్కెట్లో కనిపించినా ఏ కొద్దిరోజులో కనిపించి మాయమైపోతాయి. అలా ఈ వేసవిలోనూ అదీ అరుదుగా మాత్రమే కనిపించే కొన్ని రకాల పండ్లలో కోకం పండ్లు గురించి. ఎండుపండ్ల రూపంలో షర్బతుల్లో జ్యూస్‌ల్లో వాడే కోకమ్‌ పండ్లు పుష్కలంగా దొరికే కాలం కూడా ఇదే. వేసవి వచ్చిందంటే కోకమ్‌ చెట్టునిండా నోరూరించే ముదురు ఎరుపు లేదా వంకాయరంగు పండ్లే. సీజన్‌లో వీటిని ఉప్పు అద్దుకుని తింటుంటారు. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఎండబెట్టిన కోకమ్‌ పండ్లు మాత్రం అంతటా దొరుకుతాయి. మామిడితరుగులానే దీన్ని పులుపుకోసం అనేక వంటల్లో వాడతారు. అందుకే ఈ సీజన్‌లో కాసే పండ్ల తొక్కల్నీ లోపలున్న తెల్లని గింజల్నీ వేరుచేసి ఎండబెడతారు. గింజల్ని నూనె పట్టిస్తారు. తొక్కల్ని ఉప్పు లేదా పంచదార కలిపి ఎండబెడతారు. కోకమ్‌లో ఔషధగుణాలు చాలా ఎక్కువ. ముక్కల్ని నానబెట్టి చేసే జ్యూస్‌ వేసవిలో శరీరానికి చల్లదనాన్నిస్తూ దాహార్తిని తీరుస్తుంది. చింతపండు రుచితో ఉండే కోకమ్‌ తరుగు లేదా సిరప్‌ను కూరలు, సూప్‌ల తయారీలోనూ వాడుతుంటారు. * ఇది జీర్ణక్రియను పెంచి, గుండె పనితీరుని మెరుగుపరుస్తుందట. కొలెస్ట్రాల్‌ని తగ్గించి బరువు తగ్గడానికీ దోహదపడుతుందట. * యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో కణ పునరుద్ధరణకు తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలినవాళ్లకి పండ్లను పంచదార పాకంలో మరిగించే చేసే జ్యూస్‌ ఎంతో మంచిది. చూశారుగా మరి... మధురమైన పేషన్‌ ఫ్రూట్‌లోనూ పుల్లని కోకమ్‌లోనూ తియ్యని స్టార్‌ఫ్రూట్‌లోనూ మంచిగుణాలెన్ని ఉన్నాయో. కాబట్టి మీ పెరటితోటలో ఇవి ఉంటే వేసవి దాహార్తిని తీర్చే శీతలపానీయాలకోసం పరుగులు తీయాల్సిన అవసరమే లేదు. వీలయితే వెంటనే నాటేయండి... లేదంటే ఎక్కడ పండ్లు కనిపించినా కొనడం మాత్రం మరువకండి..!
  • ================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment